‘దాశరథి’ అనే పదానికి వ్యుత్పత్తి?
1. అంబోధి పదానికి అర్థం?
1) సరస్సు
2) కొలను
3) సముద్రం
4) చెరువు
- View Answer
- సమాధానం: 3
2. ‘అహరహం’ అంటే అర్థం?
1) రాత్రి
2) పగలు
3) సాయంత్రం
4) ప్రతిదినం
- View Answer
- సమాధానం: 4
3. ‘ఈప్సితం’ అంటే అర్థం?
1) జుగుప్స
2) అసహ్యం
3) కోరిక
4) బీభత్సం
- View Answer
- సమాధానం: 3
4. ‘ఉద్వృత్తి’ అంటే అర్థం?
1) ఆపద
2) గర్వం
3) ఉపవృత్తి
4) భిక్షాటనం
- View Answer
- సమాధానం: 2
5. జతపరచండి.
పదం:
a) ఖలుడు
b) హాలికుడు
c) కులిశం
d) కూర్మం
పరిణామం:
i) రైతు
ii) నీచుడు
iii) తాబేలు
iv) వజ్రాయుధం
1) a-i, b-iii, c-ii, d-iv
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 2
6. ఒక పదానికి ఒకే అర్థం వచ్చే వివిధ పదాలను ఏమంటారు?
1) నానార్థాలు
2) పర్యాయ పదాలు
3) వ్యుత్పత్త్యర్థాలు
4) జాతీయాలు
- View Answer
- సమాధానం: 2
7. అంబోధి పదానికి పర్యాయ పదం ఏది?
1) సముద్రం
2) కడలి
3) సాగరం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
8.భేకం, దర్దురం, మండూకం పర్యాయ పదాలున్న పదం?
1) మకరం
2) భ్రమరం
3) కప్ప
4) చేప
- View Answer
- సమాధానం: 3
9. ‘ఖగం’ పదానికి పర్యాయ పదం ఏది?
1) పక్షి
2) విహంగం
3) పులుగు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
10. నిశ, యామిని, రజనీ పర్యాయ పదాలున్న పదం?
1) రాత్రి
2) వెన్నెల
3) చీకటి
4) చంద్రుడు
- View Answer
- సమాధానం: 1
11. ‘కంఠీరవం’ పదానికి పర్యాయ పదం?
1) కేసరి
2) మృగరాజు
3) సింహం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
12.ఒక పదానికి అనేక అర్థాలుంటే దాన్ని ఏమంటారు?
1) పర్యాయ పదాలు
2) నానార్థాలు
3) వ్యుత్పత్యర్థాలు
4) నైఘంటికార్థాలు
- View Answer
- సమాధానం: 2
13. ‘అనృతం’ పదానికి నానార్థాలు?
1) అసత్యం
2) సేద్యం
3) వాణిజ్యం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14.మిత్రుడు పదానికి నానార్థాలు?
1) సూర్యుడు
2) స్నేహితుడు
3) హితుడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
15. సింహం, గుర్రం, ఆంజనేయుడు అనే అర్థాలున్న పదం?
1) పుండరీకం
2) కేసరి
3) కరము
4) అశని
- View Answer
- సమాధానం: 2
16. పుండరీకం పదానికి నానార్థం కానిది?
1) పులి
2) తీయమామిడి
3) ఆకాశం
4) తెల్ల తామర
- View Answer
- సమాధానం: 3
17. గుణం పదానికి నానార్థాలు?
1) వింటినారి
2) స్వభావం
3) దారం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18. కుండలి పదానికి నానార్థాలు?
1) పాము
2) నెమలి
3) వరుణుడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
19. ఒక పదానికి సంబంధించిన పుట్టుక, నేపథ్యం దాని అర్థం మొదలైన వాటిని తెలియజేసే పదాలు?
1) పర్యాయ పదాలు
2) వ్యుత్పత్త్యర్థాలు
3) నైఘంటికార్థాలు
4) నానార్థాలు
- View Answer
- సమాధానం: 2
20. ‘మరణం పొందనిది’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) అనృతం
2) ఘృతం
3) అమృతం
4) అనఘం
- View Answer
- సమాధానం: 3
21. ‘స్వభావం చేత ఐశ్వర్యం గలవాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) ఇంద్రుడు
2) విష్ణువు
3) కుబేరుడు
4) ఈశ్వరుడు
- View Answer
- సమాధానం: 4
22. ‘అజ్ఞానమనెడి అంధకారాన్ని పోగొట్టేవాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) సూర్యుడు
2) చంద్రుడు
3) గురువు
4) దేవుడు
- View Answer
- సమాధానం: 3
23. ‘సాధువుల హృదయాన శయనించి ఉండువాడు మంగళ ప్రదుడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) బ్రహ్మ
2) శివుడు
3) విష్ణువు
4) ఇంద్రుడు
- View Answer
- సమాధానం: 2
24. ‘దాశరథి’ అనే పదానికి వ్యుత్పత్తి?
1) దశరథుని కుమారుడు
2) దశరథుని తమ్ముడు
3) దశరథుని పురోహితుడు
4) దశరథుని గురువు
- View Answer
- సమాధానం: 1
25. ‘పద్మము గర్భముగా కలవాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) బ్రహ్మ
2) విష్ణువు
3) ఇంద్రుడు
4) నారదుడు
- View Answer
- సమాధానం: 1
26. ‘పున్నామ నరకం నుంచి తప్పించువాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) కుమారుడు
2) పుత్రుడు
3) తనయుడు
4) ఆత్మజుడు
- View Answer
- సమాధానం: 2
27. ‘ఆదేశం, ఆన, ఉత్తరువు, నిర్దేశం’ అనే పర్యాయ పదాలున్న పదం?
1) ఆకరం
2) ఆరోపం
3) అనుమతి
4) ఆజ్ఞ
- View Answer
- సమాధానం: 4
28. పదాల అర్థం ఉన్నదున్నట్లుకాకుండా, దాన్ని పరిశీలిస్తే జాతి వాడుకలో ఉన్న ప్రసిద్ధమైన భాషా విశేషం స్ఫురించడాన్ని ఏమంటారు?
1) సామెత
2) జాతీయం
3) వ్యుత్పత్తి
4) పొడుపు కథ
- View Answer
- సమాధానం: 2
29. ‘చెవికి ఇంపును కలిగించు’ అనే అర్థంలో ఉన్న జాతీయం?
1) చెవిలో జోరీగ
2) చిలుక పలుకులు
3) వీనుల విందు
4) తలలో నాలుక
- View Answer
- సమాధానం: 3
30. ‘ఆరంభంలోనే ఆటంకం’ కలిగే సందర్భంలో ఉపయోగించే జాతీయం?
1) పురిటిలోనే సంధి
2) ఆరంభ శూరత్వం
3) ఆదిలోనే హంసపాదు
4) ఆదిలోనే ఆటంకం
- View Answer
- సమాధానం: 3
31.‘గురువు చెప్పిన మాటలు పెడచెవిని పెట్టినందున రవి చెడిపోయాడు’- ఈ వాక్యంలో ‘పెడచెవినిపెట్టు’ అనే జాతీయానికి అర్థం?
1) విని ఆచరించడం
2) పూర్తిగా మునిగిపోవడం
3) చెప్పుచేతల్లో నడవడం
4) పట్టించుకోక పోవడం
- View Answer
- సమాధానం: 4
32. ‘విశేష జ్ఞానం సంపాదించు’ అనే అర్థం వచ్చే జాతీయం?
1) నల్లేరుపై బండినడక
2) నాలుగాకులెక్కువ చదవడం
3) భగీరథ ప్రయత్నం
4) నోరు మెదల్చడం
- View Answer
- సమాధానం: 2
33. అల్పాక్షరాల్లో అనల్ప భావాన్ని, అనుభవాన్ని సందేశాత్మకంగా అందించేదాన్ని ఏమంటారు?
1) జాతీయం
2) సామెత
3) పొడుపు కథ
4) తట్టుకథ
- View Answer
- సమాధానం: 2
34. సామెతకు పర్యాయ పదాలు?
1) నానుడి-జనశ్రుతి
2) సుద్దు
3) సాటువ-శాస్త్రం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
35. ‘ఉల్లి చేసే మేలు తల్లిైయెునా చేయదు’ అనేది ఏ రకమైన సామెత?
1) మనస్తత్వ సామెత
2) హాస్యపు సామెత
3) వైద్యపు సామెత
4) ఆరోగ్య సామెత
- View Answer
- సమాధానం: 3
36. ‘చిన్నతనంలో మాట విననివాడు పెద్దయ్యాక అసలే వినడు’ అనే అర్థంలో ప్రసిద్ధమైన సామెత?
1) హితం వినని మూర్ఖుడు
2) చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు
3) ఉట్టికెగరలేనివాడు స్వర్గానికెగిరినట్లు
4) మొక్కై వంగనిది మ్రానై వంగునా
- View Answer
- సమాధానం: 4
37. నిగూఢార్థస్ఫోరకంగా, అంతు చిక్కకుండా తికమకలు పెట్టేది?
1) జాతీయం
2) సామెత
3) పొడుపు కథ
4) నానుడి
- View Answer
- సమాధానం: 3
38.నిగూఢార్థస్ఫోరకంగా, అంతు చిక్కకుండా తికమకలు పెట్టేది?
1) జాతీయం
2) సామెత
3) పొడుపు కథ
4) నానుడి
- View Answer
- సమాధానం: 4
39. ‘నెత్తి మీద రాయి నోట్లో వేలు’ అనే పొడుపు కథకు అర్థం?
1) ఉంగరం
2) వడ్డాణం
3) తాయెత్తు
4) అంత్రం
- View Answer
- సమాధానం: 1
40.‘తండ్రి గరగర, తల్లి పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు’ ఈ పొడుపు కథకు విడుపు?
1) కొబ్బరికాయ
2) పనసపండు
3) దోసకాయ
4) బీరకాయ
- View Answer
- సమాధానం: 2
41. ‘కిటకిట తలుపులు కిటారు తలుపులు, ఎప్పుడు తీసినా చప్పుడు కావు’ ఏమిటవి?
1) చూపులు
2) కిటికీ తలుపులు
3) కనురెప్పలు
4) పెదవులు
- View Answer
- సమాధానం: 3
42. పుత్రుడు పదానికి వికృతి?
1) తనయుడు
2) కొమరుడు
3) బొట్టెడు
4) బొట్టె
- View Answer
- సమాధానం: 4
43. ‘జాతర’ పదానికి ప్రకృతి?
1) జాత్ర
2) యాతర
3) యాత్ర
4) జాగృత
- View Answer
- సమాధానం: 3
44. ‘పొత్రము’ అనే వికృతి రూపానికి ప్రకృతి రూపం?
1) పాత్ర
2) ప్రస్తరము
3) పత్రం
4) పత్రిక
- View Answer
- సమాధానం: 2
45. ‘గరువము, జతనము’ అనే పదాలకు ప్రకృతి రూపాలు?
1) గారవము, ప్రయత్నము
2) గర్వము, యత్నము
3) గార్వము, ప్రయత్నము
4) గీము, ప్రయత్నము
- View Answer
- సమాధానం: 2
46.‘ధూర్జటి ’ అనే పదానికి అర్థం?
1) విఘ్నేశ్వరుడు
2) విష్ణువు
3) బ్రహ్మ
4) శివుడు
- View Answer
- సమాధానం: 4
47. వల్మీకం అంటే అర్థం?
1) చె ట్టు
2) ఊరు
3) పుట్ట
4) అడవి
- View Answer
- సమాధానం: 3
48. ‘దెబ్బతీసే అవకాశం కోసం ఎదురుచూడటం’ అనే అర్థం వచ్చే జాతీయం?
1) కాలుగాలిన పిల్లి
2) కడలో నీరు కదలకుండా
3) ఆటకట్టుచేయు
4) గోతికాడనక్క
- View Answer
- సమాధానం: 4
49. ‘ఇనుడు’ అనే మాటకు పర్యాయ పదాలు?
1) రవి, చంద్రుడు
2) రవి, ఇంద్రుడు
3) రవి, భానుడు
4) భానుడు, ఇంద్రుడు
- View Answer
- సమాధానం: 3
50.‘భృంగారం’ అనే మాటకు వికృతి?
1) భారం
2) భంగారం
3) బొంగరం
4) బంగారం
- View Answer
- సమాధానం: 4
51. ‘పారు’ అనే క్రియా రూపానికి నానార్థాలు?
1) పాలు, క్షీరం
2) ప్రవ హించు, పరుగెత్తు
3) కీర్తి, యశస్సు
4) ప్రవహించు, నాశనం
- View Answer
- సమాధానం: 2
52. ‘హరిత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధ గతినందున్’ - ఈ వాక్యంలో ‘హరిత్తులు’ అనే పదానికి అర్థం?
1) పులులు
2) నాగళ్లు
3) సింహాలు
4) పాములు
- View Answer
- సమాధానం: 3
53. ‘వజ్రంబు శిరీష పుష్పంబులనూహించు భేదింప’ ఈ వాక్యంలో శిరీషపుష్పమనగా?
1) మంకెన పూవు
2) మోదుగు పూవు
3) దిరిసెన పూవు
4) సంపెంగ పూవు
- View Answer
- సమాధానం: 3
54.‘వారిజ గర్భుడు’ అను పదానికి పర్యాయ పదాలు?
1) సూర్యుడు, రవి
2) రవి, బ్రహ్మ
3) బ్రహ్మ, చతుర్ముఖుడు
4) రవి, చతుర్ముఖుడు
- View Answer
- సమాధానం: 3
55. ‘తాత, ముత్తాతల కాలం నుంచి వస్తున్నది’ అనే అర్థానిచ్చే పదం?
1) వంశపారంపర్యం
2) పెట్టింది పేరు
3) ఉట్టిపడుట
4) చూడముచ్చట
- View Answer
- సమాధానం: 1
56. ‘శ్రీరామ రక్ష, గీటురాయి, స్వస్తి వాచకం’ అనే మాటలు?
1) చిట్టిమాటలు
2) సామెతలు
3) జాతీయాలు
4) పెద్దల మాటలు
- View Answer
- సమాధానం: 3
57. ‘గురువు’ అనే పదానికి ఉన్న నానార్థాలు?
1) తండ్రి, పురోహితుడు, ఉపాధ్యాయుడు
2) తండ్రి, ఇంద్రుడు, పురోహితుడు
3) బ్రహ్మ, ఒజ్జ, ఇంద్రుడు
4) బ్రహ్మ, యముడు, సూర్యుడు
- View Answer
- సమాధానం: 1
58. సిరియె భోగోలబ్ధికి ‘జీవగఱ్ఱ’-ఈ వాక్యంలో ‘జీవగఱ్ఱ’ అనే జాతీయానికి వివరణ?
1) జీవనాధారం
2) చేతికర్ర
3) కొరత
4) లెక్కచేయక పోవడం
- View Answer
- సమాధానం: 1
59.‘యత్నం’ అనే పదానికి వికృతి?
1) యాగము
2) జతనం
3) జగం
4) జంధ్యము
- View Answer
- సమాధానం: 2
60. ‘ముద్ర’ అనే పదానికి నానార్థాలు?
1) చంద్రుడు, అచ్చువేయడం
2) గుర్తు, నీరు
3) ఒక అలంకారం, రెల్లు పూవు
4) గుర్తు, ఒక అలంకారం
- View Answer
- సమాధానం: 4
61. పనిలేక ఖాళీగా ఉన్నవాడు పనిచేస్తున్నవాడిని చెడగొట్టినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తాం?
1) కందకులేని దురద కత్తికెందుకు
2) కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు
3) కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లు
4) కూసే గాడిదవచ్చి మేసే గాడిదను చెరిపినట్లు
- View Answer
- సమాధానం: 4
62. పారావారం అనే పదానికి వ్యుత్పత్త్యర్థం?
1) ప్రజలను మేల్కొలుపునది
2) పనికిరాని పూర్వపు కథ
3) భూమిని ధరించునది
4) అంతులేని తీరంగలది
- View Answer
- సమాధానం: 4