Extension of Sainik School Entrance Test Fee Payment Deadline: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
పెడన: ఆలిండియా సైనిక్ స్కూల్‌లో 2024–25 ఏడాదికి ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపుగడువు డిసెంబర్ 16వ తేదీతో ముగిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2024 జనవరి 21వ తేదీన ఓఎంఆర్ షీట్ ద్వారా పరీక్ష జరుగుతుందన్నారు. జనరల్ కేటగిరి విద్యార్థులు రూ.650, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500గా పరీక్ష ఫీజు నిర్ణయించారని తెలిపారు. డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి డిసెంబర్ 16వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు సమయం ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు ఎన్‌టీఏ వెబ్‌సైట్ https://exams.nta.ac.in/AISSEE/ను సంప్రదించాలని సూచించారు.
Also Read: Sainik Schools Class VI & IX Admission 2024 through AISSEE
https://www.sainikschoolkorukonda.org/ లో కూడా వివరాలుంటాయని తెలిపారు. ఆయా తరగతుల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొందడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేలా అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల వారు ప్రోత్సహించాలని డీఈఓ కోరారు.
Tags
- AISSEE-2024
- Sainik Schools Admission 2024
- Sainik Schools Class VI & IX Admission 2024
- Sainik School Admission Form 2024
- Sainik School online form
- Extension of Sainik School Entrance Test Fee Payment Deadline
- GeneralCategory
- Admissions2024
- EntranceExamFees
- SainikSchoolCareers
- NTA
- Sakshi Education Latest News
- OnlineApplications