ఉద్యోగాల రైలొచ్చింది...
Sakshi Education
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వేది నాలుగో స్థానం. దాదాపు 16 లక్షల మందికి పైగా సిబ్బందిని కలిగి దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా నిలిచింది. అంతేకాకుండా నిరంతరం ఉద్యోగులను నియమించుకుంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. టెక్నికల్ నాన్ అనే టెక్నికల్ అనే రెండు విభాగాల్లో గ్రూప్ డి, సి, బి, పోస్టుల్లో ఏటా వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. తాజాగా పలు రైల్వే జోన్‌లలో దాదాపు 6,400 పోస్టులకు నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. ఈ తరుణంలో వివిధ నోటిఫికేషన్ల వివరాలు, ప్రిపరేషన్ ప్లాన్, స్టడీమెటీరియల్, మాక్‌టెస్ట్‌లు మీకోసం..
ఖాళీల వివరాలు:
ఖాళీల వివరాలు:
- తూర్పు రైల్వే: 1,608
- దక్షిణ-తూర్పు రైల్వే: 785
- మధ్య రైల్వే: 905
- ఉత్తర-మధ్య రైల్వే: 2,715
- ఉత్తర-పశ్చిమ రైల్వే: 290
- పశ్చిమ రైల్వే: 59
- ఉత్తర రైల్వే: 54
తూర్పు రైల్వేలో 1,608 ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా పోస్టులు
కోల్‌కతాలోని తూర్పు రైల్వే పోర్టర్, గేట్‌మెన్,హెల్పర్, ట్రాక్‌మెన్, గేట్‌కీపర్, ప్యూన్ వంటి పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత: పదోతరగతి / తత్సమానం. ఆర్మీలో 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని క్లాస్-1 సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
చివరి తేది: 16 ఆగస్టు, 2013
వెబ్‌సైట్: https://www.rrcer.com/Notification%20exserviceman-P-ER-RRC-ESM-01-2013.pdf
దక్షిణ తూర్పు రైల్వేలో 785 ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా పోస్టులు
కోల్‌కతాలోని దక్షిణ తూర్పు రైల్వే హెల్పర్, ట్రాక్‌మెన్, పాయింట్స్‌మెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హతలు: ఆర్మీలో 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకొని ఉండాలి. ఆర్మీ క్లాస్ -1 సర్టిఫికెట్/తత్సమానం
చివరి తేది: 26 ఆగస్టు, 2013
వెబ్‌సైట్: https://www.rrcser.in/images/NOTIFICATION.pdf
మధ్య రైల్వేలో 905 గ్రూప్ డి పోస్టులు
ముంబైలోని మధ్య రైల్వే హెల్పర్, ట్రాక్‌మెన్, పాయింట్స్‌మెన్, ఖలాసీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
విద్యార్హతలు: పదోతరగతి/తత్సమానం. ఆర్మీలో 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకొని ఆర్మీ క్లాస్-1 సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: గరిష్ట వయోపరిమితి 33 ఏళ్లు
చివరి తేది: 26 ఆగస్టు, 2013
వెబ్‌సైట్: https://www.rrccr.com/Upload/EmpNotf_02_2013_Ex-Serv_Quota.pdf
ఉత్తర మధ్య రైల్వేలో 2,715 గ్రూప్ డి పోస్టులు
అలహాబాద్‌లోని రైల్వే నియామక విభాగం ఉత్తర మధ్య రైల్వేలో గేట్‌మెన్, హెల్పర్, ట్రాక్‌మెన్, సఫాయివాలా, ఖలాసీ, బాక్స్‌బాయ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హత : పదోతరగతి/తత్సమానం
వయోపరిమితి: 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష , ఫిజికల్ టెస్ట్
చివరి తేది: 02 సెప్టెంబర్, 2013
వెబ్‌సైట్: https://rrcald.org/Downloads/RRC-RAGP-Advt-English.pdf
ఉత్తర పశ్చిమ రైల్వేలో 290 గ్రూప్ డి పోస్టులు
జైపూర్‌లోని ఉత్తర పశ్చిమ రైల్వే ట్రాక్‌మెన్, గేట్‌మెన్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హత: పదోతరగతి/తత్సమానం. ఆర్మీలో 15 సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన వారూ అర్హులే.
చివరి తేది: 13 ఆగస్టు, 2013
వెబ్‌సైట్: https://sakshieducation.com/(S(ql4way45eqmyt431svj0vfef))/RailwayJobsStory.aspx?nid=52800&cid=2&sid=12&chid=24&tid=0
దరఖాస్తు విధానం: పై అన్ని పోస్టులకు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకొని నిర్ణీత ఫార్మాట్‌లో పూర్తి చేసి సంబధిత రైల్వే రిక్రూట్‌మెంట్ కార్యాలయాలకు గడువు తేదీలోగా చేరేలా పంపాలి.
పరీక్షా విధానం:
గ్రూప్ డి పోస్టుల్లో ప్రధానంగా ట్రాక్‌మెన్, పాయింట్స్‌మెన్, హెల్పర్ (మల్టీ పర్పస్), సఫాయివాలా, గేట్‌మెన్, ఖలాసీ, బాక్స్‌బాయ్, ప్యూన్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు. ఆయా రైల్వే జోన్‌లలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్ వీటి నియామకాన్ని చేపడతాయి. వీటికి పదోతరగతి లేదా ఐటీఐ, అర్హత కాబట్టి ప్రశ్నా పత్రం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ అనే రెండు దశల్లో ఉంటుంది.
రాత పరీక్ష: ఈ పరీక్షలో గరిష్ట మార్కులు 100-150. 100-150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. నెగటివ్ మార్కు విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కు, ప్రతి 3 తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో ఉంటుంది.
సిలబస్: సిలబస్ ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుంది. అవి.
1. జనరల్ అవేర్‌నెస్
2. న్యూమరికల్ ఎబిలిటీ
3. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్.
జనరల్ అవేర్‌నెస్: దీని నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ, ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ, పాలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అనే అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇండియన్ హిస్టరీ: దీనిలో ప్రధానంగా ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారత దేశ చరిత్ర, జాతీయోద్యమం నుంచే దాదాపు 80 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలపై దృష్టి సారించాలి.
గత పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
1. సింధు నాగరికతలో ఓడరేవు బయట పడిన నగరం?
ఎ) లోథాల్
బి) మొహెంజుదారు
సి) బన్వాల్
డి) ఏదీకాదు
2. అతి పురాతన వేదం?
ఎ) రుగ్వేద
బి) సామవేద
సి) యజుర్వేదం
డి) అదర్వణ వేదం
పాలిటీ: దీనిలో భారత రాజ్యాంగ పరిణామం, రాష్ర్టపతి, ప్రధానమంత్రి, ప్రస్తుత పార్లమెంటు వివరాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగ సంస్థలు అధిపతులు, రాష్ర్ట ప్రభుత్వం, చట్టాలు వంటి వాటి నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.
గత పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
1. 73 వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది?
ఎ) మునిసిపాలిటీలు
బి) పంచాయతీరాజ్
సి) రాష్ర్టపతి
డి) ప్రధానమంత్రి
2. రాష్ర్టపతి పద వికి పోటీచేయడానికి గరిష్ట వయసు?
ఎ) 65
బి) 75
సి) 60
డి) ఏదీకాదు
ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ: సౌరకుటుంబం, మన భూమి, నదీవ్యవస్థ, దేశాలు, జనాభా, ఆవాసం, ఎత్తైనవి, పెద్దవి, మృత్తిక, ఖనిజాలు, ప్రదేశాలు వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి.
గత పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
1. ఎవరెస్టు శిఖరం ఎత్తు?
ఎ) 800 మీ.
బి) 8800 మీ.
సి) 8000 మీ.
డి) 8848 మీ.
2. అతి పెద్ద గ్రహం?
ఎ) బృహస్పతి
బి) భూమి
సి) బుధుడు
డి) శుక్రుడు
జనరల్ సైన్స్ : బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రశ్నలు వస్తాయి.
గత పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
1. పీడనం ప్రమాణం?
ఎ) జౌల్
బి) పార్శీ
సి) పాస్కల్
డి) ఏదీకాదు
2. మానవ దేహంలో అతిపెద్ద గ్రంధి?
ఎ) గుండె
బి) కాలేయం
సి క్లోమం
డి) పీయూష గ్రంధి
న్యూమరికల్ ఎబిలిటీ: నంబర్ సిస్టం, భిన్నాలు, సూక్ష్మీకరణలు, నిష్పత్తి, అనుపాతం, శాతాలు, క్షేత్రగణితం, బారువడ్డీ, చక్రవడ్డీ, కాలం-దూరం, కాలం-పని వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి.
గత పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
1. 2/5 వంతు పనిని చేయడానికి 5 గంటల సమయం పడితే మొత్తం పని చేయడానికి ఎంత సమయం పడుతుంది?
ఎ) 25
బి) 20
సి) 10
డి) 5
జనరల్ ఇంటెల్లిజెన్స్ అండ్ రీజనింగ్: దీనిలో వర్బల్, నాన్ వర్బల్ రీజనింగ్ అంశాలుంటాయి. నంబర్ సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, డెరైక్షన్స్, కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ వంటి వర్బల్ రీజనింగ్.. క్లాపిఫికేషన్, క్యూబ్స్, డైస్, వెన్‌డయాగ్రమ్స్ వంటి నాన్‌వర్బల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
గత పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
1. 125, 106, 88,76, 65, 58, 53 సిరీస్‌లో తప్పు నంబర్‌ను గుర్తించండి?
ఎ) 125
బి) 106
సి) 88
డి) ఏదీకాదు
2. 2, 5, 9, 19, 37.. సిరీస్‌లో తర్వాత వచ్చే సంఖ్య?
ఎ) 76
బి) 74
సి 75
డి) 70
ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్: రాత పరీక్షలో విజయం సాధించిన వారిని ఫిజికల్ టెస్ట్‌కు పిలుస్తారు. ఈ పరీక్షలో 1000 మీటర్లు 10 నిమిషాల్లో పరిగెత్తాల్సి ఉంటుంది.
రిఫరెన్స్ బుక్స్:
ఆబ్జెక్టివ్ ఆర్థమెటిక్: ఎస్ ఎల్ గులాటీ, ఆర్.ఎస్ అగర్వాల్
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంకింగ్: దిల్షాన్ పబ్లికేషన్స్
నాన్ వెర్బల్ రీజనింగ్ : ప్రభాత్ జావేద్
వెర్బల్ రీజనింగ్: ఆర్.ఎస్. అగర్వాల్
జనరల్ సైన్స్: పదోతరగతి వరకు తెలుగు అకాడమీ పుస్తకాలు, 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు.
కరెంట్‌అఫైర్స్: ఏదైనా తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలు, ఇండియా ఇయర్‌బుక్, సాక్షి భవితలో వచ్చే కరెంట్ అఫైర్స్ మొదలైనవి.

Published date : 06 Aug 2013 11:08AM