Skip to main content

కంది ఐఐటీలో కొత్తగా ఏడు ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సులు..

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ విద్యా సంస్థ ఏడు ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సులను ప్రారంభిస్తోంది.
అలాగే వర్కింగ్‌ ప్రోఫెషనల్స్‌ కోసం ప్రత్యేకించి ఆన్‌లైన్‌ ఎండీఈఎస్‌ ప్రొగ్రామ్‌కు కూడా శ్రీకారం చుడుతున్నట్లు శుక్రవారం హైదరాబాద్‌ ఐఐటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ కోర్సులు ఆగస్టు నుంచి ప్రారంభమవుతున్నట్లు వెల్లడించాయి. ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సుల్లో పారిశ్రామిక లోహశాస్త్రం, ఈవీ టెక్నాలజీ, కంప్యూటేషనల్‌ మెకానిక్స్, ఇంటిగ్రేటెడ్‌ కంప్యూటేషనల్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్‌ అండ్‌ సిగ్నల్స్‌ ప్రాసెసింగ్‌ (సీఎస్‌పీ), పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ పవర్‌ సిస్టమ్‌ (పీఈపీఎస్‌), మైక్రో ఎలక్ట్రానిక్స్, వీఎల్‌ఎస్‌ఐ (ఎంఈ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ) వంటివి ప్రారంభంకానున్నాయి. జూలై 7లోగా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా నిర్ణయించింది. బీఈ, బీటెక్, సంబంధిత పరిశ్రమలో రెండేళ్ల అనుభవం ఉన్న వారు ఈ కోర్సులకు అర్హులని తెలిపింది. ఆన్‌లైన్‌ ఎండీఈఎస్‌ కోర్సులకు బీఈ, బీటెక్, బీఎస్, బీడీఈఎస్, బీఆర్క్‌ కోర్సుల్లో ఫస్ట్‌క్లాస్‌ డిగ్రీతో పాటు రెండేళ్ల అనుభవం, అలాగే 55 శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ (ఆర్ట్స్‌) ఉన్న వారు అర్హులని పేర్కొంది. అలాగే 55 శాతం మార్కులతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ(ఆర్ట్స్‌), సంబంధిత ఇండస్ట్రీస్‌లో రెండేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులని వెల్లడించింది. పూర్తి వివరాలకు www.iith.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
Published date : 26 Jun 2021 03:10PM

Photo Stories