Department of Finance: డీపీహెచ్ పరిధిలో కొత్తగా 33 పోస్టులు.. మంజూరైన పోస్టుల వివరాలు ఇలా..
అందులో ఐదు డీఎంహెచ్‌వోలతో పాటు డీపీహెచ్ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన 28 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ జూలై 20న ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరు చేసిన డీఎంహెచ్‌వోలన్నీ హైదరాబాద్ జిల్లా పరిధిలోనివే. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం డీఎంహెచ్‌వోల సంఖ్య 38కి పెరగనుంది.
సుమారు కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఒక్క డీఎంహెచ్‌వో పోస్టుతో పర్యవేక్షణ కష్టంగా మారిందని, జీహెచ్‌ఎంసీ తరహాలో ఆరు జోన్లకు ఒక్కో డీఎంహెచ్‌వోను నియమించాలని గత మే 19న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కొత్తగా మంజూరు చేసిన పోస్టులతో రాష్ట్రంలో వైద్య సేవలు మరింత మెరుగపడనున్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంపై పర్యవేక్షణ పెరుగుతుందని, వ్యాధుల నివారణ, నియంత్రణ, చికిత్స ప్రక్రియలు మెరుగుపడి, అన్ని స్థాయిల్లో మెరుగైన వైద్యం అందుతుందని ట్వీట్ చేశారు.
చదవండి: Medical Health Department: ఈ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ:
వైద్యారోగ్య శాఖలో కారుణ్య నియామకాల కోసం 1,266 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1266 దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను సూపర్ న్యూమరీ కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసింది. జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది.
చదవండి: Jobs: 2,118 పోస్టుల మంజూరు.. మరో మూడు కొత్త కళాశాలల
కొత్తగా మంజూరైన పోస్టుల వివరాలు...
- అడిషనల్ డైరెక్టర్ (అడ్మిన్) –1
- జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్) – 1
- డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) –1
- అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్– స్టేట్ క్యాడర్) – 3
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్టేట్ క్యాడర్) – 4
- ఆఫీస్ సూపరింటెండెంట్ – 6
- సీనియర్ అసిస్టెంట్ – 12
- డీఎంహెచ్‌వో – 5
- కారుణ్య నియామకాల కోసం 1266 పోస్టుల అప్‌గ్రేడ్