ఆంధ్రప్రదేశ్ తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడు?
1.భాషకు ఉన్న ఉద్దీపన ప్రయోజనాలు?
1) పఠనం, శ్రవణం
2) సృజనాత్మకత, రసావిర్భావం
3) అనుగుణ్యత, యథార్థత
4) భాషణం, లేఖనం
- View Answer
- సమాధానం: 2
2. భాష అనంతమైన వాక్యాల సముదాయం అన్నవారు?
1) చామ్స్కీ
2) హెగెల్
3) ఎమ్మెస్బాగ్
4) స్టర్వర్ట్
- View Answer
- సమాధానం: 3
3. మాతృభాషకు ‘స్టెర్న’ పేర్కొన్న పర్యాయ పదాలు?
1) ప్రాంతీయ భాష
2) దేశ భాష
3) ఊయల భాష
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
4. రాయబడిన లేదా అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడం?
1) ఉక్త లేఖనం
2) విస్తార లేఖనం
3) దృష్ట లేఖనం
4) క్షుణ్ణ లేఖనం
- View Answer
- సమాధానం: 3
5. వాగింద్రియ లోపం, పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడే దోషాలు?
1) లిపి దోషాలు
2) ఉచ్ఛారణ దోషాలు
3) రాత దోషాలు
4) భావ దోషాలు
- View Answer
- సమాధానం: 2
6. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని మొట్టమొదట చెప్పినవారు?
1) శ్రీకృష్ణదేవరాయలు
2) రఘునాథ రాయలు
3) నన్నెచోడుడు
4) శ్రీనాథుడు
- View Answer
- సమాధానం: 4
7. బోధనా లక్ష్యాలను గూర్చి పరిశోధించినవారు?
1) జాకీర్ హుస్సేన్
2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) బెంజిమన్ బ్లూమ్స్
4) గొడవర్తి సూర్యనారాయణ
- View Answer
- సమాధానం: 3
8. పాఠ్యగ్రంథాల్లో గ్రాంథిక భాష చేరడానికి ప్రధాన కారకుడు?
1) కందుకూరి వీరేశలింగం
2) చిలకమర్తి
3) జయంతి రామయ్య పంతులు
4) చిన్నయ సూరి
- View Answer
- సమాధానం: 4
9. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అనుకూలమైన పద్ధతి?
1) చర్చా పద్ధతి
2) ఉపన్యాస పద్ధతి
3) ప్రత్యక్ష పద్ధతి
4) పద పద్ధతి
- View Answer
- సమాధానం: 3
10. ఆంధ్రప్రదేశ్ తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడు?
1) వావిలాల గోపాలకృష్ణయ్య
2) వందేమాతరం రామచంద్రరావు
3) అయ్యదేవర కాళేశ్వరరావు
4) శ్రీమతి టి.అనసూయమ్మ
- View Answer
- సమాధానం: 1
11. తెలుగు భాషా బోధనకు 10 లక్ష్యాలను నిర్దేశించిన సంస్థ?
1) అధికార భాషా సంఘం
2) ఎన్.సి.టి.ఇ.
3) ఎన్.సి.ఇ.ఆర్.టి.
4) ఎన్.సి.ఆర్.టి.ఇ.
- View Answer
- సమాధానం: 3
12. ‘మాతృభాష తల్లి పాలవంటిదైతే, పరభాష దాది పాలవంటిది’ అని చెప్పినవారు?
1) మహాత్మా గాంధీ
2) వావిలాల గోపాలకృష్ణయ్య
3) కొమర్రాజు లక్ష్మణరావు
4) కందుకూరి వీరేశలింగం
- View Answer
- సమాధానం: 3
13. ‘పరభాషలో విద్య సోపానాలు లేని సౌధం వంటిది’ అని చెప్పినవారు?
1) సర్వేపల్లి రాధాకృష్ణన్
2) పి.వి. నరసింహారావు
3) జవ హర్లాల్ నెహ్రు
4) రవీంద్రనాథ్ ఠాగూర్
- View Answer
- సమాధానం: 4
14. ‘తెలుగు జాతీయ భాషగా ఉండటానికి అన్ని విధాలా అర్హమైందని’ ప్రశంసించినవారు?
1) జె.ఎ. ఏట్స్
2) జె.బి.ఎస్. హాల్డే
3) కాల్డ్వెల్
4) సి.పి. బ్రౌన్
- View Answer
- సమాధానం: 2
15. ఉక్త లేఖనం అంటే?
1) చూచి రాయడం
2) చెప్పింది రాయడం
3) వేగంగా రాయడం
4) ఊహించి రాయడం
- View Answer
- సమాధానం: 2
16. నిర్దిష్ట కాలంలో భాషా స్వరూప స్వభావాలను వివరించే వ్యాకరణం?
1) వర్ణానాత్మక వ్యాకరణం
2) బాల వ్యాకరణం
3) చారిత్రక వ్యాకరణం
4) తులనాత్మక వ్యాకరణం
- View Answer
- సమాధానం: 1
17. చతుర్విధ భాషా నైపుణ్యాల్లో అతి కష్టమైంది?
1) భాషణం
2) లేఖనం
3) పఠనం
4) శ్రవణం
- View Answer
- సమాధానం: 2
18. పఠన నైపుణ్యం ప్రయోజనాలను మొట్టమొదట ప్రస్తావించిన భాషావేత్త?
1) సైమన్ పాటర్
2) బేకన్
3) స్టీఫెన్ క్రేషన్
4) హార్లాక్
- View Answer
- సమాధానం: 3
19. ‘పొడుపు కథలు విద్యార్థిలో ఏ శక్తిని పెంపొందిస్తాయి?
1) వర్ణనా శక్తి
2) ఆలోచనా శక్తి
3) సృజనాత్మక శక్తి
4) అభ్యసన శక్తి
- View Answer
- సమాధానం: 2
20. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వికలాంగులకు అందరితో పాటు సమాన పని, విద్యా హక్కులు కల్పించింది?
1) 42
2) 44
3) 41
4) 43
- View Answer
- సమాధానం: 3
21. ప్రపంచ బ్యాంక్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లను సరఫరా చేసేందుకు కృషిచేసిన విద్యా కమిషన్?
1) యశ్పాల్ కమిటీ
2) రాజీవ్ విద్యా కమిషన్
3) లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్
4) ఆదిశేషయ్య కమిటీ
- View Answer
- సమాధానం: 2
22. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఎప్పుడు ప్రకటించింది?
1) 1965 సెప్టెంబర్ 9
2) 1968 సెప్టెంబర్ 8
3) 1966 సెప్టెంబర్ 8
4) 1968 సెప్టెంబర్ 10
- View Answer
- సమాధానం: 3
23. జతపరచండి.
భాషోత్పత్తి వాదం:
a) బౌ-వౌ-వాదం
b) డింగ్ డాంగ్ వాదం
c) స్వతస్సిద్ధ వాదం
d) ధాతువాదం
ప్రతిపాదించిన భాషావేత్త:
i) మాక్స్‌ముల్లర్
ii) లిబ్నిజ్
iii) యాస్కాచార్యుడు
iv) చామ్స్కీ
1) a-iii, b-iv, c-ii, d-i
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-ii, b-iv, c-i, d-iii
4) a-iv, b-iii, c-ii, d-i
- View Answer
- సమాధానం: 2
24. ‘గాసట బీసటగా వివిధ విషయాలను చదవడం కంటే విషయమొక్కటైనా క్షుణ్ణంగా చదవడం మేలు’ అని చెప్పిన భాషావేత్త?
1) రైబర్న
2) ఫ్రాన్సిస్ బేకన్
3) హెర్బర్ట్ రీడ్
4) నాష్
- View Answer
- సమాధానం: 4
25. ప్రతి భాషా నైపుణ్యానికి పంచ ప్రాణాలుగా భావించే విషయాలు?
1) స్పష్టత-నిర్దుష్టత
2) సమత
3) వేగం-అందం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. పిల్లల్లో ఇంద్రియ వికాసానికి ఉపయోగపడే బోధనా పద్ధతి?
1) డాల్టన్ పద్ధతి
2) మాంటిస్సోరి పద్ధతి
3) కిండర్ గార్డెన్ పద్ధతి
4) క్రీడా పద్ధతి
- View Answer
- సమాధానం: 2
27. జతపరచండి.
ఆధునిక బోధనా పద్ధతి:
a) కిండర్ గార్డెన్ పద్ధతి
b) ప్రాజెక్టు పద్ధతి
c) కృత్యాధార పద్ధతి
d) క్రీడా పద్ధతి
ప్రతిపాదించిన విద్యావేత్త:
i) మిస్గల్, కిల్‌ప్యాట్రిక్
ii) ప్రోబెల్
iii) కాల్డ్ వెల్కుక్
iv) ఈశ్వరీభాయ్ పటేల్
1) a-iii, b-iv, c-i, d-ii
2) a-ii, b-iii, c-i, d-iv
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 3
28. కార్యక్రమయుత బోధన కోసం కృషి చేసి అభివృద్ధిపరచినవారు?
1) స్కిన్నర్
2) గాగ్నే, హెలెన్ పార్క్
3) గిల్బర్ట్
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
29. సూక్ష్మబోధనను సిద్ధాంతీకరించి శిక్షణకు అనుకూలంగా చేసినవారు?
1) డ్వైట్ ఎలెన్
2) కిమ్ రోమ్ని
3) హోరాస ఆర్టైన్
4) స్టాన్ఫర్డ
- View Answer
- సమాధానం: 3
30. శిశువుల మనస్తత్వంపై రూపొందించిన ఆధునిక బోధనా పద్ధతి?
1) క్రీడా పద్ధతి
2) మాంటెస్సోరి పద్ధతి
3) ప్రాజెక్టు పద్ధతి
4) డాల్టన్ పద్ధతి
- View Answer
- సమాధానం: 2
31. ప్రాథమిక దశలో భాషా బోధనకు కేటాయించవలసిన సమయం?
1) 60 నిమిషాలు
2) 120 నిమిషాలు
3) 90 నిమిషాలు
4) 150 నిమిషాలు
- View Answer
- సమాధానం: 3
32. విద్యార్థుల్లో భాషాభివృద్ధిని ఉద్దేశించి బోధించే ప్రక్రియ?
1) పద్యం
2) గద్యం
3) వ్యాసం
4) లేఖ
- View Answer
- సమాధానం: 2
33. ‘ఉప్పుకప్పురంబు’ పద్యాన్ని బోధించేందుకు అనువైన ప్రక్రియ?
1) ఖండ పద్ధతి
2) ప్రతిపదార్థ పద్ధతి
3) తాత్పర్య పద్ధతి
4) పద పద్ధతి
- View Answer
- సమాధానం: 3
34. వ్యాకరణ బోధనలో ఉదాహరణల ద్వారా సూత్రాన్ని చెప్పించే పద్ధతి?
1) ప్రాయోగిక పద్ధతి
2) నిగమన పద్ధతి
3) ఆగమన పద్ధతి
4) అనుసంధాన పద్ధతి
- View Answer
- సమాధానం: 2
35. విస్తార గ్రంథ పఠనం ఏ లక్ష్యానికి స్పష్టీకరణ?
1) సృజనాత్మకత
2) వైఖరి
3) భాషాభిరుచి
4) రసానుభూతి
- View Answer
- సమాధానం: 3
36. శబ్ద మాధుర్యం ఉన్న పద్యాలు ఏ దశ పాఠ్యగ్రంథాల్లో ఉండాలి?
1) ప్రాథమికోన్నత దశ
2) ప్రాథమిక దశ
3) మాధ్యమిక దశ
4) ఉన్నత దశ
- View Answer
- సమాధానం: 2
37. నాటక బోధనోద్దేశం?
1) రసానుభూతి కలిగించడం
2) విమర్శనాశక్తి పెంపొందించడం
3) సంభాషణా నైపుణ్యం కలిగించడం
4) అభినయంపై ఆసక్తి కలిగించడం
- View Answer
- సమాధానం: 3
38. విద్యార్థుల్లో భాషాభినివేశం, సాహిత్యాభిలాషను పెంపొందించేందుకు తోడ్పడే యాత్రలు?
1) విహారయాత్రలు
2) విజ్ఞాన విహారయాత్రలు
3) భాషా విహారయాత్రలు
4) చారిత్రక ప్రదేశ యాత్రలు
- View Answer
- సమాధానం: 3
39.విద్యాశాఖ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి బోధనోపకరణాల నిమిత్తం ఇచ్చే గ్రాంటు?
1) రూ.300
2) రూ.400
3) రూ.600
4) రూ.500
- View Answer
- సమాధానం: 4
40. ‘టెక్ట్స్’ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
1) స్పానిష్
2) లాటిన్
3) గ్రీక్
4) ఫ్రెంచ్
- View Answer
- సమాధానం: 2
41.విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి 5వ తరగతిలో ప్రతి విద్యార్థి కనీసం ఎన్ని బాల సాహిత్య గ్రంథాలు చదవాలి?
1) 20
2) 25
3) 30
4) 35
- View Answer
- సమాధానం: 3
42. విద్యార్జనలో విద్యార్థి వైఖరులను తెలుసుకునేందుకు ఉపయోగపడే మూల్యాంక సాధనం?
1) ప్రాయోగిక పరీక్షలు
2) ప్రశ్నావళి
3) నిర్థారణ మాపనలు
4) మౌఖిక పరీక్షలు
- View Answer
- సమాధానం: 3
43. ప్రామాణిక నికషకు ఉదాహరణ?
1) ఉపాధ్యాయ నిర్మిత నికష
2) కేస్‌స్టడీ
3) ఇంటర్వ్యూ
4) సోషియోమెట్రిక్ పరీక్ష
- View Answer
- సమాధానం: 1
44. ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థి ప్రావీణ్యతను మదింపు చేసేది?
1) అప్రామాణిక నికష
2) ప్రామాణిక నికష
3) మాపనం
4) సమగ్ర మూల్యాంకనం
- View Answer
- సమాధానం: 2
45. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలకు కేటాయించిన మార్కులు?
1) 15
2) 25
3) 20
4) 30
- View Answer
- సమాధానం: 3
46. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక?
1) విద్యా ప్రణాళిక
2) పాఠ్యప్రణాళిక
3) వార్షిక ప్రణాళిక
4) సంస్థాగత ప్రణాళిక
- View Answer
- సమాధానం: 2
47. ‘భాష వివిధ భాషణల అలవాట్లతో కూడిన సంక్షిష్ట వ్యవస్థ’ అని అభిప్రాయపడినవారు?
1) హాకెట్
2) బ్లూమ్
3) స్కిన్నర్
4) పావ్లోవ్
- View Answer
- సమాధానం: 1
48. ఒక వ్యక్త మాటలను వింటున్నపుడు ఏ అంశాలను గ్రహించాలి. ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి?
1) వక్తృభేద గ్రాహక శ్రవణం
2) విస్తార భేదక గ్రాహక శ్రవణం
3) సూక్ష్మభేద గ్రాహక శ్రవణం
4) స్థూలభేద గ్రాహక శ్రవణం
- View Answer
- సమాధానం: 3
49. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు ఆధారమైన నివేదిక?
1) జనార్దనరెడ్డి కమిటీ నివేదిక
2) కొఠారి విద్యా విషయ నివేదిక
3) భాషా బోధన పరిధి పత్రం
4) భారంలేని విద్యా నివేదిక
- View Answer
- సమాధానం: 4
50. మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి?
1) ప్రామాణికత
2) ప్రాశ్నికత
3) అనుభవం
4) భావుకత
- View Answer
- సమాధానం: 1
51. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక?
1) సంస్థా ప్రణాళిక
2) విద్యా ప్రణాళిక
3) సహవిషయాంశ ప్రణాళిక
4) విషయ ప్రణాళిక
- View Answer
- సమాధానం: 2
52. స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు?
1) రేడి యో
2) భాషా ప్రయోగశాల
3) టేప్ రికార్డర్
4) చిత్రాలు, పటాలు
- View Answer
- సమాధానం: 4
53. ‘రీతి, సమత, స్పష్టం, వేగం’ అను లక్షణాలుండవలసిన భాషా నైపుణ్యం?
1) లేఖనం
2) శ్రవణం
3) పఠనం
4) భాషణం
- View Answer
- సమాధానం: 1
54. హరిజన పత్రికలో మాతృభాషా మాధ్యమ ప్రాధాన్యాన్ని గురించి రాసినవారు?
1) హుమయూన్ కబీర్
2) జాకీర్ హుస్సేన్
3) మహాత్మా గాంధీ
4) మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్
- View Answer
- సమాధానం: 3
55. విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియలకు ఏ మాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం?
1) బాహ్య పఠనం
2) ప్రకాశ పఠనం
3) మౌన పఠనం
4) క్షుణ్ణ పఠనం
- View Answer
- సమాధానం: 3
56. భాషా బోధన ప్రారంభ చర్య?
1) శ్రవణ చర్య
2) లిఖిత చర్య
3) వాచిక చర్య
4) లేఖన చర్య
- View Answer
- సమాధానం: 3
57. వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు అనేవి?
1) బహుమితీయ ఉపకరణాలు
2) ఏకపార్శ్వ ఉపకరణాలు
3) త్రిపార ్శ్వ ఉపకరణాలు
4) ద్విపార్శ్వ ఉపకరణాలు
- View Answer
- సమాధానం: 4
58. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్నీ పాఠ్యాంశాలకు తయారు చేసుకొనే బోధనా ప్రణాళిక?
1) విద్యా ప్రణాళిక
2) సంస్థాగత ప్రణాళిక
3) విషయ ప్రణాళిక
4) వార్షిక ప్రణాళిక
- View Answer
- సమాధానం: 4
59. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేవి?
1) ప్రణాళిక
2) మూల్యాంకనం
3) అభ్యసన స్థాయి
4) అనుప్రయుక్తం
- View Answer
- సమాధానం: 2