Skip to main content

Indian Railway Jobs 2023 : రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఖాళీల వివ‌రాలు ఇవే.. మొత్తం ఎన్ని లక్షల పోస్టులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశంలో రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉంది. ఈ మేరకు రైల్వేశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో పేర్కొంది.

దేశంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ విభాగంగా మొదటిస్థానంలో నిలిచిన రైల్వేశాఖ.. దేశంలో అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్న విభాగంగాను గుర్తింపు పొందింది.ఇక కీలకమైన ఆపరేషనల్‌ సేఫ్టీ విభాగంలో 53,178 పోస్టులు పెండింగులో ఉండటం గమనార్హం. దేశంలో అన్ని రైల్వేజోన్ల పరిధిలో కలిపి మొత్తం 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. వాటిలో అత్యధికంగా గ్రూప్‌–సి ఉద్యాగాలే 2.48 లక్షలు ఖాళీగా ఉన్నాయి.

☛ రైల్వే పరీక్షల‌కు స‌న్నద్ధమ‌వుతున్నారా.. రాణించండిలా!

అత్యధికంగా..
గ్రూప్‌–ఏ ఉద్యోగాలు 1,965, గ్రూప్‌–బి ఉద్యోగాలు 105 ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నార్తర్న్‌ రైల్వేలో 32,636 పోస్టులు ఖాళీగా ఉండగా, అత్యల్పంగా దక్షిణ పశ్చిమ రైల్వే జోన్‌లో 4,897 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఇందులో భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలు 1,77,924గా ఉన్నాయి. జూన్‌ 1 తేదీ నాటికి నాన్‌ గెజిటెడ్‌ గ్రూప్‌ సిలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రైల్వే శాఖ చెప్పింది. ఇక రైల్వేల భద్రతకు సంబంధించి 9.82 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 8.04 లక్షల భర్తీ చేసినట్టు వివరించింది. భద్రత కేటగిరీలో లోకో పైలెట్లు, ట్రాక్‌ తనిఖీలు చేసే వ్యక్తులు, పాయింట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్‌ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ట్రైన్‌ మేనేజర్లు, స్టేషన్‌ మాస్టర్లు, టికెట్‌ కలెక్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఒడిశాలో బాలాసోర్‌ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఆర్‌టీఐ కింద పోస్టుల ఖాళీలపై ఆర్‌టీఐ కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

☛ ఇండియ‌న్‌ రైల్వే గ్రూప్ ‘డి’ ఉద్యోగాల‌కు .ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

రైల్వే మంత్రి చెప్పిన ప్ర‌కారం..

Union Railway Minister Ashwini Vaishnav news telugu

2022 డిసెంబర్ లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. ఇండియన్ రైల్వేస్ లో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ కు తెలియజేశారు. వీటిలో ముఖ్యంగా భద్రత విభాగంలో లోకో పైలట్లు, ట్రాక్ పర్సన్స్, పాయింట్స్ మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్, టెలికాం అసిస్టెంట్లు, గార్డులు/ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, క్లర్క్స్, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమైన పోస్టులకు సంబంధించి సిబ్బంది కొరత ఉందని రైల్వే యూనియన్లు ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నారు.

☛ Success Story: యూట్యూబ్‌ను గురువుగా ఎంచుకుని రైల్వే టీసీగా ఎంపికై న ‘ఏకలవ్యుడు’ ఈ రైతు బిడ్డ 

ట్రాక్ మెయింటెనెన్స్, ఫిట్ నెస్, సీనియర్, జూనియర్ సెక్షన్ ఇంజనీర్లు, గ్యాంగ్ మెన్, టెక్నీషియన్లు వంటి పోస్టుల కోసం రైల్వే యూనియన్లు మంత్రిత్వ శాఖను కోరాయి. ఈ సిబ్బంది కొరత కారణంగా పని ఒత్తిడి ఉన్న కార్మికులపై పడుతుందని.. ఒక్కో సిబ్బంది పట్టాలను తనిఖీ చేయడానికి 8 నుంచి 10 కి.మీ. నడుస్తున్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సమస్యను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పరిష్కరించేందుకు రైల్వే సంస్థ ప్రయత్నిస్తోంది. 2023 అక్టోబర్​ వరకు దాదాపు 1.52 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 1.38లక్షల మందికి నియామక పత్రాలు అందజేసినట్లు వారు వెల్లడించారు. అందులో 90వేల మంది విధుల్లో చేరారన్నారు. వీటిల్లో 90 శాతం ఉద్యోగాలు భద్రత విభాగంలో ఉన్నాయని అధికారులు వివరించారు. త్వరలోనే మిగిలిన‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

☛ Central Government Jobs 2023 : శుభ‌వార్త‌.. కేంద్రంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు.. ఖాళీల వివ‌రాలు ఇవే..!

Published date : 09 Aug 2023 04:04PM

Photo Stories