Skip to main content

169 Constable Jobs in CRPF: సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎంపిక విధానం, మార్కుల కేటాయింపు ఇలా..

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఒకటైన సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌).. పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగా స్పోర్ట్స్‌ కోటా కింద గ్రూప్‌–సి విభాగంలో కానిస్టేబుల్‌(జనరల్‌ డ్యూటీ) నాన్‌ –గెజిటెడ్‌ అండ్‌ నాన్‌ మినిస్టీరియల్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Constable Recruitment   Vacancy Announcement  Group-C Category   CRPF Recruitment 2024 For Constable Jobs exam pattern selection process

మొత్తం పోస్టులు: 169 
క్రీడా విభాగాలు
జిమ్నాస్టిక్స్,జూడో, వుషు, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్‌ ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్, తైక్వాండో, వాటర్‌ స్పోర్ట్స్‌ కయాక్, కానో, రోయింగ్, బాడీ బిల్డింగ్, వెయిట్‌ లిఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రత్లాన్, డైవింగ్, డైవింగ్‌ ఈక్వెస్ట్రియన్, యాచింగ్, ఐస్‌ హాకీ, ఐస్‌ స్కేటింగ్, ఐస్‌ స్రీయింగ్‌.

అర్హతలు
అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణత సాధించి.. నిర్ది­ష్ట శారీరక సామర్థ్యంతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత ఉండాలి. 15.02.2024నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో జనరల్‌ అభ్యర్థులకు 5ఏళ్లు,ఎస్సీ,ఎస్టీలకు 10ఏళ్లు, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)లకు 8ఏళ్లు, డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు లభిస్తుంది.

శారీరక ప్రమాణాలు
పురుష అభ్యర్థులు ఎత్తు 170 సెం.మీ, ఛాతీ 80 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ పెరగాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ పురుష అభ్యర్థులు 162 సెం.మీ, ఛాతీ 76 సెం.మీ ఉండాలి. మహిళా అభ్యర్థులు ఎత్తు 150 సెం.మీ ఉండాలి. అలాగే అభ్యర్థులకు వర్ణ అంధత్వం, ఇతర సంబంధిత సమస్యలు ఏమీ ఉండకూడదు.

ఎంపిక ఇలా

  • క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్‌ ట్రయల్‌ టెస్ట్, వైద్య పరీక్షలు, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే 01.02.2021 నుంచి 31.12.2023 మధ్య వివిధ క్రీడల్లో పాల్గొని పొందిన పతకాల ఆధారంగా మార్కులు ఇస్తారు.
  • 01.01.2021 నుంచి 31.12.2023 వరకు జరిగిన వివిధ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన అభ్యర్థులకు మాత్రమే అడ్మిట్‌ కార్డులు జారీ చేస్తారు. తర్వాత వీరికి ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), డీటెయిల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి..అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మార్కుల కేటాయింపు

  • వివిధ క్రీడా పోటీల్లో సాధించిన పతకాలను బట్టి మార్కులు ఇస్తారు. 
  • ఒలింపిక్‌ గేమ్స్‌/సమ్మర్‌/వింటర్‌ పోటీలు: బంగారు పతకానికి–100, వెండికి–96, కాంస్యానికి–92, పాల్గొన్నవారికి 80 మార్కులు ఇస్తారు.
  • వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌/వరల్డ్‌ కప్‌: బంగారు 90, వెండి –86, కాంస్యానికి–82, పాల్గొంటే 70 మార్కులు.
  • ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌/కప్‌/కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌: బంగారు–70, వెండికి–66, కాంస్యానికి–62, పాల్గొంటే 50 మార్కులు.
  • యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌: బంగారుకు–60, వెండికి–56,కాంస్యానికి–52,పాల్గొంటే 40మార్కులు
  • యూత్‌/జూనియర్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌ అండ్‌ యూత్‌/జూనియర్‌ కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌: బంగారుకు–50, వెండికి–46, కాంస్యానికి–42, పాల్గొంటే 30 మార్కులు.
  • సాఫ్‌ గేమ్, ఇతర అంతర్జాతీయ పోటీలు: బంగారుకు–40, వెండికి–36, కాంస్యానికి–32, పాల్గొంటే 26 మార్కులు.
  • నేషనల్‌ గేమ్స్, సీనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ ఇండివిడ్యువల్‌ మెడల్‌ విభాగం: బంగారుకు 30, వెండికి–26, పాల్గొంటే 22 మార్కులు.
  • టీమ్‌ మెడల్‌ ఇన్‌ ఇండివిడ్యుయల్‌ స్పోర్ట్స్‌: బంగారుకు–26, వెండికి–22, కాంస్యానికి 18 మార్కులు.
  • టీమ్‌ మెడల్‌ ఇన్‌ ఇండివిడ్యువల్‌ స్పోర్ట్స్‌: బంగారుకు–16, వెండికి–12, కాంస్యానికి 8 మార్కులు

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 15.02.2024
  • వెబ్‌సైట్‌: https://recruitment.crpf.gov.in/
     

చదవండి: Indian Coast Guard Recruitment 2024: భారత తీర రక్షక దళంలో 260 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 09 Feb 2024 10:51AM

Photo Stories