సప్త విధ కవుల్లో తిక్కన ఏ కోవకు చెందిన కవి?
1. ‘కవిర్మనీషీ పరిభూః స్వయం భూః’ అనే సూక్తి ఎందులో ఉంది?
1) రుగ్వేదం
2) సామవేదం
3) ఈశావాస్యో పనిషత్తు
4) మండూకోపనిషత్తు
- View Answer
- సమాధానం: 3
2. కవిశబ్దం మొదట ఏ అర్థంలో ప్రయోగించినట్లు తెలుస్తుంది?
1) సరస్వతి
2) పరమాత్మ
3) విష్ణు
4) గణపతి
- View Answer
- సమాధానం: 2
3. కవిశబ్దం బ్రహ్మకు పర్యాయపదంగా ఎందులో కనిపిస్తుంది?
1) వేదమంత్రాలు
2) ఉపనిషత్తులు
3) వ్యాసభారతం
4) సంస్కృత రామాయణం
- View Answer
- సమాధానం: 1
4. ‘కవయతీతి కవిః, తస్య కర్మమ్ కావ్యం’ అని చెప్పిన ఆలంకారికుడు ఎవరు?
1) భామహుడు
2) అభినవగుప్తుడు
3) విద్యాధరుడు
4) మమ్మటుడు
- View Answer
- సమాధానం: 3
5. కవి అంటే ద్రష్ట మాత్రమే కాదు కవికి అవశ్యకర్తవ్యం వర్ణన అని చెప్పిన ఆలంకారికుడు ఎవరు?
1) భామహుడు
2) భట్ట తౌతుడు
3) భరతుడు
4) భట్ట గోపాలుడు
- View Answer
- సమాధానం: 2
6. ‘శబ్దార్థౌ సహితౌ కావ్యం’ అని కావ్యాన్ని నిర్వచించిన ఆలంకారికుడు ఎవరు?
1) దండి
2) భరతుడు
3) భామహుడు
4) రుద్రటుడు
- View Answer
- సమాధానం: 3
7. ‘ఇతివృత్తంతు కావ్యస్య శరీరమ్ పరికీర్తితమ్’ అని చెప్పిన ఆలంకారికుడు ఎవరు?
1) భరతుడు
2) అభినవగుప్తుడు
3) దండి
4) మమ్మటుడు
- View Answer
- సమాధానం: 1
8. ‘లోకోత్తర వర్ణనా నిపుణుడైన కవికర్మమే కావ్యం’ అని చెప్పిన వారు ఎవరు?
1) భామహుడు
2) భరతుడు
3) మమ్మటుడు
4) రుద్రటుడు
- View Answer
- సమాధానం: 3
9. కిందివాటిని సరైన క్రమంలో జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. కావ్య ప్రకాశం 1. భరతుడు
బి. నాట్య శాస్త్రం 2. మమ్మటుడు
సి. ధ్వన్యాలోకం 3. కుంతకుడు
డి. వక్రోక్తి జీవితం 4. ఆనంద వర్ధనుడు
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3
- View Answer
- సమాధానం: 2
10.సప్త విధ కవులను పేర్కొన్న అలంకార శాస్త్ర గ్రంథం ఏది?
1) నాట్యశాస్త్రం
2) కామ్యప్రకాశం
3) అప్పకవీయం
4) ధ్వన్యాలోకం
- View Answer
- సమాధానం: 3
11. సప్తవిధకవుల్లో గుణ వర్ణ శబ్దార్థ గుణదోషనికరాన్ని పరిశీలించి కావ్యరచన చేసేవాడు?
1) రౌచికుడు
2) వివేకి
3) భుషణార్థి
4) వాచకుడు
- View Answer
- సమాధానం: 2
12. సప్త విధ కవుల్లో అలంకారాలు ప్రాధాన్యతతో కావ్యరచన చేసే కవి ఎవరు?
1) వివేకి
2)రౌచికుడు
3) భూషణార్థి
4) వాచికుడు
- View Answer
- సమాధానం: 3
13. ‘రసభావాలను విమర్శించేవాడు కవి-కవి కర్మమే కావ్యమ్’ అని చెప్పిన ఆలంకారికుడు?
1) భట్ట తౌతుడు
2) భట్టగోపాలుడు
3) భట్టలోల్లటుడు
4) విద్యాధరుడు
- View Answer
- సమాధానం: 2
14.సప్త విధ కవుల్లో తిక్కన ఏ కోవకు చెందిన కవి?
1) వాచకుడు
2) భూషణార్థ
3) ఆర్థికుడు
4) రౌచికుడు
- View Answer
- సమాధానం: 3
15. రీతిని కావ్యాత్మగా నిర్వచించిన ఆలంకారికుడు ఎవరు?
1) వామనుడు
2) దండి
3) అభినవ గుప్తుడు
4) మహిమభట్టు
- View Answer
- సమాధానం: 1
16. ‘కామ్యశరీరానికి ఆత్మధ్వని’ అని ప్రతి పాదించిన ఆలంకారికుడు ఎవరు?
1) రాజశేఖరుడు
2) ఆనందవర్ధనుడు
3) క్షేమేంద్రుడు
4) వామనుడు
- View Answer
- సమాధానం: 2
17.ఆనందవర్ధనుడి ధ్వని సిద్ధాంతాన్ని వ్యతిరేకించి వక్రోక్తియే కావ్య జీవితంగా పేర్కొన్న ఆలంకారకుడు ఎవరు?
1) రాజశేఖరుడు
2) కుంతకుడు
3) క్షేమేంద్రుడు
4) వామనుడు
- View Answer
- సమాధానం: 2
18.కిందివాటిని సరైన క్రమంలో జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. కావ్య మీమాంస 1. రాజశేఖరుడు
బి. ఔచితీవిచారచర్చ 2. విశ్వనాథుడు
సి. రసగంగాధరం 3. క్షేమేంద్రుడు
డి. సాహిత్యదర్పణం 4. జగన్నాథ పండితరాయలు
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-2, బి-1, సి-4, డి-3
- View Answer
- సమాధానం: 3
19. ‘ఇష్టార్థవ్యవచ్ఛిన్న పదావళీ కావ్యమ్’ అని చెప్పిన ఆలంకారకుడు ఎవరు?
1) మమ్మటుడు
2) దండి
3) భామహుడ
4) ధనంజయుడు
- View Answer
- సమాధానం: 2
20. ధ్వన్యాలోకానికి ఖండనగా‘వ్యక్తివివేకం’ అనే గ్రంథాన్ని రాసిన ఆలంకారకుడు?
1) అభినవగుప్తుడు
2) మహిమ భట్టు
3) విద్యాధరుడు
4) విశ్వనాథుడు
- View Answer
- సమాధానం: 2
21. ‘ధ్వన్యాలోకం గ్రంథానికి’ లోచనం అనే వ్యాఖ్యానం రాసిన రచయిత ఎవరు?
1) వానండు
2) అభినవగుప్తుడు
3) దండి
4) మమ్మటుడు
- View Answer
- సమాధానం: 2
22. ‘గుణాలంకార యుక్తశబ్దార్థేకావ్యం’ అని నిర్వచించింది ఎవరు?
1) దండి
2) విశ్వనాథుడు
3) వామనడు
3) రాజశేఖరుడు
- View Answer
- సమాధానం: 3
23. కింది వాటిని సరైన పద్ధతిలో జతపరచండి.
జాబితా-1
ఎ. దశరూపక కర్త
బి. కావ్యాలంకార సంగ్రహం
సి. సరస్వతీ కంఠాభరణం
డి. కువలయానందం
జాబితా-2
1. వామనుడు
2. ధనంజయుడు
3. అప్పయ్య దీక్షితులు
4. భోజుడు
1) ఎ-3, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-1, బి-4, సి-3, డి-2
- View Answer
- సమాధానం: 3
24. ‘రమణీయార్థ ప్రతిపాదకశబ్దంః కావ్యమే’అని నిర్వచించిన వారు ఎవరు?
1) ధనంజయుడు
2) దండి
3) జగన్నాథ పండిత రాయలు
4) పీయూషవర్ధనుడు
- View Answer
- సమాధానం: 3
25.‘వాక్యం రసాత్మకం కావ్యమ్’ అని చెప్పిన వారు ఎవరు?
1) విశ్వనాథుడు
2) భరతుడు
3) మమ్మటుడు
4) దండి
- View Answer
- సమాధానం: 1
26. ‘రసమంజరి’ అనే అలంకార శాస్త్ర గ్రంథకర్త ఎవరు?
1) వాగ్భటుడు
2) భాను దత్తుడు
3) హేమచంద్రుడు
4) అభినవగుప్తుడు
- View Answer
- సమాధానం: 2
27. వీటిలో సరి కాని జత ఏది?
1) అలంకారశేఖరం-కేశవమిత్రుడు
2) హృదయదర్పణం-భట్టనాయకుడు
3) కువలయానందం-అప్పయ్య దీక్షితులు
4) అలంకార సర్వస్వం-రూపగోస్వామి
- View Answer
- సమాధానం: 4
28. ‘హృదయదర్పణం’ అనే అలంకార శాస్త్ర గ్రంథ రచయిత ఎవరు?
1) భానుదత్తుడు
2) భట్టనాయకుడు
3) వాగ్భటుడు
4) రుద్రుడు
- View Answer
- సమాధానం: 2
29. ‘రసాలంకారయుక్తం సుఖవిశేష సాధనం వాక్యమ్’ అని చెప్పినవారు?
1) శౌద్ధోదని
2) అప్పయ్య దీక్షితులు
3) కేశవ మిత్రుడు
4) అభినవగుప్తుడు
- View Answer
- సమాధానం: 3
30. ‘విశ్వశ్రేయఃకావ్యమ్’ అని చెప్పిన వారు?
1) ధనంజయుడు
2) నన్నయ
3) అనంతుడు
4) రామరాజ భూషణుడు
- View Answer
- సమాధానం: 2
31. తిక్కన దృష్టిలో కావ్యప్రయోజనం ఏమిటి?
1) ఉపదేశం
2) నీతి బోధ
3) ఆనందం
4) ప్రీతి
- View Answer
- సమాధానం: 3
32. "poetry is the spontaneous overflow of powerful feelings' తీవ్ర అనుభూతుల స్వచ్ఛంద విజృంభణమే కవిత్వం అని చెప్పిన పాశ్చాత్య విమర్శకుడు ఎవరు?
1) షెల్లీ
2) కార్ణయిల్
3) వర్‌డ్సవర్‌త
4) జె.ఎస్.మిల్
- View Answer
- సమాధానం: 3
33."poetry we will call musical thought’(సంగీతాత్మకమైన లయబద్ధమైన ఆలోచనే కవిత్వం) అని నిర్వచించిన పాశ్చాత్య విమర్శకుడు ఎవరు?
1) కార్ణయిల్
2) హాజ్లిట్
3) ఇ.ఎ.పో
4) జె.ఎస్.మిల్
- View Answer
- సమాధానం: 1
34. "In general sence may be defined as the expression of the imagination’ (ఊహాశక్తి ప్రకటనమే కవిత్వమని సాధారణ పాఠకుల అభిప్రాయం)అని చెప్పిన పాశ్చాత్య విమర్శకుడు ఎవరు?
1) రస్కిన్
2) షెల్లీ
3) ఆర్నాల్డ్
4) మిల్టన్
- View Answer
- సమాధానం: 2
35."Poetry is rhythmic creation of beauty'(లయబద్ధ్దమైన సౌందర్య సృష్టియే కవిత్వం) అని నిర్వచించిన పాశ్చాత్య విమర్శకుడు ఎవరు?
1) హజ్లిట్
2) షెల్లీ
3) ఇ.ఎ.పో
4) కార్ణయిల్
- View Answer
- సమాధానం: 3
36. "poetry is the anti thesis of science having for its immediate object is pleasure, but not truth’(‘కవిత్వం విజ్ఞాన శాస్త్ర విరుద్ధమైంది. దాని సత్వర ప్రయోజనం ఆహ్లాదమే కాని సత్యం కాదు’ అని నిర్వచించిన పాశ్చాత్య విమర్శకుడు ఎవరు?
1) అరిస్టాటిల్
2) ప్లేటో
3) కాల్రిడ్జి
4) జె.ఎస్.మిల్
- View Answer
- సమాధానం: 3
37. "Poetry is the metrical composition. It is the art of uniting pleasure with truth calling-forth imagination to the help of reason and its essence is invention' (ఛందో బద్ధమైన రచనే కవిత్వం. హేతువాదానికి భావనా శక్తిని జోడించి సత్యాన్ని ఆనందాన్ని సమ్మిళితం చేయగల కళ కవిత్వం) అని చెప్పిన పాశ్చాత్య విమర్శకుడు ఎవరు?
1) లైహంట్
2) షెల్లీ
3) కాల్రిడ్జ
4) జాన్సన్
- View Answer
- సమాధానం: 4
38. కళలన్నీ ప్రకృతి అనుకరణమని చెప్పిన విమర్శకుడు ఎవరు?
1) పిలిఫ్ సిడ్నీ
2) అరిస్టాటిల్
3) ప్లేటో
4) వర్‌డ్సవర్‌త
- View Answer
- సమాధానం: 2
39. ఆనందమే కావ్య పరమ ప్రయోజనమని చెప్పిన ఆలంకారకుడు ఎవరు?
1) భామహుడు
2) మమ్మటుడు
3) అభినవ గుప్తుడు
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
40. ‘శక్తి, వ్యుత్పత్తి, అభ్యాసం’ అనే మూడింటిని కవిత్వ హేతువులుగా పేర్కొన్న అలంకారకుడు?
1) దండి
2) రుద్రటుడు
3) భామహుడు
4) భరతుడు
- View Answer
- సమాధానం: 2
41. హేమచంద్రుడు చెప్పిన కావ్య ప్రయోజనాలు ఏవి?
1) ఆనందం
2) కీర్తి
3) ఉపదేశం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
42.సాహితీ వ్రతుడు కానివాడు వ్యాసుడుకానిమ్ము, గౌతముడు కానిమ్ము, పతంజలికానిమ్ము, వానికి నా శిరస్సు తిరస్కారముగాని, పురస్కారముగాని చూపక ఉదాసీనతనే ప్రకటిస్తుందని చెప్పిన ఆలంకారకుడు ఎవరు?
1) దండి
2) విశ్వనాథుడు
3) జగన్నాథ పండితరాయలు
4) మమ్మటుడు
- View Answer
- సమాధానం: 3
43. కిందివాటిని సరైన రీతిలో జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. కథనాత్మక శైలి 1. తిక్కన
బి. నాటకీయ శైలి 2. నన్నయ
సి. వర్ణనాత్మక శైలి 3. తెనాలి రామకృష్ణ
డి. పదగుంఫన శైలి 4. ఎర్రన
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-1, డి-2
- View Answer
- సమాధానం: 3
44. కళలన్నీ నీతి బాహ్యాలని పేర్కొన్న విమర్శకుడు ఎవరు?
1) బ్లేక్
2)ఆస్కార్‌వైల్డ్
3) జె.ఎస్.మిల్
4) డ్రెడైన్
- View Answer
- సమాధానం: 2
45.చతుర్వర్గ ప్రాప్తి, కీర్తి, ఆనందాలను కావ్య ప్రయోజనాలుగా చెప్పిన ఆలంకారకుడు ?
1) భరతుడు
2) దండి
3) భామహుడు
4) విశ్వనాథుడు
- View Answer
- సమాధానం: 3
46. కవిత్వ ప్రయోజనాల్లో ఆనంద సందేశాలు రెండూ ముఖ్యమని భావించిన పాశ్చాత్య విమర్శకుడు ఎవరు?
1) డ్రెడైన్
2) బ్లేక్
3) ఎడ్గార్ ఎలెన్పో
4) ఫిలిప్ సిడ్నీ
- View Answer
- సమాధానం: 4
47. ‘ప్రతి భావ్యుత్పత్త్యోః ప్రతిభాగరీమసి’ అని చెప్పిన ఆలంకారకుడు ఎవరు?
1) ఆనందవర్ధనుడు
2) భరతుడు
3) రుద్రటుడు
4) భామహుడు
- View Answer
- సమాధానం: 1
48.లలిత కళలకు పర్యాయపదాలు ఏవి?
1) సరసకళలు
2) విలాసకళలు
3) హృదయకళలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
49. ‘ఏ ప్రవీణులు గల్గ నిలనలం కృతకృతో ద్వములకు దోషలక్ష్యములు గల్గి అన్న వాక్యంలో కవి చేస్తున్నది ఏమిటి?
1) సుకనిస్తుతి
2) కుకవినిరద
3) రాజస్తుతి
4) సహృదయస్తుతి
- View Answer
- సమాధానం: 2
50. ‘ప్రజ్ఞానవనవోన్మేష శాలినీ ప్రతిభామతా’ అని నిర్వచించిన ఆలంకారికుడు ఎవరు?
1) దండి
2) మమ్మటుడు
3) భామహుడు
4) జగన్నాథుడు
- View Answer
- సమాధానం: 3
51. కుంతకుడు ప్రతిపాదించిన కావ్యలక్షణం ఏమిటి?
1) వ్యుత్పత్తి
2) సమర్థత
3) జయోక్తి
4) వక్రోక్తి
- View Answer
- సమాధానం: 4
52. కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అన్నవారు ఎవరు?
1) సి.ఆర్. రెడ్డి
2) సి.నారాయణ రెడ్డి
3) జి.వి.సుబ్రహ్మాణ్యం
4) పింగళి లక్ష్మీకాంతం
- View Answer
- సమాధానం: 2
53. కవి ప్రతిభలోన నుండ కావ్యగతశ తాంశమునందు తొంబది పాళ్లు అని చెప్పిన ఆధునిక కవి ఎవరు?
1) పింగళి లక్ష్మీకాంతం
2) పుట్టపర్తి
3) విశ్వనాథ సత్యనారాయణ
4) చెళ్ల పిళ్ల వెంకట శాస్త్రి
- View Answer
- సమాధానం: 3