Tribal School Teachers: ఉపాధ్యాయులకు హెచ్చరిక
సాక్షి ఎడ్యుకేషన్: విద్యాబోధనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అరకు ఎంఎల్ఏ చెట్టి పాల్గుణ హెచ్చరించారు. మండలంలోని నందివలస గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. విద్యాబోధన, విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోపాటు విద్యార్థులు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు.
Teaching Posts: ఎస్‌సీటీఐఎంఎస్‌టీ, తిరువనంతపురంలో టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫోటో పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఏడాది క్రితం ఆదేశించినా ఎందుకు పెట్టలేదని, పాఠ్య ప్రణాళిక ఎందుకు తయారు చేయలేదని హెచ్చరించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే చెప్పారు.