తెలుగమ్మాయి గిన్నిస్ వరల్డ్ రికార్డ్:బ్లాక్ చైన్ టెక్నాలజీతో సైబర్ ఎటాక్ కు చెక్
Sakshi Education
నీరుకొండ(మంగళగిరి): గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ అమరావతి బ్రాంచి విద్యార్థిని గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.
యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న గారిపల్లి వైష్ణవి.. సైబర్ సెక్యూరిటీలో తొలిసారి బ్లాక్‌చైన్ టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించినందుకు ఈ రికార్డు లభించింది. ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఎదురవుతున్న తాజా సవాళ్లపై అక్టోబర్ 30వ తేదీన జరిగిన అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రం ప్రచురణకు నోచుకున్నట్టు వైష్ణవి వివరించారు. తాను అభివృద్ధి చేసిన యాప్ వలన కంప్యూటర్ ముఖ్యమైన డేటా చోరీకి గురయ్యే అవకాశం లేదని, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలపైన సైబర్ ఎటాక్ జరిగే అవకాశం లేదని ఆమె తెలిపారు. దీన్ని గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు కమిటీ ఆమెను ప్రశంసిస్తూ గిన్నిస్ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా వైష్ణవిని యూనివర్సిటీ యాజమాన్యం అభినందించింది.
Published date : 02 Dec 2020 03:10PM