Skip to main content

Navodaya Exam: ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ నవోదయ ప్రవేశ పరీక్ష

జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ నాగరాజు తెలిపారు.
Admissions alert   Jawahar Navodaya Vidyalaya Exam Date 2024   Entrance exam on Feb 10 for class 9 and inter first year admissions at Jawahar Navodaya Vidyalaya.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 1003 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వీరికి నవోదయ విద్యాలయంలోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేరోజే ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశానికి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల పాఠశాల, కళాశాలలో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరీక్షకు 619 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 11 గంటలకు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

Model School Admissions: మోడల్‌ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం.. చివ‌రి తేదీ ఇదే

Published date : 05 Feb 2024 09:25AM

Photo Stories