ట్రిపుల్ ఐటీకి కరోనా సెలవులు
Sakshi Education
నూజివీడు: కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్ ఐటీకి శనివారం సెలవులు ప్రకటించారు.
ట్రిపుల్‌ఐటీలో పీయూసీ ప్రథమ, ద్వితీయ, ఇంజినీరింగ్ తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థులున్నారు. ఇటీవల ఓ కాంట్రాక్టు అధ్యాపకుడికి, మరో విద్యార్థికి కరోనా నిర్ధారణ కావడంతో మందు జాగ్రత్తగా పలు బ్రాంచిల విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. నూజివీడు క్యాంపస్‌కు సంబంధించి పీయూసీ ద్వితీయ సంవత్సరం, ఇంజినీరింగ్ తృతీయ సంవత్సర విద్యార్థులకు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇంజినీరింగ్ తృతీయ ఏడాది విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.
Published date : 12 Apr 2021 04:51PM