Skip to main content

గణితశాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, మూల్యాంకనం :

జ్ఞానోద్దేశం:
  • గణిత అభ్యసన వల్ల విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, విశ్లేషణ, వివేచన, క్రమశిక్షణ మొదలైనవి అలవడతాయి.
  • గణిత అధ్యయనం వల్ల ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో ప్రసిద్ధుడవుతాడు.
శీలోద్దేశం:
  • శీలం అంటే ఒక వ్యక్తి ఇతరులతో కలిసినప్పుడు తన ప్రవర్తనావళి.
  • గణిత పఠనం వల్ల విద్యార్థికి మంచి లక్షణాలు, క్రమశిక్షణ, నిర్మాణకత, క్రమ సరళి, పద్ధతి మొదలైనవి అలవడతాయి.
సాంస్కృతిక ఉద్దేశం:
  • సంస్కృతిని మనం ముందు తరాల నుంచి అందుకొని తగిన విధంగా మార్పులు, చేర్పులు చేస్తూ ఎక్కువగా విద్యా మాధ్యమం ద్వారా భావితరాల వారికి అందిస్తాం.
  • గణితం సంస్కృతికి అద్దం వంటిది - బేకన్
సన్నాహోద్దేశం:
  • విద్యార్థులను ఏ రంగానికైనా, ఏ కళకైనా, ఏ వృత్తికైనా గణిత అభ్యసనం ద్వారా సన్న ద్ధులను చేసి ఎలాంటి సమస్యలనైనా పరి ష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
స్వయం అధ్యయనోద్దేశం :
  • విద్యార్థి గణిత ఉద్దేశాలను తెలుసుకున్నప్పుడు, గణితంపై ఇష్టం పెంచుకొని స్వయం అధ్యయనం చేస్తాడు.
సహసంబంధం:
  • జ్ఞానాన్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా సమగ్రమైన మొత్తంగా అందించడం వల్ల విద్యార్థికి అవగాహన సులభమవుతుంది.
  • ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం - బ్రాడ్‌ఫోర్డ్
  • విద్యార్థికి ఒక అంశంలోని సామర్థ్యం మరో అంశంలోని సామర్థ్యాన్ని పెంచుతుంది- థారన్‌డైక్
సహసంబంధం రెండు రకాలు
1) అంతర్గత సహ సంబంధం
2) బాహ్య సహ సంబంధం

అంతర్గత సహ సంబంధం: గణితంలో వివిధ శాఖల మధ్య ఉండే సహసంబంధం
ఉదా: (x+y)2=x2+2xy+y2 కు జ్యామితీయ నిరూపణ, బీజగణిత, రేఖాగణితాల మధ్య సహసంబంధం తె లియజేయడం
బాహ్య సహ సంబంధం: ఇది గణితం, ఇతర సబ్జెక్టులకు మధ్య సహ సంబంధం తెలుపుతుంది.
ఉదా:1) కర్బనాన్ని క్రమషడ్భుజి ద్వారా చూపడం, రసాయన శాస్త్రం - గణితం
2) మానవుడిలోని ఎముకల సంఖ్య - 206, జీవశాస్త్రం - గణితం.

మాదిరి ప్రశ్నలు

1. ఒక వ్యక్తి దేన్ని మొదట, మధ్యలో, తుదిగా చేయాలో నిర్ణయించడానికి అవకాశం కల్పించేది?
  ఎ) సృజనాత్మకత  
  బి) క్రమశిక్షణ
  సి) సంస్కృతి  
  డి) జ్ఞానం

Published date : 15 Nov 2018 12:16PM

Photo Stories