Skip to main content

ఆన్‌లైన్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 శిక్షణ: ఇంటివద్దనే ఉండి వీలున్నప్పుడు చదువుకునే అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వందల సంఖ్యలోని పోస్టులకు పోటీ లక్షల్లోనే ఉంటుంది.
గ్రూప్-2 సాధించి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని రాష్ట్రంలోని లక్షలాది మంది అభ్యర్థులు కోరుకుంటారు. విసృ్తత సిలబస్ ఉండే గ్రూప్-2 పరీక్షలకు కనీసం ఆరేడు నెలలు అంకితభావంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారితోపాటు పీజీ చదివే విద్యార్థులు, ఉద్యోగాలు చేసేవారు, గృహిణులు ఉంటారు. కరోనా కారణంగా తరగతి గది కోచింగ్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు తమ వ్యాపకాలు కొనసాగిస్తూనే.. ఇంటి వద్దనే ఉండి వీలున్న సమయంలో ఆన్‌లైన్ క్లాసులు వింటూ గ్రూప్-2కు సన్నద్ధమయ్యేలా డ్రీమ్స్ ఇన్‌స్టిట్యూట్ (కేజీహెచ్ అకాడెమీ) ఆధ్వర్యంలో ఆన్‌లైన్ శిక్షణ ప్రారంభమైంది. మీడియా పార్టనర్‌గా సాక్షి మీడియా గ్రూప్ వ్యవహరిస్తోంది. ఠీఠీఠీ.్చట్ఛ్చౌ్ఛ.జీ ద్వారా లాగిన్ అయి రూ.5,500 ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 15 చివరి తేదీ. ఫీజు చెల్లించిన రోజు నుంచి ఒక సంవత్సరం పాటు ఆన్‌లైన్‌లో క్లాసులు వినొచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత ఆన్‌లైన్ తరగతుల వివరాలు మెసేజ్ చేస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు: 9666283534, 9912671555, 9666697219.
Published date : 02 Oct 2020 01:06PM

Photo Stories