Primary Education: ‘ప్రాథమిక’ విద్యపై ప్రత్యేక శ్రద్ధ
![The future of students at the primary education](/sites/default/files/images/2023/08/31/primary-education-1693477088.jpg)
ప్రాథమిక దశలోనే విద్యార్థుల భవిష్యత్తుకు గట్టి పునాదివేసేలా రాష్ట్రప్రభుత్వం విద్యాసంస్కరణలు అమలుచేస్తోంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లతో బోధన అందిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన ఆంగ్లమాధ్యమంలో పట్టుసాధించేలా బోధన ప్రణాళికను అమలుచేస్తోంది. పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరంకాకూడదన్న ఉద్దేశంతో ‘జగనన్న అమ్మఒడి’ కింద ఏటా రూ.15000లు ఆర్థిక సాయం అందిస్తోంది. జగనన్న విద్యాకానుక కింద సమస్త విద్యాభ్యాసన సామగ్రి సమకూరుస్తోంది. జగనన్న గోరుముద్ద కింద రుచికరమైన భోజనం వడ్డిస్తోంది. నాడు–నేడుతో సరస్వతీనిలయాలకు సకల సదుపాయాలు కల్పిస్తోంది. 8వ తరగతి నుంచి డిజిటల్ చదువులు ప్రోత్సహించేలా ట్యాబ్‌లు అందజేస్తోంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌టీ), స్మార్ట్ టీవీల సాయంతో డిజిటల్ తరగతులు అందుబాటులోకి తెచ్చింది. పదోతరగతిలో ప్రతిభ చూపే విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో సత్కరిస్తోంది. చదువుకు ఆర్థిక కష్టాలు దూరం చేస్తోంది.