సాధారణ వడ్డీని గణించ గలగడం అనేది ఏ విద్యా ప్రమాణం?
1. (a+b)2 = a2+b2+2ab అయితే a2+b2 = (a+b)2-2ab అవుతుంది అని పేర్కొనే వాదం ఏది?
1) సహజ జ్ఞాన
2) ప్రాకృతిక బోధన
3) తార్కిక వాదం
4) సాంప్రదాయిక వాదం
- View Answer
- సమాధానం: 3
2.విద్యార్థికి అసమీకరణాలను బోధింప గలిగే దశ?
1) పూర్వ ప్రచాలక
2) నియత ప్రచాలక
3) ఇంద్రియ చాలక
4) మూర్త ప్రచాలక
- View Answer
- సమాధానం: 2
3. గణితంలో గణిత కిట్టును విస్తృతంగా వాడవలసిన దశ?
1) పూర్వ ప్రచాలక దశ
2) ఇంద్రియ చాలక దశ
3) నియత ప్రచాలక దశ
4) మూర్త ప్రచాలక దశ
- View Answer
- సమాధానం: 4
4. రవి ఒక కంప్యూటర్ టెకీ. అతడు నిరంతరం తన ప్రోగ్రామ్‌లో నూతనత్వాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తూ బెస్ట్ టెకీగా గుర్తింపు పొందాడు. వైగోట్ స్కీ ప్రకారం అతడు ఆ సంక్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోవడం అనేది?
1) ఉత్నత శారీరక ప్రక్రియ
2) ఉన్నత భౌతిక ప్రక్రియ
3) ఉన్నత మానసిక ప్రక్రియ
4) ఉన్నత విశ్లేషణాత్మక ప్రక్రియ
- View Answer
- సమాధానం: 3
5. కింది వాటిలో APSCF-2011 సూచించిన గణిత సాధారణ బోధనోద్దేశాలకు సంబంధించనిది ఏది?
1) గణిత బోధనాభ్యసనం గణితీకరణకు దారితీసేలా ఉండాలి
2) విద్యార్థులందరికీ గణిత బోధనాభ్యాసం ఆనందంగా జరగాలి
3) గణితం నేర్చుకోవడం విద్యార్థుల హక్కు
4) విద్యార్థులు గణితపరంగా చింతన చేయగలగాలి
- View Answer
- సమాధానం: 4
6. విద్యార్థి గణితాన్ని అర్థయుతంగా వినియోగించే నైపుణ్యాన్ని వృద్ధి చేయడం అనేది?
1) ఉద్దేశం
2) బోధనాలక్ష్యం
3) బోధనా విలువ
4) స్పష్టీకరణ
- View Answer
- సమాధానం: 2
7. లక్ష్యాల సఫలత-విఫలత వేటిపై ఆధారపడి ఉటుంది?
1) ఉద్దేశాలు
2) అభ్యసన అనుభవాలు
3) మూల్యాంకనం
4) స్పష్టీకరణలు
- View Answer
- సమాధానం: 2
8. కింది పటంలో ‘7‘ స్థానానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రవచనం ఏది?
1) యాంత్రికంగా ఆలోచించి బొమ్మ గీయడం
2) బొమ్మను గీసి అనుభూతి పొందడం
3) బొమ్మను తన ఆలోచనలతో గీయడం, గీసిన దాని నుంచి అనుభూతి పొందడం
4) బొమ్మను ఆలోచనలతో ఊహించడం
- View Answer
- సమాధానం: 3
9. ఆగమన, నిగమన విధానంలో కార్యాకారణ చింతన చేయడం అనేది?
1) జ్ఞానం
2) వినియోగం
3) అవగాహన
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 2
10. (101)2 = ? అనే ప్రశ్నకు విద్యార్థి (100+1)2= అనే విధానాన్ని ఎంపిక చేయడంలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 3
11. ‘సాధారణీకరించిన అంకగణితమే బీజ గణితం’. ఈ వాక్యంలోని విద్యాప్రమాణం?
1) దృశ్యీకరణ
2) వ్యక్తీకరణ
3) సమస్య సాధన
4) అనుసంధానం
- View Answer
- సమాధానం: 4
12. విద్యార్థి గడియారం చూసి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తదితర పదజాలం ఉపయోగించి సమయం చెప్పడం అనేది ఏ స్థాయి?
1) ప్రాతినిధ్య పరచడం
2) అనుసంధానించడం
3) వ్యక్త పరచడం
4) దృశ్యీకరణ
- View Answer
- సమాధానం: 3
13. ‘విద్యార్థి అకరణీయ సంఖ్యలతో సాంద్రత ధర్మాన్ని సమర్థిస్తాడు’ అనేది ఏ అంశం?
1) వ్యక్తపరచడం
2) అనుసంధానం
3) కారణాలు - నిరూపణలు
4) సమస్య సాధన
- View Answer
- సమాధానం: 3
14.సాధారణ వడ్డీని గణించ గలగడం అనేది ఏ విద్యా ప్రమాణం?
1) సమస్య సాధన
2) కారణాలు - నిరూపణలు
3) అనుసంధానం
4) దృశ్యీకరణ
- View Answer
- సమాధానం: 1
15. 394 ను < గుర్తుతో 420తో పోల్చినప్పుడు సాధించిన విద్యా ప్రమాణం?
1) వ్యక్తపరచడం
2) అనుసంధానం
3) కారణాలు-నిరూపణలు
4) సమస్య సాధన
- View Answer
- సమాధానం: 1
16. ఒక అంశాన్ని ఏ పద్ధతిలో, ఏవిధంగా బోధించాలో నిశ్చయించే మదింపు?
1) సవరణాత్మక మదింపు
2) సంకలన మదింపు
3) నిర్మాణాత్మక మదింపు
4) లోప నిర్ధారణ మదింపు
- View Answer
- సమాధానం: 3
17. విద్యార్థులు చేసిన వివిధ కృత్యాలు, సేకరించిన అభ్యసన సామగ్రి వాటి ప్రదర్శనలు, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడాన్ని ఏమంటారు?
1) పోర్ట్ ఫోలియో
2) రేటింగ్ స్కేల్
3) కృత్య దీపిక
4) అనక్టోడల్ రికార్డ్
- View Answer
- సమాధానం: 1
18. కింది వాటిలో మౌఖిక పరీక్షను మదింపు చేయడానికి ఉపయోగపడేవి?
ఎ) రేటింగ్ స్కేల్
బి) చెక్ లిస్ట్
సి) నిర్దారణ మాపని
డి) శోధన సూచిక
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
19. విద్యార్థి జీవితంలో గుర్తించిన ఒక అర్థయుక్త సంఘటన ఆధారంగా ఆ విద్యార్థి అభిరుచులు అలవాట్ల గురించే రాసే అంశం?
1) క్యుములేటివ్ రికార్డు
2) ప్రగతి పత్రం
3) అనక్టోడల్ రికార్డు
4) కేస్ రికార్డు
- View Answer
- సమాధానం: 3
20. విద్యార్థులు ఆనందంగా, అర్థవంతంగా నేర్చుకోవడానికి పరీక్షల విధానాన్ని సంస్కరించాలని పేర్కొన్నది?
1) కొఠారి కమిషన్
2) ఈశ్వరీభాయ్ కమిటీ
3) NCF - 2005
4) SCF - 2011
- View Answer
- సమాధానం: 3
21. రూబ్రిక్స్లో మూడో స్థాయి ఏది?
1) చాలా తక్కువ స్థాయిలో అవగాహన అయినది
2) కొంత అవగాహన ప్రదర్శించడం
3) స్పష్టమైన అవగాహన ప్రదర్శించడం
4) సంతృప్తికరం కాదు
- View Answer
- సమాధానం: 4
22. వివిధ రకాలైన నియోజనాలను, టాస్క్‌లను గణితంలో స్థాయి నిర్ధారణ చేయడానికి ఉపయోగించేవి?
1) లోప నిర్ధారణ సాధనం
2) టాస్క్ సాధనాలు
3) రూబ్రిక్స్
4) యుంత్రిక్స్
- View Answer
- సమాధానం: 3
23. రవి, రాధల తల్లి సరిత. రోజూ సరిత రవికి, రాధకి పాఠశాల విరామ సమయంలో తినడానికి రెండు పండ్లు పెడుతుంది. వారిద్దరికి రోజూ 100 గ్రాముల పప్పు దినుసులు, 250 గ్రాముల బియ్యం ఉపయోగిస్తుంది. అయితే ఈ విషయంలో ఉన్న గణిత విలువ?
1) కళాత్మక విలువ
2) క్రమశిక్షణ విలువ
3) సిద్ధ పరిచే విలువ
4) ప్రయోజన విలువ
- View Answer
- సమాధానం: 4
24. సూర్య, చంద్ర గ్రహణాలు కచ్చితంగా ఏ రోజు సంభవిస్తాయో లెక్కించడంలో ఉన్న విలువ?
1) ప్రయోజన విలువ
2) సాంస్కృతిక విలువ
3) సిద్ధపరిచే విలువ
4) క్రమశిక్షణ విలువ
- View Answer
- సమాధానం: 1
25. పైథాగరస్ పేర్కొన్నట్లు ‘ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది’ అనే నానుడి ఏ విలువను సూచిస్తుంది?
1) కళాత్మక విలువ
2) సాంస్కృతిక విలువ
3) సిద్ధపరిచే విలువ
4) క్రమశిక్షణ విలువ
- View Answer
- సమాధానం: 1
26. 9 × 1 = 1, 9 × 2 = 18 (1 + 8 = 9), 9 × 3 = 27 (2 + 7 = 9), 9 × 4 = 36 (3 + 6 = 9) అనే విషయాలను గమనించిన విద్యార్థికి స్మరణకు వచ్చే గణిత విలువ?
1) సిద్ధపరిచే విలువ
2) క్రమశిక్షణ విలువ
3) వినోదపు విలువ
4) సాంస్కృతిక విలువ
- View Answer
- సమాధానం: 3
27. ‘ఆధునిక నాగరికతకు గణితం అద్దం లాంటిది’ అనే హగ్బెన్ నిర్వచనం ఏ విలువకు సంబంధించింది?
1) క్రమశిక్షణ విలువ
2) కళాత్మక విలువ
3) సాంస్కృతిక విలువ
4) ప్రయోజన విలువ
- View Answer
- సమాధానం: 3
28. బోధన, అభ్యసన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడే విధానమే బోధన పద్ధతి అని పేర్కొన్న వారు?
1) వెస్లీ, రాన్ స్కీ
2) స్టాన్లీ, ఆడమ్స్
3) వెస్లీ, డ్యూయీ
4) వెస్లీ, స్టాన్లీ
- View Answer
- సమాధానం: 4
29. సూత్ర అనుప్రయుక్తం అర్థం చేసే పద్ధతి?
1) విశ్లేషణ
2) నిగమన
3) ఆగమన
4) ప్రయోగశాల
- View Answer
- సమాధానం: 2
30. అరిస్టాటిల్ తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించడానికి కారణమైన పద్ధతి?
1) నిగమన
2) సంశ్లేషణ
3) ప్రాజెక్టు
4) సమస్యా పరిష్కారం
- View Answer
- సమాధానం: 1
31. ఇ ని సత్యమని రుజువు చేయడానికి B సత్యమని, B ఆధారంగా A సత్యమని రుజువు చేసే పద్ధతి?
1) నిగమన పద్ధతి
2) సంశ్లేషణ పద్ధతి
3) విశ్లేషణ పద్ధతి
4) ఆగమన పద్ధతి
- View Answer
- సమాధానం: 3
32.‘చతుర్భుజంలోని కోణాలు వరుసగా x°, (x+10)°, (x+30)°, 2x° అయితే ఆ కోణాలను కనుగొనండి’ అనే సమస్య సాధనకు అనువైన పద్ధతి?
1) ఆగమన పద్ధతి
2) నిగమన పద్ధతి
3) విశ్లేషణ పద్ధతి
4) సంశ్లేషణ పద్ధతి
- View Answer
- సమాధానం: 4
33. సాధారణీకరణం అనే స్పష్టీకరణ ఏ బోధనా పద్ధతిలో అంతర్భాగం?
1) విశ్లేషణ పద్ధతి
2) నిగమన పద్ధతి
3) ఆగమన పద్ధతి
4) సంశ్లేషణ పద్ధతి
- View Answer
- సమాధానం: 3
34.‘ఒక రోడ్డు రోలర్ వ్యాసార్ధం 1 మీటర్. దాని పొడవు 2 మీటర్లు అయితే ఒక చుట్టు తిరిగినప్పుడు చదును చేసే రోడ్డు వైశాల్యం ఎంత?’ ఈ సమస్య సాధనకు సమస్యా పరిష్కార పద్ధతిలో ఏ విధానం ఉపయుక్తమైనది?
1) చిత్రీకరణ
2) సాదృశ్యాల పద్ధతి
3) ఆధారతల పద్ధతి
4) విశ్లేషణ పద్ధతి
- View Answer
- సమాధానం: 2
35. ప్రాజెక్ట్ పద్ధతిలోని ఏ సోపానం థారన్‌డైక్ ఫలిత నియమానికి వర్తిస్తుంది?
1) మూల్యాంకనం
2) నివేదిక సమర్పణ
3) ప్రాజెక్టు వ్యూహరచన
4) అమలు పరచడం
- View Answer
- సమాధానం: 2
36. విద్యార్థుల అవగాహన, అంచనా సామర్థ్యం 5E నమూనాలోని ఏ దశలో ఉంటాయి?
1) విస్తరణ
2) మూల్యాంకనం
3) వివరణ
4) పాల్గొనడం
- View Answer
- సమాధానం: 2
37. గణిత సంఘం ఆవశ్యకతను పేర్కొన్నదెవరు?
1) NCERT
2) SCERT
3) DPEP
4) NPE - 1986
- View Answer
- సమాధానం: 4
38. గణితంలో నిత్యం వాడుకలో ఉండి ఎన్నో విషయాలు, తెలియని అంశాలపై అవగాహన కల్పించేది ఏది?
1) గణిత క్లబ్
2) గణిత ఫోరం
3) గణిత అసోసియేషన్స
4) గణిత ప్రదర్శన
- View Answer
- సమాధానం: 2
39. గణిత సంఘం కార్యక్రమాలన్నింటిలో పాఠశాల గణిత శక్తి, ఆసక్తి ఏమిటో నిర్దిష్టంగా వ్యక్తీకరించే సాధనంగా ప్రముఖంగా తోడ్పడేది?
1) గణిత గ్రంథాలయం
2) గణిత పత్రిక
3) గణిత ప్రదర్శనలు
4) గణిత ఫోరం
- View Answer
- సమాధానం: 3
40. హెర్బార్ట్ ప్రకారం పాఠ్యపథక సోపానాల్లో విద్యార్థి చేరుకునే క్లిష్టమైన దశ ఏది?
1) పునర్విమర్శ
2) సాధారణీకరణం
3) అన్వయం
4) సంసర్గం
- View Answer
- సమాధానం: 2
41. దశాంశ పద్ధతి మొదట భారతీయులు ఉపయోగించారు. అయితే ఈ పద్ధతి గురించి మొదట పేర్కొన్న గ్రంథం ఏది?
1) కాలక్రియ పదం
2) గోళపాదం
3) లీలావతి గణితం
4) సిద్ధాంత శిరోమణి
- View Answer
- సమాధానం: 3
42. ఒక గణిత బోధకుడు తరగతిలో C= 2πr అనే అంశం బోధిస్తూ ఒక పెద్ద తాడుతో నేలపై వృత్తాన్ని నిర్మించాడు. అయితే ఈ చర్య ఏ వ్యాసక్తిలోనిది?
1) వికాస
2) ప్రవేశ
3) అంత్యవ్యాసక్తి
4) 2, 3
- View Answer
- సమాధానం: 1
43. జతపరచండి.
జాబితా - I
i) గణిత పాదం
ii) కాలక్రియ పాదం
iii) గోళపాదం
iv) గీతికాపాదం
జాబితా - II
a) 10 శ్లోకాలు, భూమి భ్రమణం, పరిభ్రమణం
b) త్రిభుజం, త్రికోణమితి, సైన్ పట్టికలు, బీజ గణిత భావనలు, క్షేత్ర గణితం
c) 22 శ్లోకాలు, కాలమానం, గ్రహగతులు
d) 50 శ్లోకాలు, దక్షిణాయన అంశాలు, గ్రహాలు లెక్కించే పద్ధతులు
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 1
44.కింది వాటిలో యూక్లిడ్‌కు సంబంధించని అంశం ఏది?
ఎ) అలంగ్జాండ్రియన్ విశ్వవిద్యాలయంలో యూక్లిడ్ గణిత పాఠాలు బోధించేవాడు
బి) ఎలిమెంట్స్ అనే పేరుతో గ్రంథాన్ని రచించాడు. ఇది బైబిల్ తర్వాత స్థానంలో నిలిచింది
సి) ఎలిమెంట్స్ 17 భాగాలు ఉన్న గ్రంథం
డి) ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనేది ఇతని బిరుదు. డాటా అనే గ్రంథం కూడా రాశాడు
1) బి మాత్రమే
2) ఎ, సి మాత్రమే
3) సి, డి మాత్రమే
4) సి మాత్రమే
- View Answer
- సమాధానం: 4
45. ‘న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ’ అనేది ఎవరి బిరుదు?
1) భాస్కరాచార్య
2) ఆర్యభట్టు
3) అర్కిమెడిస్
4) యూక్లిడ్
- View Answer
- సమాధానం: 3
46. ‘రెండు బిందువుల ద్వారా ఒకే ఒక రేఖా ఖండాన్ని గీయవచ్చు’ అనే ప్రవచనం గణిత ఏ స్వభావాన్ని సూచిస్తుంది?
1) గణితం తార్కికమైంది
2) గణితం అంతర్బుద్ధితో ఏర్పడుతుంది
3) గణితం అమూర్త లక్షణం కలిగి ఉంటుంది
4) గణితం సహజమైన ఆలోచనా విధానం కలిగి ఉండటం
- View Answer
- సమాధానం: 2
47. కింది వాటిలో వైగోట్ స్కీ ZPDకి సంబంధం ఉన్న పద్ధతి ఏది?
1) ప్రయోగశాల
2) సహకార అభ్యసనం
3) సహయోగ అభ్యసనం
4) 5ఉ అభ్యసన నమూనా
- View Answer
- సమాధానం: 3
48. సి.సి.ఇ. ప్రకారం గణితంలో విద్యా ప్రమాణాల పరిధి వరుసగా ఇస్తున్న భారత్వానికి సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా - I
i) సమస్యల సాధన
ii) కారణాలు తెలపడం
iii) వ్యక్తపరచడం
iv) అనుసంధానం
v) ప్రాతినిధ్య పరచడం
జాబితా - II
a) 40%
b) 20%
c) 10%
d) 15%
e) 15%
1) i-a, ii-b, iii-c, iv-d, v-e
2) i-e, ii-d, iii-a, iv-b, v-c
3) i-c, ii-e, iii-d, iv-a, v-b
4) i-c, ii-e, iii-d, iv-b, v-a
- View Answer
- సమాధానం: 1
49. శ్రీ నివాస రామానుజన్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?
1) సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టాడు
2) ప్రధాన సంఖ్యలపై పరిశోధన చేశాడు
3) వృత్త పరిధికి, వ్యాసానికి మధ్య స్థిర నిష్పత్తి 3.1416 అని ప్రకటించాడు
4) గోల్డ్బాక్ కంజక్చర్ వివరణ కనుగొన్నాడు
- View Answer
- సమాధానం: 3
50. ‘ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానం గణితం’ అని నిర్వచించిన వారు?
1) బెల్
2) మేరియాపియర్
3) బెంజిమన్ పేర్స
4) బెర్త
- View Answer
- సమాధానం: 3