‘హరిశ్చంద్రోపాఖ్యానం’ గ్రంథకర్త ఎవరు?
1. ‘అమ్మకోసం’ పాఠ్యభాగం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఏ పర్వంలోనిది?
1) ఆది పర్వం - ప్రథమాశ్వాసం
2) ఆది పర్వం - ద్వితియాశ్వాసం
3) ఆది పర్వం- చతుర్థాశ్వాసం
4) అరణ్య పర్వం- తృతీయాశ్వాసం
- View Answer
- సమాధానం: 2
2. కింది వాటిలో నన్నయ కవితా గుణం కానిది ఏది?
1) అక్షర రమ్యత
2) ప్రసన్న కథాకవితార్థయుక్తి
3) నాటకీయత
4) నానారుచిరార్థ సూక్తినిధిత్వం
- View Answer
- సమాధానం: 3
3.కింది వాటిలో నన్నయ బిరుదు ఏది?
1) ఉభయ కవిమిత్రుడు
2) కవి బ్రహ్మ
3) శబ్ద శాసనుడు
4) శంభుదాసుడు
- View Answer
- సమాధానం: 3
4. గరుత్మంతుడి తల్లి పేరు?
1) కద్రువ
2) మాద్రి
3) అనసూయ
4) వినత
- View Answer
- సమాధానం: 4
5. అమృతం తెచ్చిన తల్లి దాస్యం తొలగించినవాడు?
1) అనూరుడు
2) గరుత్మంతుడు
3) కాద్రవేయుడు
4) కశ్యపుడు
- View Answer
- సమాధానం: 2
6. ‘ఎందుకు పారేస్తాను నాన్న’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది?
1) వ్యాసం
2) లేఖ
3) కథ
4) గేయం
- View Answer
- సమాధానం: 3
7. ‘పిల్లల ప్రవర్తన’ ఇతివృత్తంగా ఉన్న పాఠ్యాంశం ఏది?
1) బాల్యక్రీడలు
2) ఇల్లు- అనందాల హరివిల్లు
3) నిజం - నిజం
4) సందేశం
- View Answer
- సమాధానం: 3
8.‘నాలో కదిలే నవ్య కవిత్వం/ కార్మిక లోకపు కళ్యాణానికి/ శ్రామికలోకపు సౌభాగ్యానికి’ అని పలికిన అభ్యుదయ కవి?
1) ఆరుద్ర
2) దాశరథి
3) అనిశెట్టి
4) శ్రీశ్రీ
- View Answer
- సమాధానం: 4
9. ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ గ్రంథకర్త ఎవరు?
1) మంచన
2) నాచన సోమన
3) మారన
4) గౌరన
- View Answer
- సమాధానం: 4
10. ‘సరస సాహిత్య విచక్షణుడు’ అనే బిరుదున్న కవి?
1) నాచన సోమన
2) గౌరన
3) నంది తిమ్మన
4) కేతన
- View Answer
- సమాధానం: 2
11. ‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది?
1) గద్యం
2) పద్యం
3) ద్విపద
4) గేయం
- View Answer
- సమాధానం: 3
12. కింది వాటిలో వైరాగ్య శతకం ఏది?
1) దాశరథి శతకం
2) శ్రీ కాళహస్తీశ్వర శతకం
3) వేంకటేశ శతకం
4) నరసింహ శతకం
- View Answer
- సమాధానం: 2
13. జతపరచండి.
శతకం:
a) భాస్కర శతకం
b) వేంకటేశ శతకం
c) దాశరథీ శతకం
d) సభారంజన శతకం
రచయిత:
i) తాళ్లపాక పెద తిరుమలాచార్యులు
ii) మారద వెంకయ్య
iii) ఏలూరిపాటి అనంతరామయ్య
iv) కంచర్ల గోపన్న
1) a-iii, b-ii, c-iv, d-i
2) a-i, b-ii, c-iv, d-iii
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-iv, b-iii, c-i, d-ii
- View Answer
- సమాధానం: 3
14. ‘జీవన భాష్యం’ పాఠ్యభాగం సి. నారాయణరెడ్డి గారి ఏ గ్రంథం నుంచి గ్రహించారు?
1) ప్రపంచ పదులు
2) మార్పు నా తీర్పు
3) మంటలూ - మానవుడు
4) తెలుగు గజళ్లు
- View Answer
- సమాధానం: 4
15. డాక్టర్ సి.నారాయణ రెడ్డికి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం లభించిన గ్రంథం?
1) నాగార్జున సాగరం
2) విశ్వంభర
3) కర్పూర వసంతరాయలు
4) రామప్ప
- View Answer
- సమాధానం: 2
16. డాక్టర్ సి.నారాయణ రెడ్డికి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం లభించిన గ్రంథం?
1) నాగార్జున సాగరం
2) విశ్వంభర
3) కర్పూర వసంతరాయలు
4) రామప్ప
- View Answer
- సమాధానం: 2
17.ఆంధ్రశబ్ద చింతామణి గ్రంథకర్త?
1) కేతన
2) మారన
3) నన్నయ
4) చిన్నయ సూరి
- View Answer
- సమాధానం: 3
18. సంస్కరణ పాఠ్యభాగ రచయిత?
1) ఉషశ్రీ
2) మధురాంతకం రాజారాం
3) నండూరి రామమోహనరావు
4) నార్ల వెంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: 3
19. ‘సంస్కరణ’ పాఠ్యభాగంలో ఇతివృత్తం?
1) మానవతా విలువలు
2) సామాజిక స్పృహ
3) దేశభక్తి
4) ఆధ్యాత్మిక విలువలు
- View Answer
- సమాధానం: 2
20. ‘సందేశం’ పాఠ్యభాగ రచయిత?
1) దాశరథి
2) జాషువా
3) ఎస్.టి. జ్ఞానానందకవి
4) ఉషశ్రీ
- View Answer
- సమాధానం: 3
21. భారత కవికోకిల బిరుదున్న జాతీయోద్యమ నాయకురాలు?
1) విజయలక్ష్మి పండిట్
2) సరోజినీ నాయుడు
3) దుర్గాబాయి దేశ్‌ముఖ్
4) ఇందిరాగాంధీ
- View Answer
- సమాధానం: 2
22. కింది వాటిలో త్రిలింగాల్లో లేనిది ఏది?
1) శ్రీశైలం
2) దాక్షారామం
3) శ్రీకాళహస్తి
4) కాళేశ్వరం
- View Answer
- సమాధానం: 3
23. హరిశ్చంద్రుడి తండ్రి ఎవరు?
1) విశ్వామిత్రుడు
2) త్రిశంకుడు
3) వశిష్టుడు
4) గౌతముడు
- View Answer
- సమాధానం: 2
24. కింది వాటిలో గాంధీజీని ప్రభావితం చేసిన నాటకాలు?
1) గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర
2) శాకుంతలం, శ్రవణ కుమార చరిత్ర
3) సత్యహరిశ్చంద్ర, శ్రవణ కుమార చరిత్ర
4) శాకుంతలం, మహాశ్వేత
- View Answer
- సమాధానం: 3
25. పరుల కొరకెనదులు ప్రవహించు/ గోవులు పాలనిచ్చు, చెట్లు పూలుపూచు’ తర్వాత వచ్చే పాదం ఏది?
1) దీనులందు దేవదేవుడుండు
2) మానవార్చనంబే మాధవార్చనమురా!
3) పరహితముకంటే పరామర్థమున్నదా!
4) పుష్పజాతివేరు పూజ ఒకటే
- View Answer
- సమాధానం: 3
26. ‘ఆకలితో చచ్చే పేదల / శోకంలో కోపం ఎంతో’ అనే గేయ పంక్తులు దాశరథి రచించిన ఏ గ్రంథంలోనివి?
1) రుద్రవీణ
2) అగ్నిధార
3) పునర్నవం
4) మహాంద్రోదయం
- View Answer
- సమాధానం: 2
27. మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు?
1) స్వామి సీతారాం
2) పట్టాభి సీతారామయ్య
3) పింగళి వెంకయ్య
4) వల్లభ్‌భాయ్ పటేల్
- View Answer
- సమాధానం: 3
28. ఉత్పలమాల పద్యపాదంలో గణాలు?
1) న, జ, భ, జ, జ, జ, ర
2) భ, ర, న, భ, భ, ర, వ
3) మ, స, జ, స, త, త, గ
4) స, భ, ర, న, మ, య, వ
- View Answer
- సమాధానం: 2
29. శార్దూలం పద్యంలో యతిస్థానం?
1) 11వ అక్షరం
2) 12వ అక్షరం
3) 13వ అక్షరం
4) 14వ అక్షరం
- View Answer
- సమాధానం: 3
30. ‘సందేశం’ పదంలో గణాలు?
1) UUI -తగణం
2) UUU - మగణం
3) UIU - రగణం
4) UII - భగనం
- View Answer
- సమాధానం: 2
31.జతపరచండి.
ప్రకృతి: వికృతి:
a) రాత్రి i) ఆకసం
b) ఆకాశం ii) రాతిరి
c) స్నేహం iii) అబ్బురం
d) అపూర్వం iv) నెయ్యం
1) a-iii, b-iv, c-ii, d-i
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-i, b-ii, c-iv, d-iii
4) a-ii, b-iii, c-i, d-iv
- View Answer
- సమాధానం: 2
32. ‘రామారావు కాఫీ తాగుతూ, పేపర్ చదువుతున్నాడు’ ఇది ఏ వాక్యం?
1) చేదర్థక వాక్యం
2) క్త్వార్థక వాక్యం
3) శత్రర్థక వాక్యం
4) తుమున్నర్థక వాక్యం
- View Answer
- సమాధానం: 3
33. ‘సీత ఇష్టాలు’ అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది?
1) కంజరికథ
2) బుర్రకథ
3) హరికథ
4) యక్షగానం
- View Answer
- సమాధానం: 2
34. తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు’ ఈ పొడుపుకథకు విడుపు?
1) గుమ్మడిపండు
2) దానిమ్మపండు
3) పనసపండు
4) అరటిపండు
- View Answer
- సమాధానం: 3
35. యజ్ఞశాలలో పండితులు ‘చతుర్వేదాలు’ చదివారు ‘చతుర్వేదాలు’ ఏ సమాసం?
1) ద్వంద్వ సమాసం
2) ద్విగు సమాసం
3) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
- View Answer
- సమాధానం: 2
36. ‘భ్రమరం’ అంటే అర్థం?
1) ఈగ
2) బొద్దింక
3) తుమ్మెద
4) తేనెటీగ
- View Answer
- సమాధానం: 3
37. వినాయక చవితిని జాతీయ సమైక్యత కోసం వినియోగించిన నాయకుడు?
1) గాంధీజీ
2) నెహ్రూ
3) బాలగంగాధర తిలక్
4) వల్లభ్‌భాయ్ పటేల్
- View Answer
- సమాధానం: 3
38. ‘అరణ్యం’ అనే పదానికి పర్యాయ పదాలు?
1) ధరణి, పుడమి
2) అడవి, విపినం
3) వసుధ, వనం
4) అడవి, భూమి
- View Answer
- సమాధానం: 2
39. ‘అభ్యుదయం’ పదాన్ని విడదీసి రాస్తే?
1) అభ + ఉదయం
2) అభు + యుదయం
3) అభి + ఉదయం
4) అభు + ఉదయం
- View Answer
- సమాధానం: 3
40. ‘అత్యంత’ పదంలో సంధి?
1) యడాగమ సంధి
2) యణాదేశ సంధి
3) గుణసంధి
4) వృద్ధి సంధి
- View Answer
- సమాధానం: 2
41. ‘మొసలి కన్నీరు’ జాతీయానికి అర్థం?
1) జంతువుల కన్నీరు
2) మొసలి ఏడ్పు
3) తెలివితక్కువ
4) లేని బాధను నటించడం
- View Answer
- సమాధానం: 4
42. కింది వాటిలో ద్విరుక్తటకార సంధికి ఉదాహరణలు?
1) చెచ్చెర, పుట్టిల్లు
2) కట్టెదుట, నట్టిల్లు
3) నిట్టూర్పు, అందదుకు
4) నట్టెల్లు, కట్టకడ
- View Answer
- సమాధానం: 2
43. ‘ఇ-టి-తి’ అనేవి?
1) విభక్త ప్రత్యయాలు
2) ఔపభక్తులు
3) సర్వనామాలు
4) అవ్యయాలు
- View Answer
- సమాధానం: 2
44. కష్టపడిందంతా వృధా అయిన సందర్భంలో వాడే జాతీయం?
1) ఆకాశానికి నిచ్చెన వేయడం
2) అడివిగాచిన వెన్నెల
3) బూడిదలో పోసిన పన్నీరు
4) కుక్క తోక పట్టి గోదారీదడం
- View Answer
- సమాధానం: 3
45. ‘వలవదధిక దీర్ఘ వైరివృత్తి’ అని పలికిన పాత్ర?
1) ఆవు
2) ధర్మరాజు
3) శ్రీకృష్ణుడు
4) మంధరుడు
- View Answer
- సమాధానం: 2
46.‘తెలుగు తల్లి తోటలోన/ వెలుగు లీను పూవులం’ అని జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు రచించిన గేయం పేరు?
1) ఏమవుతుంది
2) ఆణిముత్యాలు
3) నీతి పద్యాలు
4) తొలకరి చినుకులు
- View Answer
- సమాధానం: 4
47. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టినవారు?
1) స్వామి దయానంద సరస్వతి
2) నందలాల్ బహుగుణ
3) గాడిచర్ల హరి సర్వోత్తమ రావు
4) నంబూద్రి పాద్
- View Answer
- సమాధానం: 3
48.‘గబ్బిలం, ఫిరదౌసి’ గ్రంథాల కర్త?
1) దువ్వూరి రామిరెడ్డి
2) సి. నారాయణరెడ్డి
3) గుర్రం జాషువా
4) దేవరకొండ బాలగంగాధర తిలక్
- View Answer
- సమాధానం: 3
49. అర్థమత్తులహంకృతులు, అంధమతులు రాని కొత్తజగం ఏర్పడాలని కోరుకున్న భావ కవి?
1) ఉషశ్రీ
2) గుర్రం జాషువా
3) ఆరుద్ర
4) దేవులపల్లి కృష్ణశాస్త్రి
- View Answer
- సమాధానం: 4
50. కింది వారిలో చైతన్య స్రవంతి పద్ధతిని ప్రవేశపెట్టినవారు?
1) శ్రీశ్రీ
2) జాషువా
3) గురజాడ
4) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
- View Answer
- సమాధానం: 1
51. సమకాలీన సంఘటనల్లో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంగా సంపాదకులు రాస్తే?
1) సమర్థనీయం
2) సంపాదకీయం
3) రచనా సౌందర్యం
4) జీవిత చరిత్ర
- View Answer
- సమాధానం: 2
52. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తెలిపే ఉద్దేశ్యం ఉన్న పాఠం?
1) అమ్మకోసం
2) అజంతా గుహలు
3) సందేశం
4) ఇల్లు - ఆనందాల హరివిల్లు
- View Answer
- సమాధానం: 4
53. ఆయుధ పూజ ఏ పండుగ రోజు నిర్వహిస్తారు?
1) విజయదశమి
2) దీపావళి
3) సంక్రాంతి
4) శ్రీరామనవమి
- View Answer
- సమాధానం: 1
54. ‘ఇంద్ర ధనువులై ఎగిరే చిలుకలు/ పూల రంగుపై ఎగిరే తరగలు’ ఏ కీటకం గురించి రాసిన గేయం?
1) రామచిలుక
2) తుమ్మెద
3) సీతాకోక చిలుక
4) తేనెటీగ
- View Answer
- సమాధానం: 3
55. ఆరుద్ర అసలు పేరు?
1) పెనుమర్తి విశ్వనాథ శర్మ
2) కిళాంబి వెంకట నరసింహాచార్యులు
3) జంధ్యాల పాపయ్యశాస్త్రి
4) భాగవతుల సదాశివ శంకర శాస్త్రి
- View Answer
- సమాధానం: 4
56. ‘కాయమునకు ధూళిదులిపి/ గాయమునకు కట్టుకట్టి మాటరాని ముసలి అవ్వ/ నోట నీరు పోసినారు’ ఈ గేయం తెలియజేసే విలువలు?
1) ఆధ్యాత్మిక విలువలు
2) భాషా విలువలు
3) మానవత్వపు విలువలు
4) వ్యాకరణపు విలువలు
- View Answer
- సమాధానం: 3
57. దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటికి లభించిన పురస్కారం?
1) కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం
2) జ్ఞాన్‌పీఠ్
3) మూర్తి దేవి పురస్కారం
4) తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం
- View Answer
- సమాధానం: 1
58. కార్యకారణ సంబంధ వాక్యాలు?
1) క్త్వార్థాలు
2) చేదర్థకాలు
3) అప్యర్థకాలు
4) శత్రర్థకాలు
- View Answer
- సమాధానం: 2
59. మత్తేభ పద్యపాదానికి యతిస్థానం పాటించే అక్షరం?
1) 10వ అక్షరం
2) 13వ అక్షరం
3) 14వ అక్షరం
4) 11వ అక్షరం
- View Answer
- సమాధానం: 3
60. గరుత్మంతుడి తండ్రి పేరు?
1) దక్ష ప్రజాపతి
2) సూర్యుడు
3) అనూరుడు
4) కశ్యప ప్రజాపతి
- View Answer
- సమాధానం: 4