10 వేల మందికి సైబర్ సెక్యూరిటీపై శిక్షణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) నడుం బిగించింది.
డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (యూటీడీ) సాయంతో, ‘డిజిథాన్’భాగస్వామ్యంతో ‘సైబర్ రెడీ ప్రోగ్రామ్’పేరిట సైబర్ సెక్యూరిటీపై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఆస్తులను కాపాడే లక్ష్యంతో 2022 నాటికి 10 వేల మందికి శిక్షణ ఇవ్వాలని టిటా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ శిక్షణ పొందిన వారికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ను యూటీడీ, డిజిథాన్ అందిస్తాయని టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల వెల్లడించారు. కాగా, సెంటర్ ఫర్ సైబర్ సేఫ్టీ అండ్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం 2022 నాటికి సైబర్ సెక్యూరిటీ రంగంలో 18 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Published date : 01 Aug 2020 04:19PM