పిల్లల ప్రవర్తన’ ఇతివృత్తంగా ఉన్న పాఠ్యభాగం?
1. ‘స్వాతంత్య్రపు జెండా గేయం’లో ఉన్న ఇతి వృత్తం?
1) నైతిక విలువలు
2) దేశభక్తి
3) త్యాగ తత్వరత
4) మానవతా విలువలు
- View Answer
- సమాధానం: 2
2. ‘కమలాసనుడు’ అనే బిరుదున్న శతక రచయిత?
1) పాల్కురికి సోమన
2) వేమన
3) బద్దెన
4) ధూర్జటి
- View Answer
- సమాధానం: 3
3. ‘కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు’ అనే బిరుదులున్న కవి?
1) తిక్కన
2) పోతన
3) నన్నయ
4) శ్రీనాథుడు
- View Answer
- సమాధానం: 1
4. అమృతం తెచ్చి తల్లి దాస్యాన్ని తొలగించిన వారు ఎవరు?
1) అనూరుడు
2) గరుత్మంతుడు
3) కశ్యపుడు
4) కాద్రవేయుడు
- View Answer
- సమాధానం: 2
5. ‘పిల్లల ప్రవర్తన’ ఇతివృత్తంగా ఉన్న పాఠ్యభాగం?
1) బాల్య క్రీడలు
2) నిజం- నిజం
3) సందేశం
4) ఇల్లు - ఆనందాల హరివిల్లు
- View Answer
- సమాధానం: 2
6. ‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది?
1) పద్యం
2) గేయం
3) ద్విపద
4) గద్యం
- View Answer
- సమాధానం: 3
7. జాషువాకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించిన గ్రంథం ఏది?
1) గబ్బిలం
2) ఫిరదౌసి
3) బాపూజీ
4) క్రీస్తు చరిత్ర
- View Answer
- సమాధానం: 4
8. భారతి, సుధాత్రి, అమ్మ, మామయ్య పాత్రలున్న పాఠ్యభాగం ఏది?
1) నిజం- నిజం
2) చారిత్రక వీర గాథలు
3) మన భాషలు
4) మేము సైతం
- View Answer
- సమాధానం: 3
9. ‘ఎలుక విందు’ గేయ రచయిత ఎవరు?
1) గిడుగు రాజేశ్వరరావు
2) దాశరథి కృష్ణమాచార్యులు
3) వానమామలై వరదాచార్యులు
4) నార్ల వెంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: 2
10. ‘పత్రికొకటియున్న పదివేల సైన్యము/ పత్రికొక్కటున్న మిత్రకోటి’ తర్వాత వచ్చే పద్య పాదం ఏది?
1) పేదవానియింట పెండ్లైనయెరుగరు
2) చెప్పుతినెడికుక్క చెరుకుతీపెరుగునా!
3) ప్రజలకురక్ష లేదు పత్రిక లేకున్న
4) వార్తయందు జగము వర్థిల్లుచుండును
- View Answer
- సమాధానం: 3
11. ‘మానవుడే నా సందేశం - మనుష్యుడే నా సంగీతం’ అని చాటి చెప్పిన కవి ఎవరు?
1) గురజాడ
2) శ్రీశ్రీ
3) డాక్టర్ సినారె
4) ఆరుద్ర
- View Answer
- సమాధానం: 2
12. ‘తెల్లపావురాల్ని సరదాగా ఎగరేస్తుంది/ చల్ల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి’ ఈ గేయ పంక్తులు ఏ పాఠ్య భాగంలోనివి?
1) మ్రోగిన గంటలు
2) ప్రకటన
3) ఆలోచనం
4) జీవన భాష్యం
- View Answer
- సమాధానం: 2
13. డాక్టర్ సి. నారాయణరెడ్డికి జ్ఞానపీఠ బహుమతి లభించిన గ్రంథం?
1) కర్పూర వసంతరాయలు
2) నాగార్జున సాగరం
3) విశ్వంభర
4) విశ్వనాథ నాయకుడు
- View Answer
- సమాధానం: 3
14. ‘స్వాగతం’ పదంలోని సంధి?
1) గుణసంధి
2) యణాదేశసంధి
3) సవర్ణదీర్ఘసంధి
4) వృద్ధిసంధి
- View Answer
- సమాధానం: 2
15. ‘హరించి ఇచ్చునది’ అనే వ్యత్పత్తి ఉన్న పదం?
1) ఎద
2) హరిణి
3) హృదయం
4) హర్మ్యం
- View Answer
- సమాధానం: 3
16. ‘కాకి, ఎలుక, తాబేలు చెట్టుపైకి, బిలంలోకి, మడుగులోకి జారుకున్నాయి’ ఈ వాక్యంలో అలంకారం?
1) ఉత్ప్రేక్షాలంకారం
2) సందేహాలంకారం
3) మాలోపమాలంకారం
4) క్రమాలంకారం
- View Answer
- సమాధానం: 4
17. శార్దూలం పద్యానికి యతిస్థానం ఎన్నో అక్షరం?
1) 11
2) 13
3) 14
4) 12
- View Answer
- సమాధానం: 2
18. ‘తామరసం’ పదానికి నానార్థాలు?
1) మంచినీరు, చర్మరోగం
2) పద్మం, బ్రహ్మ
3) పద్మ, బంగారం
4) పండు, బ్రహ్మ
- View Answer
- సమాధానం: 3
19. ‘శ్రీకాంత్ ఇప్పుడే వచ్చి వెళ్లాడు’ అనేది ఏ వాక్యం?
1) సామాన్య వాక్యం
2) సంశ్లిష్ట వాక్యం
3) సంయుక్త వాక్యం
4) ప్రేరణార్థక వాక్యం
- View Answer
- సమాధానం: 2
20. ‘బంగారం’ పదానికి ప్రకృతి రూపం?
1) సువర్ణం
2) స్వర్ణం
3) భృంగారం
4) బృందారం
- View Answer
- సమాధానం: 3
21. ‘భాష వివిధ భాషణల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ’ అని చెప్పిన వారెవరు?
1) బ్లూమ్
2) హాకెట్
3) స్కిన్నర్
4) పావ్లోవ్
- View Answer
- సమాధానం: 2
22. బోధనా లక్ష్యాల గురించి పరిశోధించిన వారు?
1) జాకీర్ హుస్సేన్
2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) బెంజిమన్ బ్లూమ్స్
4) గొడవర్తి సూర్యనారాయణ
- View Answer
- సమాధానం: 3
23. ‘తల్లిపాలు తాగి పెరిగిన వాడికి, దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో, మాతృభాషలో విద్యాభ్యాసానికి, పరభాషలో విద్యాభ్యాసానికి అంత వ్యత్యాసం ఉంటుంది’ అని చెప్పినవారు?
1) మహాత్మా గాంధీ
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) వావిలాల గోపాల కృష్ణయ్య
4) కొమర్రాజు లక్ష్మణరావు
- View Answer
- సమాధానం: 4
24. చతుర్విధ భాషానైపుణ్యాల్లో అతి కష్టమైన భాషా నైపుణ్యం?
1) భాషణం
2) లేఖనం
3) శ్రవణం
4) పఠనం
- View Answer
- సమాధానం: 2
25. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అనుకూలమైన పద్ధతి?
1) చర్చాపద్ధతి
2) ఉపన్యాస పద్ధతి
3) ప్రత్యక్ష పద్ధతి
4) పద పద్ధతి
- View Answer
- సమాధానం: 3
26. ‘ప్రాథమిక దశలో శిశువులకు భాషా శిక్షణ ఇవ్వడానికి కథా విధానం అత్యుత్తమం’ అని పేర్కొన్న మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు?
1) సైమన్ పాటర్
2) రైబర్న్
3) హెర్బర్ట్
4) స్టాన్లీహాల్
- View Answer
- సమాధానం: 2
27. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో విద్యాశాఖ ప్రయోగాత్మకంగా చేపట్టిన విద్యా విధానం?
1) బేసిక్ విద్యావిధానం
2) బడిబాట
3) ఆనందలహరి విద్యావిదానం
4) నాన్బేసిక్ విద్యావిధానం
- View Answer
- సమాధానం: 3
28. ప్రాథమిక పాఠశాలలో తెలుగు బోధించడానికి నిర్ణయించిన సమయం?
1) 60 నిమిషాలు
2) 90 నిమిషాలు
3) 150 నిమిషాలు
4) 120 నిమిషాలు
- View Answer
- సమాధానం: 4
29. ప్రాథమిక స్థాయిలో సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు?
1) 40
2) 20
3) 50
4) 75
- View Answer
- సమాధానం: 3