Skip to main content

TS DSC Notification: ఈ జిల్లాలో 325 ఉపాధ్యాయ ఖాళీలు..

TS Mega DSC Notification    Government Initiates Mega DSC for Teacher Vacancies

వికారాబాద్‌ అర్బన్‌: ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఒకటి రెండు రోజుల్లో మెగా డీఎస్సీ వేస్తున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తాజాగా ఏర్పడిన ఉపాధ్యాయ ఖాళీల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులకు పంపారు. గత ప్రభుత్వం డీఎస్సీ నిర్వాహణకు షెడ్యూల్‌ ప్రకటించినా ఎన్నికల కోడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. పైగా గతంలో ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయని, జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులో కనీసం 50శాతం కూడా భర్తీ చేయడం లేదని అప్పట్లో నిరుద్యోగులు ఆందోళనలు చేశారు. గత డీఎస్సీ నోటిఫికేషన్‌లో జిల్లాలో కేవలం 191 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ విషయం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేసింది. కొత్త ప్రభుత్వంలో వెలువడే నోటిఫికేషన్‌లో వికారాబాద్‌ జిల్లాలో 325 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

2017 తరువాత ఇప్పుడే..
2017లో టీఆర్‌టీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం తిరిగి ఇప్పుడే పోస్టులను భర్తీ చేస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తుందనే ఆశతో నిరుద్యోగులు ఎదురు చూశారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. అయితే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రకటనతో ఒక్కసారిగా నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఈ ఆరేళ్ల కాలంలో జిల్లాలో వేల మంది విద్యార్థులు డైట్‌, బీఎడ్‌ పూర్తి చేసి టెట్‌ క్వాలిఫై అయి డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.

చదవండి: TS DSC Notification Released: 11వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవే..

జిల్లాలో పెరిగిన పోస్టుల సంఖ్య
317 జీవో అమలు సమయంలో జిల్లా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను సేకరించారు. జీవో అమలు పూర్తయ్యాక ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం మరోమారు విద్యాశాఖ అధికారులు ఖాళీల లెక్కలను తీశారు. దీంతో జిల్లాలో అన్ని సబ్జెక్టులు కలిపి 325 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. అయితే జిల్లాలో ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు ఈ డీఎస్సీలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే చాలా కాలంగా ఎదురు చూస్తున్న టీఆర్‌టీ నిరుద్యోగులకు ఎంతో మేలు జరగనుంది.

లాంగ్వేజ్‌ గ్రేడ్‌ –2 పోస్టులు ఇవే..

  • లాంగ్వేజ్‌ పండిత్‌ హిందీలో గవర్నమెంట్‌ ఒకటి, లోకల్‌ బాడీ 10
  • సంస్కృతంలో గవర్నమెంట్‌ స్కూల్‌లో ఒకటి పోస్టు ఉంది.
  • తెలుగు గవర్నమెంట్‌ 1, లోకల్‌ బాడీలో 7 పోస్టులు ఉన్నాయి.
  • ఉర్దూలో గవర్నమెంట్‌ 1, లోకల్‌ బాడీలో 2 పోస్టులు ఉన్నాయి.
  • పీఈటీ తెలుగు మీడియంలో లోకల్‌ బాడీలో 5 పోస్టులు ఉన్నాయి.

స్కూల్‌ అసిసెంట్‌ పోస్టులు

  • స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలకు వస్తే బయోలాజికల్‌ సైన్స్‌ లోకల్‌ బాడీలో 21
  • ఇంగ్లిష్‌ సబ్జెక్టు, గవర్నమెంట్‌లో 1, లోకల్‌ బాడీలో 22 పోస్టులు ఉన్నాయి.
  • హిందీ సబ్జెక్టు లోకల్‌ బాడీలో 3 పోస్టులు ఉన్నాయి.
  • మ్యాథ్స్‌ (తెలుగు మీడియం) గవర్నమెంట్‌లో 1, లోకల్‌ బాడీలో 8, మ్యాథ్స్‌ (ఉర్దూ మీడియం)లో గవర్నమెంట్‌ 1, లోకల్‌బాడీ కింద 2 పోస్టులు ఉన్నాయి.
  • ఫిజిక్స్‌ (ఇంగ్లిష్‌ మీడియం) లోకల్‌ బాడీకింద 3, ఫిజిక్స్‌ (తెలుగు మీడియం) లోకల్‌ బాడీ కింద 4, ఫిజిక్స్‌ (ఉర్దూ మీడియం)లో గవర్నమెంట్‌ 1, లోకల్‌ బాడీలో 1 పోస్టు ఉంది.
  • సోషల్‌ (తెలుగు మీడియం) లోకల్‌ బాడీలో 23, ఉర్దూ మీడియం లోకల్‌ బాడీ కింద 2 పోస్టులు ఉన్నాయి.
  • ఎస్‌ఏ తెలుగు గవర్నమెంట్‌ 1, లోకల్‌ బాడీలో 6
  • ఎస్‌ఏ ఉర్దూ లోకల్‌ బాడీలో 2 పోస్టులు ఉన్నాయి.
  • ఎస్‌జీటీ తెలుగు మీడియంలో గవర్నమెంట్‌ 6, లోకల్‌ బాడీలో 163 పోస్టులు ఉన్నాయి.
  • ఎస్‌జీటీ ఉర్దూ మీడియంలో గవర్నమెంట్‌ 9, లోకల్‌ బాడీలో 17 పోస్టులు ఉన్నాయి.

స్కూల్‌ అసిస్టెంట్‌ – 93
ఎస్‌జీటీ – 195
లాంగ్వేజ్‌ పండిత్‌ (ఎస్‌ఏ) – 9
లాంగ్వేజ్‌ పండిత్‌ గ్రేడ్‌ –2 – 23
పీఈటీ – 5
 

Published date : 01 Mar 2024 12:14PM

Photo Stories