Latest Jobs News: తెలంగాణ విద్యాశాఖలో 27,618 ఉద్యోగాల భర్తీకి లైన్‌క్లియర్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?
కాంట్రాక్ట్ పద్ధతిలో 25,728 మందిని, అలాగే ఔట్ సోర్సింగ్ విధానంలో 1890 మందిని నియమించనున్నది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రాస్ జూలై 20వ తేదీ (బుధవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని స్పష్టం చేశారు.
ఈ ఉద్యోగాల భర్తీ ఇలా..
కేజీబీవీల్లోని పలు విభాగాల్లో 12,824 మందిని కాంటాక్ట్ పద్ధతిన, మోడల్ స్కూల్స్‌లోని గర్ల్స్ హాస్టళ్లలో 1152 మందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించనున్నారు. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 528 మందిని, అలాగే అర్బన్ రెసిడెన్షియల్ హాస్టళ్లలో 13 మందిని, యూపీఎస్, హైస్కూల్స్‌లో కలిపి 6219 మందిని, స్కూల్ కాంప్లెక్స్ లెవల్‌లో 2117 మందిని, డిస్ట్రిక్ ప్రాజెక్ట్ ఆఫీస్‌లో 27 మందిని కాంట్రాక్ట్ పద్ధతిన, 50 మందిని ఔట్ సోర్పింగ్ విధానంలో నియమించనున్నారు.
ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
అత్యధిక ఖాళీలు విద్యాశాఖలోనే.. కానీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సర్కారు కొలువుల జాబితాలో అత్యధిక ఖాళీలు విద్యాశాఖలో ఉండటంతో నిరుద్యోగుల దృష్టి అంతా టీచరు పోస్టులపై కేంద్రీకృతమైంది. కొత్త జోన్లు, జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానుంది. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం ఫైనలియర్‌లో ఉన్న అభ్యర్థులకు కూడా కలిసి వచ్చే విధంగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం సుమారు 842కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదించినట్లు తెలుస్తోంది. ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
25 వేలమందికిపైగా..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 25 వేలమందికిపైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా టీఆర్టీ నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీని నిర్వహించగా ఇప్పటివరకు ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. ఈసారి ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ అవుతాయనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 4,700 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తి చేస్తున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీల జాతర..
గ్రేటర్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీల జాతర కొనసాగుతోంది. పదవీ విరమణ, పదోన్నతులు, బదిలీలతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి చతికిలపడి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు భరించలేక సర్కారు బడుల్లో తమ పిల్లలను పెద్ద ఎత్తున చేర్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతోపాటు విద్యా వలంటీర్లకు కూడా అనుమతి లభించకపోవడంతో ఉన్న ఉపాధ్యాయులపై పనిభారం పడుతోంది.
Government Jobs: ఈ టిప్స్ పాటిస్తే ప్రభుత్వ ఉద్యోగం మీదే..!