Women Achieves Goal: మొదటి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఉద్యోగం
చిలుకూరు మండలం పరిధిలోని జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన పందిరి అమృతరెడ్డి లక్ష్మి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. వీరి రెండో కుమార్తె ప్రియాంక ఎంటెక్ పూర్తి చేసింది. ఈమె సోదరి తేజస్విని జైలు వార్డెన్‌గా పనిచేస్తుండగా తమ్ముడు శ్రీకాంత్‌రెడ్డి సివిల్ ఇంజనీర్ పూర్తి చేశాడు.
Civils Achievement: తండ్రి ఆశయాన్ని విజయవంతం చేసిన కుమార్తె
ప్రియాంక పదో తరగతి వరకు జెర్రిపోతులగూడెంలో, ఇంటర్, ఇంజనీరింగ్ కోదాడలో, ఎంటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. తన చదువును పూర్తి చేసిన తరువాత ఆపై చదువును కూడా పూర్తి చేయాలనుకొని సివిల్ ఎస్ఐగా ముందుకు వెళ్ళాలని ఆశించింది. అందుకు, ఆమె తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఆశయం కోసం తనను ప్రోత్సహించి ముందుకు నడిపించారు.
అలా, తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐగా ఉద్యోగం సాధించడం ఎంతో సంతోషంగా ఉందంటోంది.. ప్రియాంక. ఆమెను ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య, జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబుతో పాటు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.