Skip to main content

Teachers Memo: పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు

పాఠాలు వినే విద్యార్థులే కాదు అర్థమయ్యేలా వివరించే ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో నిబంధనలు పాటించాలి. ఇలా సమయానుసారాన్ని పాటించకుండా ఉన్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు అధికారులు. పూర్తి విషయాలు..
Following school rules    Distributing memo to school teachers by collector for neglecting rules

ఆదిలాబాద్‌టౌన్‌: తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడాన్ని వివరిస్తూ బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ రాజర్షి షా స్పందించారు. ఉదయం 8గంటలకు రావాల్సిన ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంపై సీరియస్‌ అయ్యారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈవో ప్రణీతను ఆదేశించారు.

Students Health: విద్యార్థుల ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంఈవో నారాయణ పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. వారు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీఈవో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు.

Published date : 21 Mar 2024 01:22PM

Photo Stories