ఆన్‌లైన్ పాఠాలా.. జర జాగ్రత్త!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కోవిడ్-19 వైరస్ పరిస్థితుల నేపథ్యంలో విద్యారంగం, బోధనాపద్ధతులు, విధానాలు సమూల మార్పులకు లోనవుతున్నాయి.
చిన్న తరగతులు మొదలు పీజీ స్థాయి వరకు ఆన్‌లైన్ చదువు తప్పనిసరైంది. అయితే, ఆన్‌లైన్ చదువే అన్నింటికీ పరిష్కారంకాదని, ఇందులోనూ మంచి, చెడులున్నాయనే వారూ ఉన్నారు. ఈ విధానంలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ దశరథరామారెడ్డి వివరించారిలా..
- ఆన్‌లైన్ చదువులతో పిల్లలు రోబో’ల్లాగా తయారవుతారని అనిపిస్తోంది.
- ఏకబిగిన కొన్ని గంటలపాటు టీవీ స్క్రీన్ లేదా కంప్యూటర్ మానిటర్, మొబైల్ ఫోన్లో పాఠాలు చూడడం, వినడం.. వీటికి తోడు వ్యాయామం లేకపోవడంతో పిల్లలు వెన్నెముక, కళ్ల సమస్యలతో ఆసుపత్రులకు రావడం మొదలైంది.
- ఆన్‌లైన్ క్లాసులకు సరైన సీటింగ్, లైటింగ్ ఉండాలి. 90 డిగ్రీల కోణంలో కుషన్ లేని గట్టి కుర్చీని ఏర్పాటు చేసుకోవాలి.
- మెడ తిప్పడంలో ఇబ్బందుల్లేకుండా కంప్యూటర్ లేదా టీవీని పెట్టుకోవాలి. స్క్రీనుకు తగినంత దూరం పాటించాలి.
- పతి 45 నిముషాల క్లాస్‌కు కనీసం 5 నిముషాల విరామం ఇవ్వాలి. కళ్లను అప్పుడప్పుడు విప్పారించి, తరచూ రెప్పలార్పుతూ చూడాలి. కళ్లు పొడారిపోకూడదు.
- చేతివేళ్లు బిగుసుకుపోకుండా ఉండేలా మధ్య, మధ్యలో మెటికలు విరవడం, స్ట్రెస్ బస్టర్ స్పాంజ్ బంతులను వత్తడం వంటివి చేయాలి.
- ఆన్‌లైన్ క్లాస్‌లకు సెల్‌ఫోన్లు వాడడం మంచిది కాదు. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు కూడా ఈ క్లాస్‌లు పెట్టడం వల్ల ఎదుగుదల సమస్యలు తలెత్తుతాయి.
Published date : 10 Aug 2020 02:16PM