విద్యార్థి కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ఏ విజ్ఞాన శాస్త్ర విలువ?
1. 7 + 9 = 16, 11 + 13 = 24, 15 + 17 = 32.. లాంటి లక్షణాలను గమనించిన విద్యార్థికి గణిత స్వభావంపై కలిగే ఆలోచన ఏది?
1) కచ్చితత్వం
2) తార్కికం
3) ఆగమనం
4) నిగమనం
- View Answer
- Answer: 3
2. వర్షశ్రీ ఒక గణిత ఉపాధ్యాయిని. ఆమె ప్రతిరోజు విద్యార్థుల్లో సామర్థ్యాలను మౌఖికంగా అంచనా వేస్తుంది. ఈ సందర్భంలో వర్షశ్రీకి కింది వాటిలో ఉపయోగపడేవి ఏది?
ఎ) రేటింగ్ స్కేల్
బి) ఎనక్డోటల్ రికార్డ
సి) శోధన సూచిక
డి) టీచర్స డైరీ
1) ఎ, డి
2) బి, డి
3) ఎ, సి
4) బి, సి
- View Answer
- Answer: 3
3. ‘గుణకారం కుడి నుంచి ఎడమకు చేస్తాం’ అనేది గణిత జ్ఞానంలోని ఏ అంశం?
1) యదార్థం
2) నిర్దిష్ట యదార్థం
3) పారిభాషిక పదం
4) సంప్రదాయం
- View Answer
- Answer: 4
4. ఆశించిన పర్యవసానం లభించే వరకు ఆవశ్యకత సోపానాలను సారాంశంవైపు నిర్మించే పద్ధతి?
1) నిగమన
2) ఆగమన
3) విశ్లేషణ
4) సంశ్లేషణ
- View Answer
- Answer: 4
5. త్రిమితీయ ఆకృతుల ముఖాలు, అంచులు, శీర్షాల పరంగా వర్గీకరించిన విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం?
1) AS1
2) AS2
3) AS3
4) AS4
- View Answer
- Answer: 2
6.విద్యార్థి గణితాన్ని భయంతో కాకుండా సంతోషంతో నేర్చుకుంటాడు. ఈ అంశం అనేది?
1) NCF-ఆకాంక్ష
2) NCF-దార్శనికత
3) NCF- సమస్య
4) APSCF- ఆకాంక్ష
- View Answer
- Answer: 2
7.యోగ్యతను నిర్ధారించడానికి ఉపయోగించే సూత్రాలు, ప్రమాణాలు ఏవి?
1) ఉద్దేశాలు
2) లక్ష్యాలు
3) విద్యా ప్రమాణాలు
4) విలువలు
- View Answer
- Answer: 4
8. అవ్యక్త రాశులను యావత్, తావత్ లాంటి పదాలతో పేర్కొన్న గణిత శాస్త్రవేత్త ఎవరు?
1) బ్రహ్మగుప్త
2) భాస్కరాచార్య
3) ఆర్యభట్ట
4) పావులూరి మల్లన
- View Answer
- Answer: 1
9. కింది వాటిలో భావనలు ఏర్పడని విధాన్ని గుర్తించండి.
1) ప్రత్యక్ష
2) విచక్షణ
3) ఆగమన, నిగమన
4) పరికల్పన
- View Answer
- Answer: 4
10. భావనల పట్ల, సమస్య సాధనలపట్ల సాపేక్ష అవగాహన ఉన్నవారు రూబ్రిక్స్లో ఏ స్థాయికి చెందుతారు?
1) లెవల్ - 4
2) లెవల్ - 3
3) లెవల్ - 2
4) లెవల్ - 1
- View Answer
- Answer: 3
11. విజ్ఞాన శాస్త్ర నిర్మాణానికి మూలం?
1) అనుమితి
2) పరికల్పన
3) అన్వేషణ
4) ప్రయోగాలు
- View Answer
- Answer: 3
12. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) భౌతిక శాస్త్ర యాంత్రిక యుగంగా పేర్కొన్న కాలం - 1687 -1887
బి) బ్లాక్ హోల్స్‌పై పరిశోధనకు గానూ సి.వి. రామన్‌కు 1930లో నోబెల్ బహుమతి లభించింది
సి) విలియం జోన్స 1784లో కలకత్తాలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ స్థాపించాడు
డి) పశ్చిమ దేశాల్లో థామస్ రిపోర్ట 1916లో భాగంగా పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రంలో అత్యున్నత కోర్సులను ప్రారంభించారు
1) ఎ, బి, సి
2) ఎ, బి, డి
3) బి, సి, డి
4) ఎ, సి, డి
- View Answer
- Answer: 4
13. విద్యార్థి కొత్త ప్రాజెక్టులు చేపట్టడం అనేది ఏ విజ్ఞాన శాస్త్ర విలువ?
1) క్షమశిక్షణ
2) ఉపయోగిత
3) బౌద్ధిక
4) సృజనాత్మక
- View Answer
- Answer: 4
14. ‘నియంత్రణ లేని కృత్యం’, ‘సూచనలు లేకుండా కృత్యం చేయడం’ ఈ లక్షణాలు దేనిలో అంతర్భాగం?
1) అనుకరణ
2) హస్తలాఘవం
3) సమన్వయం
4) సహజీకరణం
- View Answer
- Answer: 1
15. విద్యార్థికి ఇచ్చిన పుటాకార దర్పణం, కుంభాకార దర్పణంలలో బేధాలను గుర్తిస్తాడు. ఆ విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
- View Answer
- Answer: 1
16. ‘విద్యార్థి ప్రయోగ పరికరాల అమరికలోనూ, పద్ధతిలోనూ దోషాలను కనుగొంటాడు’ ఈ లక్షణం దేనికి చెందుతుంది?
1) అభివ్యంజన నైపుణ్యం
2) హస్త నైపుణ్యం
3) పట నైపుణ్యం
4) పరిశీలనా నైపుణ్యం
- View Answer
- Answer: 4
17. దారం వడకడం, ఇళ్లు నిర్మించడం, కుండలు చేయడం లాంటి అంశాలు ఎలాంటి కృత్యంలో అంతర్భాగం?
1) జ్ఞానాన్నిచ్చేవి
2) నిర్మాణాత్మక లేదా అనుభవాన్నిచ్చేవి
3) ప్రకటిత లేదా ప్రదర్శనలిచ్చేవి
4) కనుక్కునే కృత్యాలు
- View Answer
- Answer: 2
18. ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటికలో ఏ పదార్థంతో నిమ్మరసాన్ని లేదా ఇతర ఆమ్లాన్ని కలిపి కార్బన్ డై ఆక్సైడ్ వాయువు వెలువడటాన్ని నిర్ధారించవచ్చు?
1) బట్టల సోడా లేదా సోడియం కార్బొనేట్
2) తినే సోడా లేదా సోడియం బై కార్బొనేట్
3) పొటాషియం పర్మాంగనేట్
4) కాపర్ సల్ఫేట్
- View Answer
- Answer: 1
19. 200 మార్కులకు డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తే ఒక విద్యార్థి 170 మార్కులు సాధించాడు. ఈ పరీక్ష ఒక బహుళైచ్ఛిక ప్రశ్నల పరీక్ష అయితే ఆ విద్యార్థి ఊహించిన కారకాన్ని లెక్కించండి. సవరించిన తర్వాత అతని నిజ మార్కులు ఎన్ని?
1) 20, 150
2) 30, 140
3) 10, 160
4) 40, 130
- View Answer
- Answer: 3
20. ప్రతిచర్యకు, చర్యకు గల కారణాలను ఆదారంగా చేసుకొని సంబంధాలను గుర్తించడం అనే లక్షణం ఏ విద్యా ప్రమాణం?
1) AS1
2) AS2
3) AS3
4) AS4
- View Answer
- Answer: 1