Collector Subbulakshmi: ఉత్తమ ఫలితాలు సాధించకుంటే టీచర్లపై చర్యలు
ఫిబ్రవరి 2న ఉదయం వేలూరు జిల్లా సత్‌వచ్చారిలోని ప్రభుత్వ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో పదో తరగతి, ప్లస్‌టూలో ఎంత మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో ఎంత శాతం మార్కులు సాధించారు, ఎంత మంది ఉత్తీర్ణత సాధించలేక పోయారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్న శిఖరాలకు వెళ్లారని ఉపాధ్యాయులు ఈ రెండు నెలల పాటు కష్టపడి విద్యార్థులకు విద్యా బోధన చేసి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఎందుకు భయాందోళన చెందుతున్నారు.
చదవండి: CBSE 9th Class: సీబీఎస్‌ఈ 9వ తరగతి పుస్తకాల్లో... డేటింగ్, రిలేషన్‌షిప్ పాఠాలు
విద్యా ఉత్తీర్ణతలో వెనుకంజలో ఉన్నారు అనే విషయాలపై అధ్యయనం చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో కలిసి ఆహారాన్ని భోజనం చేశారు. అనంతరం విద్యార్థుల వద్ద ప్రతి రోజూ సక్రమమైన భోజనం అందజేస్తున్నారా లేదా, టీచర్లు సరైన విద్యా బోధన చేస్తున్నారా అనే విషయాలను విద్యార్థుల వద్ద అడిగి తెలుసుకున్నారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ సుబ్బులక్ష్మి ఉన్నపళంగా ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. ఆమెతో పాటు విద్యాశాఖ సీఈఓ మణిమొయి, తహసీల్దార్ నెడుమారన్, హెచ్‌ఎం గుణశేఖరన్ అధికారులు ఉన్నారు.