Education in AP: నాణ్యమైన విద్యను అందిస్తున్న జగన్ ప్రభుత్వం
సాక్షి ఎడ్యుకేషన్: సీఎం జగన్‌మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ పలు కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని, వీటిని విద్యార్థులంతా అందిపుచ్చుకోవాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మంగళవారం ఆమె స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల–2ను తనిఖీ చేశారు. ఆంగ్ల మీడియంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
First Deaf Lawyer Of India: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్‌గా సారా
ఏపీలో చదువుల విప్లవాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారని, కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా నాడు నేడులో సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు జగబంధు, మండల నాయకులు మల్లికార్జునరావు, సర్పంచ్‌లు, రమేష్, నీలకంఠం, గంగాధర్ ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.