Skip to main content

JNTU Anantapur: విదేశీ విద్యకు మార్గం సుగమం

way for foreign education

అనంతపురం: డాలర్‌ డ్రీమ్‌ ఇప్పటి యువత కల. ఇందు కోసం విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడాలని భావిస్తోంది. ఈ కలను సాకారం చేసుకోవాలంటే పొరుగు దేశం వెళ్లి ఏదైనా కోర్సు చేయాలి. లేదా ఆ దేశం నుంచి వీసా పొందాలి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాలి. ఇలాంటి వ్యయ ప్రయాసలకు చెక్‌ పెట్టి విదేశాల్లో ఎంఎస్‌ పూర్తి చేసే కలను జేఎన్‌టీయూ(ఏ) సాకారం చేస్తోంది. ఇప్పటికే స్వీడన్‌లోని బ్లెకింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుని పలు కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీకి అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా స్వీడన్‌ బ్లెకింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, ఈసీఈ విభాగాల్లో సీట్లు భర్తీ చేస్తోంది.


ఈ ఏడాది 12 అడ్మిషన్లు..
జేఎన్‌టీయూ (ఏ), బ్లెకింగ్‌ వర్సిటీ సంయుక్తంగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో 2023–24 విద్యా సంవత్సరానికి 12 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇంటిగ్రేటేడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌లో 10 మంది, ఇంటిగ్రేటేడ్‌ ప్రోగ్రాం ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ , మెషిన్‌ లర్నింగ్‌లో ఇద్దరు అడ్మిషన్లు పొందారు. బీటెక్‌ కోర్సులో మూడు సంవత్సరాలు జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్‌లోనూ, చివరి సంవత్సరం స్వీడన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్సు పూర్తి కాగానే డిగ్రీని జేఎన్‌టీయూ(ఏ) ప్రదానం చేస్తుంది. బీఎస్‌ పట్టాను బ్లెకింగ్‌ వర్సిటీ (స్వీడన్‌) అందిస్తుంది.

చదవండి: APPSC Group 1 & 2 Jobs Notification 2023 : ఈలోపే గ్రూప్-1 & 2 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌.. అలాగే ఈ ఉద్యోగాల‌కు కూడా..


ఫీజులు అందుబాటులోనే..
ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు సంబంధించి ఫీజులు కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. జేఎన్‌టీయూ(ఏ)కు ఏడాదికి రూ.1.50 లక్షలు, స్వీడన్‌లో ఏడాదికి రూ.7 లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఈఏపీసెట్‌ లేదా జేఈఈలో అర్హత సాధించిన వారు అర్హులు. ఇంటర్మీడియట్‌ ఎంపీసీలో కనీసం 60 శాతం మార్కుల ఉత్తీర్ణత పొంది ఉండాలి.

జేఎన్‌టీయూ(ఏ)లో చేరితే స్వీడన్‌లో చదువుకోవచ్చు డ్యూయల్‌ డిగ్రీ విధానంపై బ్లెకింగ్‌ వర్సిటీతో ఒప్పందం

Published date : 18 Aug 2023 02:54PM

Photo Stories