ఛందస్సు- మాదిరి ప్రశ్నలు
పద్య గేయ లక్షణాలను తెలిపే శాస్త్రం ఛందస్సు. ఛందస్సు వేదాంగాల్లో ఒకటి. గణబద్ధమైంది ఛందస్సు. గురు లఘువుల కలయికతో గణాలు ఏర్పడతాయి. గణాలను స్థూలంగా నాలుగు విధాలుగా వర్గీకరించవచ్చు.
1. ఏకాక్షర గణాలు: 2
i) ఒకే ఒక్క గురువుంటే అది గ(U)
ii) ఒకే ఒక్క లఘువుంటే అది ల (I)
2. రెండక్ష రాల గణాలు: 4
i) గలము లేక హగణం (UI)
ii) గగము (UU)
iii) లగము లేక వగణం (IU)
iv) లలము (II)
3. మూడక్షరాల గణాలు: 8.
వీటినే నైసర్గిక గణాలంటారు. ఇవి 8.
1) భగణం (UII)
2) రగణం (UIU)
3) తగణం (UUI)
4) సగణం (IIU)
5) యగణం (IUU)
6) మగణం (UUU)
7) జగణం (IUI)
8) నగణం (III)
వృత్తాల్లో వీటి ప్రాధాన్యం ఉంటుంది
4. నాల్గక్షరాల గణాలు: 3
1) నలము (IIII)
2) నగము (IIIU)
3) సలము (IIUI)
సూర్య గణాలు: 2
1) నగణం (III)
2) గలము లేక హగణం (UI)
ఇంద్ర గణాలు: 6
1) భగణం
2) రగణం
3) తగణం
4) నలం
5) నగం
6) సలం
ఇంద్రగణాలు కందం, ద్విపద వంటి జాతుల్లో సూర్యగణాలు తేటగీతి, ఆటవెలది, సీసం వంటి ఉప జాతుల్లో ఇంద్ర గణాలు, సూర్య గణాల ప్రాధాన్యం ఉంటుంది.
యతి ప్రాసలు: ‘ఆద్యోవళిః ద్వితీయోప్రాసం’ పద్య పాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. యతికి వళి, వడి, విరతి వంటి పర్యాయ పదాలున్నాయి. పద్య పాదంలో రెండో అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
వృత్త పద్యాలు, జాతులు (కందం, ద్విపద) వంటి వాటిలో ప్రాస నియమం ఉంటుంది. తేటగీతి, ఆటవెలది, సీసం వంటి వాటిలో ప్రాస నియమం ఉండదు.
ప్రాస యతి: ప్రాస నియమం లేని పద్యాల్లో పద్య పాదంలో ప్రాసక్షరమైన రెండో అక్షరానికి యతి చెల్లించవలసిన అక్షరానికి పక్కనున్న అక్షరంతో యతి మైత్రిని చెల్లించడాన్ని ప్రాసయతి అంటారు.
ఉదా: ‘తెల్లవారనుగడుసరిగొల్లవారు
పై తేటగీతి పద్య పాదంలో యతి చెల్లవలసిన ‘తె-గొ’ అనే అక్షరాలకు యతి చెల్లదు. కనుక ప్రాసాక్షరమైన ‘ల్ల’ నాల్గవ గణం రెండో అక్షరమైన ‘ల్ల’కు యతి చెల్లినందున ఇది ప్రాసయతి
యతి మైత్రి: పద్యపాదంలో మొదటి అక్షరానికి పాద మధ్యంలో నిర్ణీతాక్షరానికి మైత్రిని పాటించడం యతి మైత్రి అంటారు.
1. ‘పట్టు గ నీశ్వరుండు తన పాలిటనుండి పుడిచ్చినంతలో దిట్టక దీన దేహులను తేటగలాలన జేసి,యున్నమున్’ పై పాదాల్లో ఉన్న ప్రాస పేరు?
1) త్రిప్రాసం
2) దుష్కర ప్రాసం
3) సుకర ప్రాసం
4) ద్వంద్వ ప్రాసం
- View Answer
- సమాధానం: 2
2. ‘వెన్నెల వెల్లిపాల్కడలి వ్రేకదనంబేన బేర్చిదిక్కులున్’ ఈ పద్య పాదంలో ఉన్న ఛందస్సు?
1) శార్దూలం
2) చంపకమాల
3) ఉత్పలమాల
4) మత్తకోకిల
- View Answer
- సమాధానం: 3
3. ఉత్పలమాల పాదంలో మొత్తం అక్షరాలు?
1) 21
2) 20
3) 19
4) 22
- View Answer
- సమాధానం: 2
4. జతపరచండి.
పద్య పాదం:
a) ఉత్పలమాల
b) శార్దూలం
c) చంపకమాల
d) మత్తేభం
యతి మైత్రి:
i) 11వ అక్షరం
ii) 10వ అక్షరం
iii) 13వ అక్షరం
iv) 14వ అక్షరం
1) a-iii, b-i, c-ii, d-iv
2) a-ii, b-iii, c-i, d-iv
3) a-i, b-iii, c-ii, d-iv
4) a-ii, b-i, c-iii, d-iv
- View Answer
- సమాధానం: 2
5.శార్దూలం పద్యపాదంలో ఎన్ని సగణాలుంటాయి?
1) 3
2) 4
3) 2
4) 1
- View Answer
- సమాధానం: 3
6. ‘న,జ,భ,జ,జ,జ,ర’అనే గణాలున్న పద్యం?
1) ఉత్పలమాల
2) తరలం
3) చంపకమాల
4) మత్తేభం
- View Answer
- సమాధానం: 3
7. చంపకమాల పద్య పాదంలో ఎన్ని జ గణాలుంటాయి?
1) 3
2) 4
3) 2
4) 5
- View Answer
- సమాధానం: 2
8. జతపరచండి.
జాబితా-I
a) భ,ర,న,భ,భ,ర,వ
b) న,జ,భ,జ,జ,జ,ర
c) మ,స,జ,స,త ,త,గ
d) స,భ,ర,న,మ,య,వ
జాబితా-II
i) చంపకమాల
ii) ఉత్పలమాల
iii) మత్తేభం
iv) శార్దూలం
1) a-i, b-iii, c-iv, d-ii
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-ii, b-i, c-iii, d-iv
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 2
9. మత్తేభ పద్య పాదంలో మగణం ఎన్నో గణం?
1) 3
2) 4
3) 5
4) 2
- View Answer
- సమాధానం: 3
10. న,భ,ర,స,జ,జ,గ అనే గణాలుండే పద్య పాదం?
1) మత్తకోకిల
2) చంపక మాల
3) తరలం
4) మాలిని
- View Answer
- సమాధానం: 3
11. 12వ అక్షరం యతి మైత్రి ఉన్న పద్యం?
1) మత్తకోకిల
2) మధ్యాక్కర
3) మత్తేభం
4) తరలం
- View Answer
- సమాధానం: 4
12. కింది వాటిని సరైన క్రమంలో జతపరచండి.
జాబితా-I
a) భ,జ,స,నల,గగ అనే గణాలున్న పద్యం
b) మూడు ఇంద్ర గణాలు+1 సూర్య గణం ఉన్న పద్యం
c) వరుసగా 7 సూర్యగణాలు+1 గురువున్న పద్యం
d) 3 ఇంద్ర గణాలు+1 సూర్యగణం+ 3 ఇంద్ర గణాలు+1 సూర్యగణం ఉన్న పద్యం
జాబితా-II
i) ద్విపద
ii) కందం
iii) తరువోజ
iv) ఉత్సాహం
1) a-i, b-iii, c-ii, d-iv
2) a-i, b-ii, c-iv, d-iii
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-i, b-iii, c-iv, d-ii
- View Answer
- సమాధానం: 3
13. కింది వాటిలో ప్రాస నియమం లేని పద్యం?
1) ద్విపద
2) కందం
3) ఉత్సాహం
4) తేటగీతి
- View Answer
- సమాధానం: 4
14. మధ్యాక్కర పద్య పాదంలో గణాలు?
1) 3 ఇంద్రగణాలు+ 1 సూర్యగణం+3 ఇంద్రగణాలు+ 1 సూర్యగణం
2) 2 ఇంద్రగణాలు + 1 సూర్యగణం + 2 ఇంద్ర గణాలు + 1 సూర్యగణం
3) 4 ఇం+1సూ+4 ఇం+1సూ
4) 2 ఇం+2సూ+2 ఇం+2సూ
- View Answer
- సమాధానం: 2
15. నన్నయ మధ్యాక్కరలో పాటించిన యతి స్థానం?
1) 4వ గణం మొదటి అక్షరం
2) 3వ గణం మొదటి అక్షరం
3) 5వ గణం మొదటి అక్షరం
4) 2వ గణం మొదటి అక్షరం
- View Answer
- సమాధానం: 3
16. నన్నయ అనంతరం ఎర్రనాది కవులు మధ్యాక్కరలో పాటించిన యతి స్థానం?
1) 4వ గణం మొదటి అక్షరం
2) 3వ గణం మొదటి అక్షరం
3) 5వ గణం మొదటి అక్షరం
4) 6వ గణం మొదటి అక్షరం
- View Answer
- సమాధానం: 1
17. జతపరచండి.
గణాలు:
a) 1సూ+2ఇం+2సూ.గణాలు
b) 3 సూ.గణాలు+2 ఇం.గణాలు
c) 6 ఇంద్ర గణాలు+2 సూ.గణాలు
d) 2 ఇంద్ర గణాలు+1సూ.గణం+2 ఇంద్ర గణాలు+1సూ.గణం
పద్య పాదం పేరు:
i) ఆటవెలది
ii) తేటగీతి
iii) మధ్యాక్కర
iv) సీసం
1) a-i, b-ii, c-iv, d-iii
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-iii, b-i, c-iv, d-ii
4) a-i, b-iii, c-ii, d-iv
- View Answer
- సమాధానం: 2
18. కింది వాటిలో ఇంద్ర గణం కానిదేది?
1) భగణం
2) తగణం
3) సలం
4) హగణం
- View Answer
- సమాధానం: 4
19. కింది వాటిలో సూర్య గణం ఏది?
1) నలము
2) నగము
3) నగణం
4) సలము
- View Answer
- సమాధానం: 3
20. ‘వ’గణం ఉన్న వృత్తపద్యం?
1) చంపకమాల
2) ఉత్పలమాల
3) శార్దూలం
4) మత్తకోకిల
- View Answer
- సమాధానం: 2
21. ‘మందార మకరంద మాధుర్యమునదేలుమధుపంబు వోవునే!మదనములకు’ పై పాదాల్లో ఉన్న ఛందస్సు?
1) స్రగ్థర
2) మత్తకోకిల
3) సీసం
4) మహాస్రగ్థర
- View Answer
- సమాధానం: 3
22. కింది వాటిలో ప్రాస నియమం లేని పద్యం?
1) కందం
2) ద్విపద
3) తేటగీతి
4) ఉత్సాహం
- View Answer
- సమాధానం: 3
23. కింది వాటిలో ప్రాస యతి ఉన్న పద్య పాదం ఏది?
1) భరత ఖండంబు చక్కని పాడియావు
2) హిందువులు లేగదూడవై ఏడ్చుచుండ
3) పితుకుచున్నారు మూతులు బిగియబట్టి
4) తె ల్లవారను గడుసరిగొల్లవారు
- View Answer
- సమాధానం: 4
24. ‘ర,స,జ,జ,భ,ర’ అనే గణాలున్న పద్యం?
1) మత్తేభం
2) మత్తకోకిల
3) మానిని
4) ద్విపద
- View Answer
- సమాధానం: 2
25. మత్తేభ పద్యపాదంలో ‘యగణం’ ఎన్నో గణం?
1) 5వ గణం
2) 4వ గణం
3) 6వ గణం
4) 3వ గణం
- View Answer
- సమాధానం: 3
26. ‘విబుధ జనుల వలన విన్నంతకన్నంత తెలియ వచ్చినంత తేటపరుతు’ ఈ పాదాల్లో ఉన్న ఛందస్సు?
1) తేటగీతి
2) ఆటవెలది
3) ద్విపద
4) మంజరీ ద్విపద
- View Answer
- సమాధానం: 2
27. ఎక్కువ నియమాలున్న దేశీయమైన ఛందస్సు?
1) ద్విపద
2) ఉత్సాహం
3) కందం
4) తరువోజ
- View Answer
- సమాధానం: 3
28. ‘ఛందో దర్పణం’ లక్షణ గ్రంథకర్త?
1) వేములవాడ భీమకవి
2) అనంతామాత్యుడు
3) అడిదం సూరకవి
4) అప్పకవి
- View Answer
- సమాధానం: 2
29. ‘అ-య-హ’ అనే అక్షరాలు పరస్పరం యతి మైత్రికి చెల్లు యతి పేరు?
1) వర్గయతి
2) అభేదయతి
3) స్వరయతి
4) సరసయతి
- View Answer
- సమాధానం: 4
30. ప్రాస స్థానంలో క్లిష్టమైన సంయుక్త, ద్విత్వాక్షరాలుంటే దాన్ని ఏ ప్రాస అంటారు?
1) సుకర ప్రాసం
2) అను ప్రాసం
3) దుష్కర ప్రాసం
4) ద్వంద్వ ప్రాసం
- View Answer
- సమాధానం: 3
31.భ,ర,న,భ,భ,ర,వ అనే గణాలుండే పద్యం?
1)ఉత్పలమాల
2) ఆటవెలది
3) చంపకమాల
4)మత్తేభం
- View Answer
- సమాధానం: 1
32.చంపకమాలలో ఆరవ గణం తప్పనిసరిగా?
1) జగణం
2) నగణం
3) భగణం
4) రగణం
- View Answer
- సమాధానం: 1
33. ‘ఊరూరం జనులెల్ల బిచ్చమిడరో యుండంగుహల్గల్గవో’ పై పద్య పాదంలో యతి అక్షరాలను గుర్తించండి?
1) ఊ-బి
2) ఊ-యుం
3) ఊ-డం
4) ఊరో
- View Answer
- సమాధానం: 2
34.చంపకమాల పద్యానికి ఇది ఒక లక్షణం?
1) యతిస్థానం 14వ అక్షరం
2) ప్రాస నియమం లేదు
3) ప్రతి పాదంలో 19 అక్షరాలుంటాయి
4) ప్రతి పాదంలో మూడవ గణంగా భగణం ఉంటుంది
- View Answer
- సమాధానం: 4
35.ఒకటి, మూడో పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు, రెండు, నాల్గో పాదాల్లో వరుసగా ఐదు సూర్యగణాలుండే పద్యం?
1) ఆటవెలది
2) తేటగీతి
3) ద్విపద
4) కందం
- View Answer
- సమాధానం: 1
36. సీస పద్య పాదంలో ఉండే గణాలు?
1) 3 ఇం+1 సూ+3 ఇం+సూ.గణాలు
2) 4 ఇం+4 ఇం.గణాలు
3) 6 ఇం+2 సూర్య గణాలు
4) 2 ఇం+6 సూర్య గణాలు
- View Answer
- సమాధానం: 3
37. కింది వాటిలో జాతి పద్యం ఏది?
1) ద్విపద
2) తేటగీతి
3) ఆటవెలది
4) సీసం
- View Answer
- సమాధానం: 1
38. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో కన్పించిన ఛందస్సు?
1) మధ్యాక్కర
2) తరువోజ
3) మంజరీ ద్విపద
4) ద్విపద
- View Answer
- సమాధానం: 1
39. కంద పద్య లక్షణాలను గుర్తించండి?
ఎ) నల,నగ,సల,భ,ర,త గణాలుంటాయి
బి) ప్రాస నియమం ఉండదు
సి) నాలుగు పాదాల్లో యతి నియమం ఉంటుంది
డి) ‘జగణం’ బేసి గణంగా వాడరాదు
1) ఎ,సి
2) ఎ,డి
3) బి,సి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
40. ఉత్పలమాల పద్యానికి యతిస్థానం?
1) పదకొండో అక్షరం
2) పదునాల్గవ అక్షరం
3) పదవ అక్షరం
4) పదమూడవ అక్షరం
- View Answer
- సమాధానం: 3
41. ‘పవన తనూజు బాహువులు పాణియుగంబున బట్టి ఏకమై’ పై పద్య పాదంలో ఛందస్సు?
1) ఉత్పలమాల
2) మత్తేభం
3) శార్దూలం
4) చంపకమాల
- View Answer
- సమాధానం: 4
42.మత్తేభ వృత్తానికి చెందిన పద్య పాదం ఏది ?
1) భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వలబాణ తూణకో
2) కలనైన సత్యంబు బలకనొల్లనివాడు మాటల సామ్ము
3) పూరంబేరుల బారదో తపసులం బ్రోవంగ నోపవో
4) ఘనుడవ్వాడగు నేడు త్యాగమయ దీక్షబూని సర్వంపహా
- View Answer
- సమాధానం: 4