తెలుగులో రామాయణం రాసిన తొలి కవయిత్రి?
1. స్వాతంత్య్రపు జెండా గేయ రచయిత ఎవరు?
1) వేదుల సత్యనారాయణ శాస్త్రి
2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
3) గరిమెళ్ల సత్యనారాయణ
4) శంకరంబాడి సుందరాచార్య
- View Answer
- సమాధానం: 2
2. ‘ఆంధ్రా షెల్లీ’, ‘ఆంధ్రా కీట్స్’ అనే బిరుదులున్న ఆధునిక కవి?
1) శ్రీశ్రీ
2) రాయప్రోలు సుబ్బారావు
3) దేవులపల్లి కృష్ణ శాస్త్రి
4) డాక్టర్ సి. నారాయణ రెడ్డి
- View Answer
- సమాధానం: 3
3. కింది వాటిలో కృష్ణశాస్త్రి రచన కానిది ఏది?
1) కృష్ణపక్షం
2) ఊర్వశి
3) విప్రనారాయణ
4) లలిత
- View Answer
- సమాధానం: 4
4. సుమతీ శతకకర్త ఎవరు?
1) సోమన
2) మారన
3) బద్దెన
4) మంచెన
- View Answer
- సమాధానం: 3
5. ‘కవిబ్రహ్మ’, ‘ఉభయ కవి మిత్రుడు’ అనే బిరుదులున్న కవి ఎవరు?
1) నన్నయ
2) తిక్కన
3) ఎర్రన
4) పోతన
- View Answer
- సమాధానం: 2
6. మహాభారత రచనలో నాటకీయతకు ప్రాధాన్యమిచ్చిన కవి?
1) నన్నయ
2) ఎర్రన
3) తిక్కన
4) నారాయణభట్టు
- View Answer
- సమాధానం: 3
7. సుమతీ శతక పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయి?
1) తేటగీతి
2) కందం
3) ఆటవెలది
4) చంపకమాల
- View Answer
- సమాధానం: 2
8. ‘కమలాసనుడు’ అనే బిరుదున్న శతక రచయిత?
1) వేమన
2) బద్దెన
3) పాల్కురికి సోమన
4) కరుణశ్రీ
- View Answer
- సమాధానం: 2
9. జతపరచండి.
శతకం:
a) కుమార శతకం
b) భాస్కర శతకం
c) దాశరధి శతకం
d) శ్రీకాళహస్తీ శతకం
రచయిత:
i) మారద వెంకయ్య
ii) ఫక్కి అప్పల నరసయ్య
iii) ధూర్జటి
iv) కంచర్ల గోపన్న
1) a-iii, b-i, c-ii, d-iv
2) a-i, b-ii, c-iv, d-iii
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-iv, b-iii, c-i, d-ii
- View Answer
- సమాధానం: 3
10. భాస్కర శతకంలో ఉన్న ఛందస్సు?
1) చంపకమాల
2) ఉత్పలమాల
3) మత్తేభం
4) చంపకోత్పలమాలలు
- View Answer
- సమాధానం: 4
11. ‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ పాఠ్యభాగ రచయిత?
1) కరుణ శ్రీ
2) రాయప్రోలు సుబ్బారావు
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) వానమామలై వరదాచార్యులు
- View Answer
- సమాధానం: 2
12. ‘భావ కవితా పితామహుడు’ అనే బిరుదున్న కవి?
1) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
3) రాయప్రోలు సుబ్బారావు
4) తల్లావజ్జల శివ శంకర శాస్త్రి
- View Answer
- సమాధానం: 3
13. ‘జారిన గుండె’ పాఠ్యభాగ రచయిత?
1) శాంతి నారాయణ
2) మధురాంతకం రాజారాం
3) మధురాంతకం నరేంద్ర
4) మధురాంతకం మహేంద్ర
- View Answer
- సమాధానం: 2
14. ‘బాలల్లార! వినరండి. ఏమవుతుందో చెప్పండి’ పాఠ్యభాగం నాళం కృష్ణారావు రచించిన ఏ గ్రంథంలోనిది?
1) మీగడతరగలు
2) వెన్న బుడగలు
3) గోరుముద్దలు
4) గుజ్జనగూళ్లు
- View Answer
- సమాధానం: 3
15. జతపరచండి.
శతకం:
a) తెలుగు పూల శతకం
b) నార్ల వారి మాట శతకం
c) సుభాషిత రత్నావళి
d) నరసింహ శతకం
రచయిత:
i) నార్ల వెంకటేశ్వరరావు
ii) నార్ల చిరంజీవి
iii) శేషప్ప కవి
iv) ఏనుగు లక్ష్మణ కవి
1) a-iii, b-ii, c-iv, d-i
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 2
16. ‘మ్రోగిన గంటలు’ పాఠ్యభాగ రచయిత?
1) దేవులపల్లి కృష్ణశాస్త్రి
2) ఆరుద్ర
3) జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి
4) కరుణశ్రీ
- View Answer
- సమాధానం: 4
17. కరుణశ్రీ అసలు పేరు?
1) జంధ్యాల శంకరశాస్త్రి
2) జంధ్యాల జయకృష్ణశాస్త్రి
3) జంధ్యాల పాపయ్యశాస్త్రి
4) జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రి
- View Answer
- సమాధానం: 3
18. ‘మ్రోగిన గంటలు’ పాఠ్యభాగాన్ని కరుణశ్రీ రచించిన ఏ గ్రంథం నుంచి గ్రహించారు?
1) విజయశ్రీ
2) కరుణశ్రీ
3) ఉదయశ్రీ
4) తెలుగు బాల శతకం
- View Answer
- సమాధానం: 3
19. ‘మ్రోగిన గంటలు’ పాఠ్యభాగంలో ఇతివృత్తం?
1) దేశభక్తి
2) మానవతావిలువలు
3) సామాజిక స్పృహ
4) నైతిక వాలువలు
- View Answer
- సమాధానం: 2
20. చెడ్డవాడితో స్నేహం ఎలాంటిదని ఆరుద్ర వర్ణించాడు?
1) గుండెలో శూలం
2) కడుపులో గాలం
3) గొంతులో శల్యం
4) 1, 3
- View Answer
- సమాధానం: 4
21. బ్రెయిలీ లిపిలో ఆత్మకథ రాసుకున్నవారు?
1) హెలెన్ కెల్లర్
2) లూయీ బ్రెయిల్
3) సలీవన్
4) సుధాచంద్రన్
- View Answer
- సమాధానం: 1
22.‘ప్రకృతి-పర్యావరణం’ ఇతివృత్తంగా ఉన్న పాఠం?
1) మ్రోగిన గంటలు
2) కుసుమోపదేశం
3) జారిన గుండె
4) కళ్లుండీ చూడలేక
- View Answer
- సమాధానం: 2
23. ‘కుసుమోపదేశం’ పాఠ్యభాగ రచయిత?
1) కరుణశ్రీ
2) ఆరుద్ర
3) వానమామలై వరదాచార్యులు
4) ఉషశ్రీ
- View Answer
- సమాధానం: 3
24. వానమామలై వరదాచార్యుల ‘పోతన చరిత్రం, రైతుబిడ్డ’ వరుసగా ఏ ప్రక్రియలకు చెందినవి?
1) గేయ కావ్యం-పద్య కావ్యం
2) పద్య కావ్యం-బుర్రకథ
3) వచన కావ్యం-బుర్రకథ
4) పద్య కావ్యం-హరికథ
- View Answer
- సమాధానం: 2
25. జాషువా ‘శిల్పి’ పాఠ్యభాగం ఖండకావ్యం ఏ భాగం నుంచి గ్రహించారు?
1) రెండో భాగం
2) ఐదో భాగం
3) మొదటి భాగం
4) మూడో భాగం
- View Answer
- సమాధానం: 3
26. జాషువాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన గ్రంథం?
1) గబ్బిలం
2) ఫిరదౌసి
3) కొత్తలోకం
4) క్రీస్తుచరిత్ర
- View Answer
- సమాధానం: 4
27. తెలుగులో రామాయణం రాసిన తొలి కవయిత్రి?
1) మొల్ల
2) ముద్దుపళని
3) రంగాజమ్మ
4) తాళ్లపాక తిమ్మక్క
- View Answer
- సమాధానం: 1
28. ‘తేనె సోక నోరు తీయనగురీతి గూఢ అర్థమెల్ల కూర్చకుండ’ అనే వాక్యాలు ఏ గ్రంథంలోనివి?
1) భాస్కర రామాయణం
2) నిర్వచనోత్తర రామాయణం
3) మొల్ల రామయణం
4) రంగనాథ రామాయణం
- View Answer
- సమాధానం: 3
29. జతపరచండి.
శతక పంక్తులు:
a) ‘కలిమి గల లోభికన్నను/విలసితముగ పేదమేలు వితరణమైనన్’
b) ‘కూరిమిగల దినములలో నేరములెన్నడు గలుగనేరవుమరియా’
c) ‘పత్రికొకటియున్న పదివేల సైన్యము పత్రికొక్కటున్న మిత్రకోటి’
d) ‘చదువు జీర్ణమైన స్వాంతంబుపండును తిండి జీర్ణమైన నిండు బలము’
శతకం:
i) సుమతీ శతకం
ii) గువ్వల చెన్న శతకం
iii) మిత్ర సాహస్రి శతకం
iv) నార్లవారి మాట శతకం
1) a-iii, b-ii, c-i, d-iv
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-ii, b-iii, c-i, d-iv
4) a-iv, b-iii, c-i, d-ii
- View Answer
- సమాధానం: 2
30. ‘మధువనం’ పాఠ్యభాగం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది?
1) భాస్కర రామాయణం-అరణ్యకాండ
2) రంగనాథ రామాయణం-కిష్కింధకాండ
3) మొల్ల రామాయణం-సుందరకాండ
4) మొల్ల రామాయణం-అయోధ్యకాండ
- View Answer
- సమాధానం: 3
31. ‘పరుల తెగుడుటల వల్ల/బలిమి పొగుడుట వల్ల/కీర్తివచ్చుటకల్ల’ అనే కూనలమ్మ పదాలు తెలుపే విలువలు?
1) దేశభక్తి విలువలు
2) సంస్కృతి విలువలు
3) నైతిక విలువలు
4) సృజనాత్మక విలువలు
- View Answer
- సమాధానం: 3
32. ‘ప్రకృతి ఒడి’లో అనే తాత్త్విక వ్యాసం పాఠం రచించింది?
1) ఎస్.టి. జ్ఞానానాంద కవి
2) సి. నారాయణరెడ్డి
3) నార్ల వెంకటేశ్వరరావు
4) కొడవటిగంటి కుటుంబరావు
- View Answer
- సమాధానం: 4
33. జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది?
1) ప్రబంధం
2) నాటకం
3) బుర్రకథ
4) గేయం
- View Answer
- సమాధానం: 3
34. ‘సమైక్య భారతి’ అనే కవితా సంకలనంలో ‘పరమతపోనివేశనము బంగరు పంటలకున్న వాసమబ్బురమగుశాంతి చంద్రికల భూమి’ అని భరతమాతను స్తుతించినవారు?
1) జాషువా
2) జ్ఞానానంద కవి
3) రాయప్రోలు
4) కృష్ణశాస్త్రి
- View Answer
- సమాధానం: 2
35. ‘నీరు మనకు అందకుండా/నదులే ప్రవహించకుంటే ఎలా ఉంటుందో చెప్పండి?’ ఈ గేయ పంక్తులున్న పాఠం?
1) గోరుముద్దలు
2) ఏమవుతుందో
3) పారిపోయిన గిన్నెలు
4) తొలకరి చిరుజల్లులు
36. ‘శ్రమైక్య జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడేవారి పట్ల గౌరవం కనపరచడం’ అనే లక్ష్యం గల పాఠం?
1) జీవన భాష్యం
2) ప్రతిజ్ఞ
3) హరిశ్చంద్రుడు
4) ఆలోచన
- View Answer
- సమాధానం: 2
37. ‘బాల్యక్రీడలు’ పాఠం ఆంధ్ర మహాభాగవతంలో ఏ స్కంధం నుంచి గ్రహించబడింది?
1) అష్టమ
2) నవమ
3) దశమ
4) ఏకాదశ
- View Answer
- సమాధానం: 3
38. ‘మధువనానికి’ యజమాని ఎవరు?
1) సుగ్రీవుడు
2) దధిముఖుడు
3) వాలి
4) హనుమంతుడు
- View Answer
- సమాధానం: 1
39. మధురాంతకం రాజారాం రచన ఏది?
1) ఇక్కడ మేమంతా క్షామం
2) ఇక్కడ మేమంతా క్షేమం
3) కమ్మని తెమ్మరలు వీస్తున్నాయి
4) రేపటి ప్రపంచంలో సమస్యలు
- View Answer
- సమాధానం: 1
40. ‘ప్రకటన’ పాఠం యొక్క ఇతివృత్తం?
1) దేశభక్తి
2) నైతిక విలువలు
3) సామాజిక విలువలు
4) శాంతి
- View Answer
- సమాధానం: 4
41. ‘మేము సైతం’ పాఠం యొక్క ప్రక్రియ?
1) లేఖ
2) కరపత్రం
3) పోస్టర్
4) వ్యాసం
- View Answer
- సమాధానం: 1
42.కింది వాటిలో ‘నరకంలో హరిశ్చంద్రుడు’ నాటక రచయిత ఎవరు?
1) గౌరన
2) సి. నారాయణ రెడ్డి
3) నార్ల చిరంజీవి
4) నార్ల వెంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: 4
43. ‘స్వాతంత్య్రపు జెండా’ గేయం ఏ ఇతివృత్తానికి చెందింది?
1) త్యాగబుద్ధి
2) దేశభక్తి
3) నైతిక విలువలు
4) భాషాభిరుచి
- View Answer
- సమాధానం: 2
44. మహాభారతంలో తిక్కన తెనిగించిన పర్వాలు?
1) ఆది, సభా పర్వాలు
2) ఆది పర్వం నుంచి అరణ్య పర్వం శేషం వరకు
3) ఆది, అరణ్య పర్వ శేషాలు
4) విరాట పర్వం నుంచి స్వర్గావరోహణ పర్వం వరకు
- View Answer
- సమాధానం: 4
45.‘స్నేహ బంధం’లో ఉన్న ప్రాణి దాని పేరు?
1) పావురం-మంథరుడు
2) ఏనుగు-హిరణ్యకుడు
3) కాకి-లఘు పతనకుడు
4) నక్క-చూడాకర్ణుడు
- View Answer
- సమాధానం: 3
46. తను సందర్శించిన అజంతా చిత్రాలను యాత్రా రచనగా రచించిన రచయిత?
1) నార్ల చిరంజీవి
2) శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
3) నండూరి సుబ్బారావు
4) నార్ల వెంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: 4
47. ‘మీ సత్కారం, అన్నదానం నాకు తృప్తిని కలిగించాయి’. ఈ వాక్యంలో ఉన్న విలువలు?
1) అతిథి మర్యాద
2) ఆనందం
3) ఆలోచన
4) వేడుక
- View Answer
- సమాధానం: 1
48. ‘మీ సత్కారం, అన్నదానం నాకు తృప్తిని కలిగించాయి’. ఈ వాక్యంలో ఉన్న విలువలు?
1) అతిథి మర్యాద
2) ఆనందం
3) ఆలోచన
4) వేడుక
- View Answer
- సమాధానం: 3
49. కింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదాన్ని గుర్తించండి?
1) ఆవు
2) కాగితం
3) యామం
4) అరక
- View Answer
- సమాధానం: 4
50. ‘పాడు కరువులకు బాణాలు మా/పంటచేలకివి ప్రాణాలు’ ఈ గేయం వేటిని ఉద్దేశించబడింది?
1) మయూరాలు
2) చిలుకలు
3) వర్షాలు
4) సీతాకోకచిలుకలు
- View Answer
- సమాధానం: 3
51. ‘ఇది ఇలా జరిగింది’ అని చెప్పే సాహిత్య ప్రక్రియ?
1) పురాణం
2) శతకం
3) ఇతిహాసం
4) ప్రబంధం
- View Answer
- సమాధానం: 3
52. తెలుగు కవయిత్రుల్లో మొదటగా రామాయణం రాసింది?
1) తాళ్లపాక తిమ్మక్క
2) ఆతుకూరి మొల్ల
3) ముద్దుపళని
4) పసుపులేటి రంగాజమ్మ
- View Answer
- సమాధానం: 2
53. ‘కష్టజీవులకు కర్మవీరులకు/నిత్మమంగళం నిర్దేశిస్తూ/ స్వస్తి వాక్యములు సంధానిస్తూ/స్వర్ణ వాద్యములు సంరావిస్తూ/జగత్తుకంతా చవులిస్తానోయ్’ ఈ గేయ పంక్తులున్న పుస్తకం?
1) మహాప్రస్థానం
2) మరోప్రస్థానం
3) ఖడ్గసృష్టి
4) కార్టూన్ కవితలు
- View Answer
- సమాధానం: 1
54. సుభాషిత రత్నావళి రచించిన కవి?
1) భర్తృహరి
2) ఫక్కి అప్పలసరసయ్య
3) ఏనుగు లక్ష్మణకవి
4) మారద వెంకయ్య
- View Answer
- సమాధానం: 3
55. ‘చిలుక సందేశం’ అనే పాఠం ఏ ప్రక్రియ?
1) లేఖ
2) వ్యాసం
3) గేయ రూపంలో నాటిక
4) హరికథ
- View Answer
- సమాధానం: 3