విజ్ఞానశాస్త్ర నిర్మాణానికి మూలం?
1. విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు ’Love for the profession, for the subject, for the students' అనే మూడు లక్షణాలు కలిగి ఉండాలని పేర్కొన్న వారెవరు?
1) కొఠారి
2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) మహాత్మా గాంధీ
4) సోక్రటీస్
- View Answer
- సమాధానం: 2
2. విజ్ఞానశాస్త్ర బోధకులకు వృత్యంతర శిక్షణ అవసరమని సూచించింది ఎవరు?
1) కొఠారి
2) రాధాకృష్ణన్
3) NPE 1986
4) NCF 2005
- View Answer
- సమాధానం: 3
3. ఒక ఉపాధ్యాయుడు సి.వి. రామన్‌ను ఆదర్శంగా తీసుకొని బోధన కొనసాగిస్తే కింది వాటిలో దేన్ని అత్యుత్తమైందిగా తీర్చిదిద్దాలి?
1) ప్రయోగశాలను
2) విజ్ఞానశాస్త్ర తరగతి గదిని
3) విజ్ఞానశాస్త్ర క్లబ్‌ను
4) విజ్ఞానశాస్త్ర వస్తు ప్రదర్శనశాలను
- View Answer
- సమాధానం: 2
4. క్రికెట్ ఆటగాడు బంతిని విసరడానికి దాన్ని తన దుస్తులకు ఎందుకు అనేకసార్లు రుద్దుతాడో విద్యార్థి కారణాలను విశ్లేషిస్తే ఈ స్థాయి 5ఉ నమూనాలో దేనికి చెందుతుంది?
1) విస్తరణ
2) వివరించడం
3) విశ్లేషణ లేదా శోధన
4) మూల్యాంకనం
- View Answer
- సమాధానం: 1
5. ‘సరి చూడగల విజ్ఞాన రాశి’ అని విజ్ఞాన శాస్త్రం దేన్ని పేర్కొంది?
1) నియమం
2) సత్యం
3) యదార్థం
4) ప్రయోగం
- View Answer
- సమాధానం: 4
6. ‘పర్యావరణాన్ని కాపాడటమే సమస్త జీవులకు రక్ష’ అని వివరించడంలో విద్యార్థి చేరుకున్న వర్గం?
1) వ్యవస్థాపనం
2) శీలస్థాపనం
3) ప్రతిస్పందించడం
4) విలువ కట్టడం
- View Answer
- సమాధానం: 2
7. విద్యార్థి ప్రావీణ్యం ఉన్నత స్థాయికి చేరుకోవడం ఏ దశలో జరుగుతుంది?
1) అనుకరణ
2) సునిశితత్వం
3) సమన్వయం
4) సహజీకరణ
- View Answer
- సమాధానం: 2
8. ‘నైపుణ్యాలు అనేవి స్వభావంగా మారడం, మానసిక శక్తుల ప్రమేయం లేకుండానే కార్యాలు నిర్వహించడం’ అనేది ఏ లక్షణం?
1) సునిశితత్వం
2) అనుకరణ
3) సహజీకరణ
4) సమన్వయం
- View Answer
- సమాధానం: 3
9. ‘జింక్ ముక్కలు.. హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో రసాయన స్థానభ్రంశ చర్య జరిపి జింక్ క్లోరైడ్‌ను, హైడ్రోజన్ అనే వాయువును ఏర్పరుస్తాయి’ అని విద్యార్థి విజ్ఞానశాస్త్ర పదజాలంలో చెప్పడం ఏ నైపుణ్యం?
1) పరిశీలనా నైపుణ్యం
2) అభివ్యంజన నైపుణ్యం
3) హస్త నైపుణ్యం
4) ప్రయోగ నైపుణ్యం
- View Answer
- సమాధానం: 2
10. ‘విజ్ఞాన శాస్త్రంలో కృత్యాలు లేనిదే పాఠ్యాంశం లేదు’ అనే దృఢ విశ్వాసం వెలిబుచ్చిన వారెవరు?
1) పియాజే
2) వైగోట్క్సీ
3) నోవాక్
4) పోస్నర్
- View Answer
- సమాధానం: 1
11. యదార్థానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) వివాద రహితంగా, మారనివిగా ఉండాలి
బి) యదార్థాలన్నీ శాస్త్రీయ సత్యాలు కావు
సి) ప్రత్యక్షంగా పరిశీలించదగినదై, తగిన ఆధారాలతో రుజువు చేయాలి
డి) యదార్థాలన్నీ శాస్త్రీయ సత్యాలు
1) ఎ, బి, డి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
12.యదార్థాల నుంచి తార్కికంగా ఒక విషయాన్ని నిగమనం చేయడాన్ని ఏమంటారు?
1) ప్రయోగం
2) అనుమితి
3) సూత్రం
4) నియమం
- View Answer
- సమాధానం: 2
13. భావనలను నియమ బద్ధం చేసి వివరిస్తే అవి?
1) సూత్రాలు
2) నియమాలు
3) సాధారణీకరణాలు
4) సిద్ధాంతం
- View Answer
- సమాధానం: 3
14. సప్రమాణత కలిగి ఉండి, రెండు యదార్థాల మధ్య సంబంధాన్ని వివరించేవి?
1) భావనలు
2) నియమాలు
3) సాధారణీకరణాలు
4) సిద్ధాంతాలు
- View Answer
- సమాధానం: 2
15. విద్యార్థి ‘మొక్కలను పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు అని రెండు రకాలుగా వర్గీకరించారు’ అని పేర్కొంటే అతడు సాధించిన లక్ష్యం?
1) జ్ఞానం
2) వినియోగం
3) నైపుణ్యం
4) అవగాహన
- View Answer
- సమాధానం: 1
16. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) మానవ నాగరికత మెసొపొటేమియా, ఈజిప్ట్ మరికొన్ని ప్రదేశాల్లో ప్రారంభమైంది
బి) చైనా నాగరికత మెసొపొటేమియా నాగరికత తర్వాత అభివృద్ధి చెందింది
సి) రోమన్లు అనువర్తిత విజ్ఞానశాస్త్రంలో కుతూహలం చూపారు
డి) అణువుల గురించి, భూమి ఏర్పడిన విధానం గురించి భారత్‌లో ముండకోపనిషత్లో వివరించారు
1) ఎ, బి, డి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
17. కింది వాటిలో సరికానిది ఏది?
1) 1916లో థామస్ రిపోర్ట్ ఫలితంగా విజ్ఞాన శాస్త్రంలో అత్త్యున్నత కోర్సులు ప్రారంభించారు
2) ఈజిప్షియన్లు గోడ గడియారం, నీటి గడియారం, నీడ గడియారాలను కనుగొన్నారు
3) గెలిన్ క్రీ.శ. 131 201లో జంతువుల విచ్ఛేదనం చేసి, వాటి లోపలి భాగాలను వివరించాడు
4) 1905లో డార్విన్ థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుగొన్నారు.
- View Answer
- సమాధానం: 4
18. శాస్త్రవేత్తలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) B9, ఫోలిక్ ఆమ్లాలను విశ్లేషించి అనీమియా వ్యాధికి చికిత్స కనుగొన్నవారు - సుబ్బారావు
బి) ఆంత్రాక్స్ వ్యాధికి ఔషధాన్ని కనుగొన్నవారు - పాశ్చార్
సి) కొత్త పరికరాలు తయారు చేసే మంత్రగాడిగా పేరొందినవారు - ఐన్‌స్టీన్
డి) 1945లో పరమాణు బాంబుల తయారీకి ఉపయోగపడిన సిద్ధాంతం - థియరీ ఆఫ్ ఆటమ్
1) ఎ, డి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) బి, డి మాత్రమే
4) ఎ, బి మాత్రమే
- View Answer
- సమాధానం: 4
19. శాస్త్రీయ పద్ధతిలో మొదట దత్త సేకరణకు ప్రాకల్పనల రూపకల్పనకు తోడ్పడే సోపానం ఏది?
1) దత్తాంశాల ప్రతిక్షేపణ
2) సమస్యలను నిర్వచించడం
3) ప్రాకల్పనలను ప్రతిపాదించడం
4) సమస్య విశ్లేషణ లేదా లక్ష్య నిర్ధారణ
- View Answer
- సమాధానం: 4
20. ‘విజ్ఞానశాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి’ అని పేర్కొన్నవారు?
1) ఐన్‌స్టీన్
2) ఎ.డబ్ల్యూ. గ్రీన్
3) కార్ల పియర్సన్
4) లెక్సెకన్ వెబ్ డిక్షనరీ
- View Answer
- సమాధానం: 1
21. కింది వాటిలో విజ్ఞాన శాస్త్ర లక్షణాల్లో షో ఆల్టర్ ప్రతిపాదనలో లేనిది ఏది?
ఎ) శాస్త్రీయ జ్ఞానం మానవీయమైంది
బి) శాస్త్రీయ జ్ఞానం అనుభవాత్మకమైంది
సి) వివిధ ప్రదేశాల్లో నిశ్చలంగా ఉంటుంది
డి) శాస్త్రీయ జ్ఞానం పరిమాణాత్మకం, దిశాత్మకం, కృత్యాత్మకం
1) ఎ, డి
2) బి, డి
3) ఎ, బి
4) సి, డి
- View Answer
- సమాధానం: 4
22. విజ్ఞాన శాస్త్రం అంటే ‘ఫలితం’ అనే అర్థం ఏర్పడినప్పుడు అది ఏ దృష్టిని కలిగి ఉంటుంది?
1) స్తబ్దదృష్టి
2) గతిశీల దృష్టి
3) హ్రస్వ దృష్టి
4) దీర్ఘ దృష్టి
- View Answer
- సమాధానం: 1
23.కింది వాటిలో శాస్త్రీయ సత్యం కానివి ఏవి?
ఎ) మొక్కలు నీటిని పీల్చుకుంటాయి
బి) వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి
సి) లోహాలు ఘన స్థితిలో ఉంటాయి
డి) అలోహాలు తమ గుండా విద్యుత్‌ను ప్రవహించనీయవు
1) ఎ, డి మాత్రమే
2) బి, డి మాత్రమే
3) సి, డి మాత్రమే
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
24. విజ్ఞానశాస్త్ర నిర్మాణానికి మూలం?
1) పరిశీలన
2) ప్రయోగం
3) పరికల్పన
4) అన్వేషణ
- View Answer
- సమాధానం: 4
25. కర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు?
1) కె. కులే
2) జేమ్స్ బెంజిమన్
3) క్రిస్టఫర్ ఐలర్
4) ఫ్రెడరిక్ ఓలర్
- View Answer
- సమాధానం: 1
26. ‘విజ్ఞానశాస్త్రం వల్లనే నేటి మానవుడి సగటు ఆయుః ప్రమాణం పెరిగింది’ ఈ వాక్యాన్ని సమర్థించే విజ్ఞాన శాస్త్ర విలువ?
1) ఉపయోగిత
2) సృజనాత్మక
3) బౌద్ధిక
4) క్రమశిక్షణ విలువ
- View Answer
- సమాధానం: 1
27.‘ప్రయోగ శాలలో ఫలితాలు ఎల్లవేళలా సౌకర్యవంతగా ఉండవు అయినా శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలు వదిలిపెట్టరు’ ఈ లక్షణం ఏ విలువలోనిది?
1) సృజనాత్మకత
2) బౌద్ధిక
3) నైతిక
4) క్రమశిక్షణ
- View Answer
- సమాధానం: 4
28. పాఠ్య ప్రణాళికను విద్యార్థి నిజ జీవితానికి, నేర్చుకునే పాఠ్యాంశాలకు మధ్య వ్యత్యాసం లేకుండా నిర్మిస్తే అది ఏ సూత్రం పాటించనట్లు అవుతుంది?
1) సృజనాత్మకత
2) మొత్తం అనుభవాల సూత్రం
3) ఉపయోగిత సూత్రం
4) జీవిత కేంద్రిత సూత్రం
- View Answer
- సమాధానం: 4
29. పోర్ట్‌ఫోలియోలను మదింపు చేయడానికి విద్యార్థి వేటిని ఉపయోగిస్తారు?
ఎ) రూబ్రిక్స్
బి) శోధన సూచిక
సి) నిర్ధారణ మాపని
డి) సంఘటన రచనావళి
1) ఎ, సి
2) బి, డి
3) ఎ, బి
4) బి, సి
- View Answer
- సమాధానం: 4
30. ప్రవర్తనా వికాసం నమోదు సాధనం?
1) రేటింగ్ స్కేల్
2) పోర్ట్ ఫోలియో
3) రూబ్రిక్స్
4) శోధన సూచిక
- View Answer
- సమాధానం: 4
31. తార్కిక శక్తిని పెంచడంలో ఏ ప్రశ్నలు ఎనలేనివి?
1) సాదృశ్య ప్రశ్నలు
2) బహుళైచ్ఛికాలు
3) బహుళ ప్రతి స్పందనలు
4) జతపరిచే ప్రశ్నలు
- View Answer
- సమాధానం: 1
32. ‘సిస్మోగ్రాఫ్‌ను ఉపయోగించి కొలిచే అంశం ___’
పై ప్రశ్న ద్వారా విజ్ఞాన శాస్త్రంలో ఏ విద్యా ప్రమాణాన్ని సాధించవచ్చు?
1) AS1
2) AS2
3) AS3
4) AS4
- View Answer
- సమాధానం: 1
33. ఢిల్లీలో బస్సులన్నీ సీఎన్జీతో నడుస్తున్నాయి. ఇది పర్యావరణానికి శ్రేయస్కరం అనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న ద్వారా రాబట్టే విద్యా ప్రమాణం?
1) ప్రశ్నించడం - పరికల్పన
2) సమాచార సేకరణ
3) విషయావగాహన
4) ప్రసంశ, విలువలు, నిజ జీవిత వినియోగం
- View Answer
- సమాధానం: 2
34.1931లో ప్రారంభించి, ప్రస్తుతం ఉదయ్‌పూర్, 14 ఉదయ్‌పూర్ పరిసర ప్రాంతాల్లో విస్తరించి, ఉపాధ్యాయ శిక్షణ, విద్యా సంబంధ పరిశోధనలకు ఉపయోగపడుతున్న సంస్థ?
1) విక్రమశిల
2) శిక్ష మిత్ర
3) జోడో జ్ఞాన్
4) విద్యా భవన్
- View Answer
- సమాధానం: 4
35. తరగతి గదిలోని సమస్యకు ఆచరణీయమైన పరిష్కారాలను కనుగొనడానికి ఉపయోగపడుతున్న సంస్థ?
1) జోడో జ్ఞాన్
2) విక్రమశిల
3) విద్యా భవన్
4) ఖాన్ అకాడమీ
- View Answer
- సమాధానం: 1
36. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకొని 1989లో ఏర్పాటు చేసిన పత్రిక ఏది?
1) జోడో జ్ఞాన్
2) ఖాన్ అకాడమీ
3) టీచర్ ప్లస్
4) విక్రమశిల
- View Answer
- సమాధానం: 3
37. మొగ్గ పువ్వుగా విడివడే సందర్భం, పిండం శిశువుగా అభివృద్ధి చెందడం లాంటి అంశాల బోధనకు చక్కగా ఉపయోగపడేది?
1) ఉపన్యాసం
2) ఉపన్యాస ప్రదర్శన
3) సిమ్యులేషన్ అండ్ గేమింగ్
4) ప్రయోగశాల
- View Answer
- సమాధానం: 3
38. కింది వాటిలో ఏవి థారన్‌డైక్ అభ్యసన సూత్రమైన సంసిద్ధతా నియమాన్ని తృప్తి పరుస్తాయి?
1) కంప్యూటర్
2) చలన చిత్రం
3) పునశ్చరణ చిత్రాలు
4) ఫిల్మ్ స్ట్రిప్స్
- View Answer
- సమాధానం: 2
39. బోధనలో వస్తువులకు, చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన వారు?
ఎ) ప్రొబెల్
బి) పెస్టాలజే
సి) కొమెనియన్
డి) రూసో
1) ఎ, సి
2) బి, సి
3) ఎ, డి
4) ఎ, బి
- View Answer
- సమాధానం: 4
40. ప్రాంతీయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభమైన సంవత్సరం?
1) 1967-68
2) 1968-69
3) 1965-66
4) 1964-65
- View Answer
- సమాధానం: 4
41. మ్యూజియానికి సంబంధించి కింది వాటిలో సరైన అంశాలేవి?
ఎ) ఇది మౌసీన్ అనే గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది
బి) వస్తు ప్రదర్శన శాలలు విద్యార్థుల్లో సహజమైన కుతూహలాన్ని కలిగిస్తాయి
సి) పాఠశాలల్లో ప్రయోగశాలల్లో చేయని ప్రయోగాలను మ్యూజియంలో చేయవచ్చు
డి) పాఠ్య పుస్తకాలు అదించలేని జ్ఞానాన్ని ప్రదర్శన శాలలు అందిస్తాయి
1) ఎ, బి, డి
2) ఎ, బి, సి
3) బి, సి, డి
4) ఎ, సి, డి
- View Answer
- సమాధానం: 1
42. ‘అందరూ నన్ను ఒక గుడ్ టీచర్ అంటారు! అందులో నిజం లేదు. నేను చేసిందల్లా విద్యార్థులను ఆలోచించేలా తీర్చిదిద్దడమే’ అని వ్యాఖ్యానించిన వారు?
1) సర్వేపల్లి రాధాకృష్ణన్
2) కొఠారి
3) సోక్రటీస్
4) సి.వి. రామన్
- View Answer
- సమాధానం: 3
43. విద్యార్థులకు వారి అభ్యసనా స్థాయిని మెరుగు పరుచుకోవడానికి అవకాశం కల్పించే 5E లోని దశ?
1) నిమగ్నం
2) శోధన
3) వివరణ
4) విస్తరణ
- View Answer
- సమాధానం: 3
44. ‘అన్వేషణ పద్ధతి ద్వారా విద్యార్థికి విజ్ఞాన సముపార్జన కంటే శాస్త్రీయ విధానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు’ అని పేర్కొన్న వారు?
1) ఆర్మస్ట్రాంగ్
2) బెస్ట్
3) వేబెస్ట్
4) వెస్ట్ వే
- View Answer
- సమాధానం: 4
45.సాధారణీకరణాలు అనేవి రాబట్టడానికి కావలసినన్ని ఉదాహరణలు లేదా సమాచారం అవసరం. దీనికి అనువైన విధానం ఏది?
1) ఆగమనం
2) నిగమనం
3) సర్వే
4) ప్రాజెక్ట్
- View Answer
- సమాధానం: 3
46. వేగానికి ప్రమాణాలు మీ./సె. అని విద్యార్థి తెల్పితే అతడు సాధించిన లక్ష్యం?
1) అవగాహన
2) జ్ఞానం
3) వినియోగం
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 1
47. జాతీయ పాఠ్యప్రణాళిక - 2005 ప్రకారం పాఠ్యాంశాలను ఏ ప్రాతిపదికపై రూపొందించారు?
1) విజ్ఞానం కోసం విద్య
2) అనుభవం ద్వారా విద్య
3) కృత్యం ద్వారా విద్య
4) శాంతి కోసం విద్య
- View Answer
- సమాధానం: 4
48. విద్యార్థి పద్ధతులను నేర్చుకోవడం అనేది ఎలాంటి ఉపగమం?
1) నిగమన
2) ఆగమన
3) సంశ్లేషణ
4) 5E మోడల్
- View Answer
- సమాధానం: 2
49. ప్రయోగశాల పద్ధతిలో ఏ విధానంలో ప్రతీ విద్యార్థి బాధ్యతాయుతంగా పని చేస్తారు?
1) డివిజన్ లేదా భాగ పద్ధతి
2) సమూహ పద్ధతి లేదా రొటేషన్ పద్ధతి
3) క్లాస్ ఫ్రంట్ మెథడ్
4) హోల్ క్లాస్ మెథడ్
- View Answer
- సమాధానం: 1
50. RCEM ప్రకారం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సోపానాల్లో విద్యార్థి జ్ఞానేంద్రియాలకు పని కల్పించే దశ?
1) ప్రవేశ వ్యాసక్తి
2) వికాస వ్యాసక్తి
3) అంత్యదశ వ్యాసక్తి
4) పూర్వ ప్రారంభ వ్యాసక్తి
- View Answer
- సమాధానం: 2