అర్థ విపరిణామం- ధ్వని విపరిణామం
1. అర్థవిపరిణామానికి సంబంధించి ‘ఎ స్టడీ ఆఫ్ తెలుగు సెమెంటిక్స్’ అనే సిద్ధాంత గ్రంథాన్ని తొలిసారిగా రాసిన భాషావేత్త?
1) భద్రిరాజు కృష్ణమూర్తి
2) జి.ఎన్. రెడ్డి
3) బూదరాజు రాధాకృష్ణ
4) దొణప్ప
- View Answer
- సమాధానం: 2
2. పదజాలానికి సంబంధించి అర్థంలో కలిగే మార్పును అర్థవిపరిణామంగా పేర్కొన్న భాషావేత్త?
1) మైఖేల్ బ్రెయిల్
2) ఎల్.చక్రధరరావు
3) జి.ఎన్. రెడ్డి
4) టి.అక్కిరెడ్డి
- View Answer
- సమాధానం: 3
3.అర్థపరిణామానికి సంబంధించిన ప్రధాన కారణాలు?
1) నాగరికతలో మార్పులు
2) పరిసరాల మార్పు - భావాభి వ్యక్తిలో మార్పు
3) పర్యాయపదాల వల్ల అర్థాల్లో వచ్చే మార్పు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
4. ప్రపంచ భాషల్లో తొలిసారిగా 1897లో అర్థవిపరిణామానికి సంబంధించి ‘లాసెమాంటిక్’ అనే గ్రంథాన్ని రాసిన భాషావేత్త?
1) సి.పి. బ్రౌన్
2) మైఖేల్ బ్రెయిల్
3) కాల్డ్వెల్
4) మెకంజీ
- View Answer
- సమాధానం: 2
5. ఒక పదం గతకాలంలో విస్త్రృతార్థంలో ఉండి తర్వాత పరిమితార్థంలో ఉండే పరిణామాన్ని ఏమంటారు?
1) అర్థోన్నతి
2) అర్థాపకర్ష
3) అర్థసంకోచం
4) లక్ష్యార్థసిద్ధి
- View Answer
- సమాధానం: 3
6. ఒక పదం పాత కాలంలో కంటే తర్వాత కాలంలో విస్త్రృతార్థంలో ఉపయోగించే పరిణామాన్ని ఏమంటారు?
1) అర్థసంకోచం
2) అర్థవ్యాకోచం
3) అర్థోత్కర్ష
4) అర్థన్యూనత
- View Answer
- సమాధానం: 2
7. ఒక పదం గతకాలంలో నిందార్థంలో ఉండి, తర్వాత కాలంలో అర్థ ప్రశస్తితో పరిణామం చెందడాన్ని ఏమంటారు?
1) అర్థోత్కర్ష
2) అర్థోన్నతి
3) అర్థ గౌరవం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
8. కొన్ని పదాలు గతంలో ఉన్న సామాన్యార్థాన్ని కోల్పోయి నిందార్థంలో, పరిహాసార్థంలో పరిణామం చెందడాన్ని ఏమంటారు?
1) అర్థాపకర్ష
2) అర్థన్యూనత
3) అర్థలాఘవం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
9. ఇతరుల మనసులు నొప్పించకుండా, అశుభాలను, అశ్లీలాలను గౌరవ సూచ కంగా కొత్త పదబంధాలతో వ్యక్తీకరించే పరిణామాన్ని ఏమంటారు?
1) మృదూక్తి
2) సభ్యోక్తి
3) సౌకుమారోక్తి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
10. అర్థవ్యాకోచానికి ఉదాహరణ?
1) చీర-వస్తాదు
2) చెంబు-నూనె
3) సభికులు-ఛాందసుడు
4) సూది-మర్యాద
- View Answer
- సమాధానం: 2
11. కింది వాటిలో అర్థసంకోచం జరిగిన పదాలు?
1) సీసా-నూనె-ముష్టి
2) ఆరాధ్యుడు-సీసా-పత్రం
3) చందమామ-వస్తాదు-కోక
4) ఛాందసుడు-పత్రం-కైంకర్యం
- View Answer
- సమాధానం: 3
12. దివంగతులగు, పరమపదించు, శివైక్యం చెందు పదాల్లో జరిగిన అర్థపరిణామం?
1) అర్థగౌరవం
2) సభ్యోక్తి
3) అర్థసంకోచం
4) అర్థాపకర్ష
- View Answer
- సమాధానం: 2
13. కింది వాటిలో ‘అర్థాపకర్ష’ జరిగిన పదాలు?
1) ఛాందసుడు
2) సన్యాసి
3) కళావంతులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14. కింది వాటిలో అర్థోత్కర్ష జరిగిన పదం?
1) సభికులు
2) వైతాళికులు
3) ముహుర్తం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
15.వ్యవసాయం, కర్మ, మృగం వంటి పదాల్లో జరిగిన అర్థపరిణామం?
1) అర్థవ్యాకోచం
2) అర్థసంకోచం
3) అర్థన్యూనత
4) అర్థోన్నతి
- View Answer
- సమాధానం: 2
16.కులాల విషయంలో రజకులు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు వంటి పదాల్లో జరిగిన అర్థపరిణామాన్ని ఏమంటారు?
1) అర్థవ్యాకోచం
2) అర్థోన్నతి
3) సభ్యోక్తి
4) అర్థాపకర్ష
- View Answer
- సమాధానం: 3
17. ‘దీపం కొండెక్కింది’, ‘సూత్రం పెరిగిపోయింది’ అనే పదబంధాలు ఏ అర్థపరిణామాన్ని సూచిస్తున్నాయి?
1) లక్ష్యార్థసిద్ధి
2) సభ్యోక్తి
3) సౌమ్యోక్తి
4) అర్థోన్నతి
- View Answer
- సమాధానం: 3
18. నన్నయ కాలంలో ‘కంపు’ అనే పదం ‘సువాసన’ అనే అర్థంలో ఉంది. నేటి కాలంలో ‘కంపు’ పదంలో జరిగిన అర్థపరిణామం?
1) అర్థాపకర్ష
2) అర్థగౌరవం
3) అర్థవ్యాకోచం
4) లక్ష్యార్థసిద్ధి
- View Answer
- సమాధానం: 1
19. ‘భిక్ష, దాహం, సూది’ అనే పదాల్లో జరిగిన అర్థపరిణామం?
1) అర్థవ్యాకోచం
2) అర్థన్యూనత
3) లక్ష్యార్థసిద్ధి
4) అర్థసంకోచం
- View Answer
- సమాధానం: 3
20. ఆమె రంభ, అతడు మన్మథుడు వంటి పదాలు సూచించే అర్థపరిణామం?
1) సభ్యోక్తి
2) అలంకారిక ప్రయోగం
3) సౌమ్యోక్తి
4) అర్థోత్కర్ష
- View Answer
- సమాధానం: 2
21. జతపరచండి.
పదం:
a) చెంబు, నూనె
b) చీర, కోక, అవ్వ
c) సభికులు, వైతాళికులు
d) ఛాందసుడు, కర్మ, సాని
పరిణామం:
i) అర్థసంకోచం
ii) అర్థవ్యాకోచం
iii) అర్థన్యూనత
iv) అర్థోత్కర్ష
1) a-i, b-iii, c-ii, d-iv
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-ii, b-iii, c-i, d-iv
4) a-ii, b-iv, c-iii, d-i
- View Answer
- సమాధానం: 2
22. కళావంతులు, కైంకర్యం, పూజ్యం వంటి పదాల్లో జరిగిన అర్థపరిణామం?
1) అర్థోన్నతి
2) అర్థగౌరవం
3) అర్థాపకర్ష
4) లక్ష్యార్థసిద్ధి
- View Answer
- సమాధానం: 3
23. లక్ష్యార్థాలు ఏర్పడేందుకు కారణాలు?
1) ఆధార ఆధేయ సంబంధం
2) కార్యకారణ సంబంధం
3) లక్ష్య లక్షణ సంబంధం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
24.కొందరు తమకు పరిచయం లేని పదాలను వాడతారు. క్రమేపి అవి బహుళ ప్రచారం పొందుతాయి. వాటిలో జరిగిన అర్థపరిణామాన్ని ఏమంటారు?
1) వస్తుపరిణామం
2) అర్థవ్యాకోచం
3) అర్థవిస్తృతి
4) లోకనిరుక్తి
- View Answer
- సమాధానం: 4
25. నార్త సింహాచలం నారద సింహాచలంగా మారడంలో జరిగిన అర్థపరిణామం?
1) అర్థసంకోచం
2) అర్థన్యూనత
3) లోకనిరుక్తి
4) వస్తు పరిణామం
- View Answer
- సమాధానం: 3
26. బోరన్ మిఠాయి, మొక్కజొన్న, చక్రకేళి వంటి పదాల్లో జరిగిన అర్థపరిణామం?
1) వస్తుపరిణామం
2) లోకనిరుక్తి
3) అర్థగ్రాహ్యత
4) అర్థాపకర్ష
- View Answer
- సమాధానం: 2
27. అర్థాల్లో మార్పు వచ్చేందుకు కారణాలు?
1) ప్రకరణార్థాలు-నానార్థాలు
2) శ్లేషార్థాలు-వ్యాకరణార్థాలు
3) పలుకుబడులూ, జాతీయాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
28. నవ్వులాట-నవ్వుటాల,పావురం-పారువం, జగదొంగ-గజదొంగ, పదాల్లో జరిగిన ధ్వని పరిణామం?
1) వర్ణలోపం
2) వర్ణ వ్యత్యయం
3) స్వరభక్తి
4) వర్ణ విభేదం
- View Answer
- సమాధానం: 2
29. ఒక ధ్వని రెండుసార్లు ఉచ్ఛరించినపుడు గాబరా వల్ల కానీ, తడబాటు వల్ల కానీ, ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడాన్ని ఏమంటారు?
1) వర్ణ సమీకరణం
2) వర్ణభంగం
3) వర్ణవిభేదం
4) వర్ణ సమ్మేళనం
- View Answer
- సమాధానం: 3
30. భిన్న హల్లుల మధ్య మరో వర్ణం చేరడాన్ని ఏమంటారు?
1) స్వరభక్తి
2) ఎప్రకర్ష
3) వికర్ష
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
31.మర్యాద-మరియాద,చంద్రుడు-చందురుడు,స్వర్ణ-సువర్ణ, యాత్ర-జాతర పదాల్లో జరిగిన ధ్వని మార్పును ఏమంటారు?
1) లోపదీర్ఘత
2) వర్ణ వ్యత్యయం
3) వర్ణలోపం
4) స్వరభక్తి
- View Answer
- సమాధానం: 4
32. పుస్తకము-పుస్తకాలు,ముత్యములు-ముత్యాలు, గుర్రములు-గుర్రాలు, చివుకు-చీకు వంటి పదాల్లో జరిగిన ధ్వని పరిణామం?
1) లోప దీర్ఘత
2) వర్ణ సమీకరణం
3) వర్ణ వ్యత్యయం
4) వర్ణభంగం
- View Answer
- సమాధానం: 1
33. అనేక వర్ణాలు కలిసి ఏక వర్ణంగా రూపొందే ధ్వని మార్పును ఏమంటారు?
1) వర్ణ సమ్మేళనం
2) వర్ణ సంయోగం
3) వర్ణ సంయోజనం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
34. ‘కణ్-కన్ను, యాన్-నేను’ పదాల్లో జరిగిన ధ్వని పరిణామం?
1) వర్ణ భంగం
2) వర్ణ సంయోగం
3) వర్ణ వ్యత్యయం
4) వర్ణ లోపం
- View Answer
- సమాధానం: 2
35. ‘పూజనీయ, గణనీయ’ పదాల సామ్యంతో వచ్చిన వ్యాకరణ విరుద్ధమైన ప్రసిద్ధ పదం?
1) మాననీయ
2) మహనీయ
3) గౌరవనీయ
4) స్మరణీయ
- View Answer
- సమాధానం: 3
36. ‘గ్రద్ద-గద్ద, క్రొత్త-కొత్త, ప్రాత-పాత, బ్రతుకు-బతుకు’ పదాల్లో జరిగిన ధ్వని పరిణామం?
1) వర్ణ లోపం
2) వర్ణ భంగం
3) వర్ణ విభేదం
4) ఆద్యక్షర లోపం
- View Answer
- సమాధానం: 4
37. ‘యజ్+త=ఇష్ట, వచ్+త=ఉక్త’ పదాల్లో జరిగిన ధ్వని మార్పు?
1) వ్యంజనాయామం
2) సంప్రసారణం
3) వర్ణ వ్యత్యయం
4) ద్విత్వకల్పన
- View Answer
- సమాధానం: 2
38. అర్థపరిణామం చెందిన కింది పదాల్లో సరైన జత ఏది?
అర్థ పరిణామం - పదం:
ఎ) అర్థాపకర్ష - ఛాందసుడు
బి) లోకనిరుక్తి - ఆకాశ రామన్న
సి) లక్ష్యార్థసిద్ధి - దాహం
డి) సభ్యోక్తి - అవధాని
ఇ) మృదూక్తి - ఆరాధ్యుడు
1) సి, డి, ఇ
2) ఎ, బి, సి
3) ఎ, డి, ఇ
4) డి, ఇ, ఎ, బి
- View Answer
- సమాధానం: 2
39. అర్థవ్యాకోచానికి ఉదాహరణ?
1) అయోమయం
2) చీర
3) తద్దినము
4) సంభావన
- View Answer
- సమాధానం: 1
40. విశాలార్థాన్ని బోధించే పదం కుంచితార్థాన్ని బోధిస్తే?
1) అర్థసౌమ్యత
2) అర్థగ్రామ్యత
3) అర్థవ్యాకోచం
4) అర్థసంకోచం
- View Answer
- సమాధానం: 4
41. అర్థగ్రామ్యతకు ఉదాహరణ?
1) సభికులు
2) స్వస్తి
3) కంపు
4) దీర్ఘనిద్ర
- View Answer
- సమాధానం: 3
42. అర్థవ్యాకోచానికి సంబంధించినవి?
1) ఛాందసుడు, మహారాజు, మర్యాద
2) చెంబు, చీర, ఆరాధ్యుడు
3) అవధాని, మహారాజు, ముహుర్తం
4) చెంబు, అవధాని, మహారాజు
- View Answer
- సమాధానం: 4
43.పరిమితార్థ బోధకమైన పదం అర్థ విస్తృతిని పొంది జాతివాచకమైనప్పుడు ఆ పదంలో కలిగిన పరిణామం?
1) అర్థసంకోచం
2) సభ్యోక్తి
3) అర్థాపకర్ష
4) అర్థవ్యాకోచం
- View Answer
- సమాధానం: 4
44. ‘కైంకర్యం’ అనే పదానికి ‘సేవ, పూజ’ అనే అర్థం. ఆ పదానికి అర్థాపకర్ష వల్ల ఏర్పడిన అర్థం?
1) దొంగిలించు
2) నిరంతరం సేవించు
3) అభిషేకించు
4) మోసగించు
- View Answer
- సమాధానం: 1
45. అర్థవ్యాకోచానికి ఉదాహరణ?
1) చీర
2) దాహం
3) ఛాందసుడు
4) సోమయాజి
- View Answer
- సమాధానం: 4
46.‘అన్యోన్యం’ అనే పదం ‘ప్రేమ’ అనే అర్థంలో ఉపయోగించడం వల్ల జరిగిన అర్థవిపరిణామం?
1) అర్థసంకోచం
2) సభ్యోక్తి
3) అర్థవ్యాకోచం
4) లక్ష్యార్థసిద్ధి
- View Answer
- సమాధానం: 3
47. నిందార్థమున వాడబడు పదం గౌరవాపాదకంగా మారడం?
1) అర్థగ్రామ్యత
2) అర్థవ్యాకోచం
3) మృదూక్తి
4) అర్థసౌమ్యత
- View Answer
- సమాధానం: 4
48. ‘మరణించు’ అనే అర్థంలో ‘దీర్ఘనిద్ర’ అని వాడటం ఈ అర్థవిపరిణామానికి చెందుతుంది?
1) మృదూక్తి
2) సభ్యోక్తి
3) లక్ష్యార్థసిద్ధి
4) అర్థసంకోచం
- View Answer
- సమాధానం: 2
49. ‘రాతిరి’ అన్న తద్భవ పదంలో జరిగిన ధ్వని పరిణామం?
1) వర్ణాగవం
2) స్వరభక్తి
3) వర్ణ సమీకరణం
4) వర్ణ వ్యత్యయం
- View Answer
- సమాధానం: 2
50. అర్థవ్యాకోచానికి ఉదాహరణలు
1) సూది, మర్యాద
2) చెంబు, అష్టకష్టాలు
3) చీర, వస్తాదు
4) ఛాందసుడు, దేవదాసి
- View Answer
- సమాధానం: 2