Skip to main content

భారీ కొలువుల రైలొచ్చింది!

ప్రపంచ రైల్వేల్లో నాలుగోస్థానంలో ఉన్న ఇండియన్ రైల్వే దేశంలోనే అత్యధిక ఉద్యోగులను కలిగిన సంస్థ. దాదాపు 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ నిత్యం 3 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. 9 వేల రైల్వే స్టేషన్లు, 65 వేల కిలోమీటర్ల పొడవైన మార్గంలో రోజూ 19 వేల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

ఇంత భారీ నెట్‌వర్క్ కలిగిన సంస్థలో మానవ వనరుల నియామకం కూడా భారీగానే ఉంటుంది. ఆ క్రమంలోనే గతేడాది టెక్నికల్ విభాంలో 26,570 పోస్టులు (అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్) భర్తీ చేసిన రైల్వే 2015 జూన్‌లో 2300 జూనియర్ ఇంజనీర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసింది.

తాజాగా గ్రూప్‌ -సి నాన్ టెక్నికల్ పాపులర్ (Group-C Non Technical Popular) విభాగంలో 18,252 పోస్టులకు భారతీయ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని 17 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు సంయుక్తంగా 9 రకాల పోస్టులకు నియామకాలు చేపట్టనున్నాయి. దరఖాస్తుకు 2016 జనవరి 25 చివరి తేది కాగా మార్చి-మే మధ్యలో ఒకే దశలో ఉండే కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (Computer Based Online Test)ను నిర్వహించనున్నారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ల తనిఖీ చేసి అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

డిగ్రీ ఉత్తీర్ణులైన ఎవరైనా కేవలం ఒకే దశ రాత పరీక్ష ద్వారా ప్రారంభంలో సుమారు రూ.30,000 వేతనం కలిగిన ఒక ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని దశలు దాటుకొని భారీ కొలువుల రెలైక్కాలంటే ఒకింత శ్రమించాల్సిందే.

ఖాళీల వివరాలు - 17 రైల్వే జోన్లు

పోస్టుల వివరాలు

సంఖ్య

1. కమర్షియల్ అప్రెంటిస్

703

2. ట్రాఫిక్ అప్రెంటిస్

1645

3. ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్

127

4. గూడ్స్ గార్డ్

7591

5. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్

1205

6. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్

869

7. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్

5942

8. ట్రాఫిక్ అసిస్టెంట్

166

9. సీనియర్ టైం కీపర్

04

మొత్తం

18252


సికింద్రాబాద్ జోన్‌లో ఖాళీలు (సౌత్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్ రైల్వే కలిపి)

పోస్టుల వివరాలు

సంఖ్య

1. కమర్షియల్ అప్రెంటిస్

97

2. ట్రాఫిక్ అప్రెంటిస్

223

4. గూడ్స్ గార్డ్

832

6. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్

40

7. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్

426

మొత్తం

1618

గమనిక: పోస్టు కోడ్ 03, 05, 08, 09 కి సికింద్రాబాద్ జోన్‌లో ఖాళీలు లేవు.

విద్యార్హతలు: (Academic Qualifications) డిగ్రీ ఉత్తీర్ణత (పోస్టు కోడ్ 5, 06, 09 లకు ఇంగ్లిష్ లేదా హిందీలో టైపింగ్ నైపుణ్యం తప్పనిసరి)

వయస్సు: (Age limit) 18-32 సంవత్సరాలు (ఎస్సీ/ఎస్టీకి - 5, ఓబీసీకి-3, ఎక్స్ సర్వీస్‌మెన్‌కి-3 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు రుసుం: (Examination Fee) రూ.100/- (మహిళలు, ఎస్సీ/ఎస్టీ, ఈబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ, మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్‌లకు ఫీజు లేదు.)
గమనిక: జనరల్, ఓబీసీకి చెందిన పురుషులు మాత్రమే ఫీజు చెల్లించాలి.

ఫీజు చెల్లింపు విధానం:
ఫీజు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, ఎస్‌బీఐ చలాన్ లేదా, కంప్యూటరైజ్డ్ పోస్ట్ ఆఫీస్‌లో చెల్లించవచ్చు. అభ్యర్థి దరఖాస్తు నింపే సమయంలో ఫీజు చెల్లింపు విధానం ఎంపిక చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: (How to Apply):
ఏదో ఒకరైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుకి మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. పోస్టుల ప్రాధాన్యక్రమం ఎంచుకొని అన్ని పోస్టులకు ఒకే దరఖాస్తు సమర్పించాలి.
  1. మొదట https://rrbsecunderabad.nic.in/ వెబ్‌సైట్‌లోకి లాగాన్ అయి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
  2. ONLINE Application లింక్‌పై క్లిక్ చేసి తర్వాత వచ్చే New Registration మీద క్లిక్ చేయాలి.
  3. దరఖాస్తులో పూర్తి వివరాలు (పేరు, తండ్రి పేరు, పుట్టిన తేది, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ etc,.) నింపి Submit చేయాలి.
  4. తర్వాత ఈ-మెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ లింక్, పాస్‌వర్డ్ వస్తాయి. ఆ లింక్ క్లిక్ చేసి పాస్‌వర్డ్ సహాయంతో ఆర్‌ఆర్‌బీ వెబ్ సైట్‌లోకి ప్రవేశించాలి.
  5. తర్వాత వచ్చే దరఖాస్తులో విదార్హతలు, పోస్టుల ప్రాధాన్య క్రమం, దరఖాస్తు చేసే బోర్డు, పరీక్ష కేంద్రాల ఎంపిక (5 కేంద్రాలు ఎంచుకోవచ్చు), ఫీజు చెల్లింపు విధానం వంటివి పూర్తి చేసి సబ్‌మిట్ చేయాలి.
  6. తర్వాత లాగిన్ అయి Upload Photo లింక్ ద్వారా 3.5 × 3.5 సె.మీ. 15-40 Kb ఉండే JPEG ఫోటో అప్‌లోడ్ చేయాలి.
    గమనిక: ఎస్సీ/ఎస్టీలు 50-100 Kb ఉండే కుల ధ్రువీకరణ పత్రాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. పరీక్ష రాయడానికి, సర్టిఫికెట్ల పరీశీలనకు సెకండ్ క్లాస్‌లో ఉచితంగా ప్రయాణించాలంటే ఈ పత్రం తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
  7. అన్ని వివరాలు సరిచూసుకొని ఫైనల్‌గా సబ్‌మిట్ చేసి దరఖాస్తును ప్రింట్ లేదా సేవ్ చే సుకోవాలి.
    గమనిక: దరఖాస్తులో ఏవైనా మార్పులు, చేర్పులుంటే ఫైనల్ సబ్‌మిషన్ తర్వాత కూడా Modify Application ద్వారా సరిచే సుకోవచ్చు. దీనికి ఎవరైనా అదనంగా రూ. 100 చెల్లించాల్సిందే. కాబట్టి దరఖాస్తు నింపేటప్పుడు అన్ని సరి చూసుకొని సబ్మిట్ చేయాలి.

ఎంపికవిధానం (Selection Process)
అన్ని పోస్టులకు ఉమ్మడిగా ఒకే Computer Based ఆన్‌లైన్ Test, సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. పోస్టు కోడ్ 05, 06, 09 లకు మాత్రం ఇంగ్లిష్ లేదా హిందీలో టైపింగ్ నైపుణ్య పరీక్ష (Typing Skill Test) ఉంటుంది. అభ్యర్థులు నిమిషానికి ఇంగ్లిష్‌లో అయితే 30 పదాలు, హిందీలో అయితే 25 పదాలు టైప్ చేయాలి.
అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్స్ పోస్టులకు మాత్రం ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీనికి 1:8 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సన్నద్ధత
అర్థమెటిక్:
శాతాలు, లాభ-నష్టాలు, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, మెన్సురేషన్, పెర్ముటేషన్, నిష్పత్తులు-విలువలు ముఖ్యమైనవి. ఈ విభాగంపై పట్టుసాధించడానికి హైస్కూల్ స్థాయి గణిత పుస్తకాల అధ్యయనంతోపాటు పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.

రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్: నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, క్లాసిఫికేషన్, డెరైక్షన్, క్యాలెండర్, క్లాక్, బాడ్‌మాస్. అభ్యర్థుల్లోని పరిశీలన నైపుణ్యాలను పరీక్షించేదిగా పేర్కొనే ఈ విభాగంలో రాణించాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, 1 నుంచి 25 వరకు మ్యాథమెటికల్ టేబుల్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.

జనరల్ అవేర్‌నెస్: ఈ విభాగంలో జనరల్ నాలెడ్జ్ నుంచి చరిత్ర, భౌగోళిక శాస్త్రం, సివిక్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సోషల్ పాఠ్య పుస్తకాలను ఔపోసన పట్టాలి. ముఖ్యమైన తేదీలు, ఘట్టాలు, వ్యక్తులు, రికార్డులు, యుద్ధాలు, ముఖ్యమైన భౌగోళిక వనరులు, సరిహద్దులు, నదులు, సముద్రాలు, పర్వతాలపై పరిపూర్ణత ఉండాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం గురించి ప్రాథమిక అవగాహన, వివిధ రాజ్యాంగ సంస్థలు, రాష్ట్రాలు- గవర్నర్లు వంటి విషయాల్లో నైపుణ్యం అవసరం. జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక అంశాల్లో పట్టు సాధించాలి. శాస్త్రసాంకేతిక అంశాలను అధ్యయనం చేయాలి. వ్యాధులు, వ్యాక్సీన్లు, విటమిన్లు, మోడ్రన్ ఫిజిక్స్‌లపై ఎక్కువ దృష్టిసారించాలి.

ఆప్టిట్యూడ్ టెస్ట్: అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్‌లకు ఉద్దేశించిన పరీక్ష ఆప్టిట్యూడ్ టెస్ట్. దీన్నే సిట్యుయేషన్ బేస్డ్ టెస్ట్ లేదా సైకలాజికల్ టెస్ట్ అని కూడా అంటారు. ఈ రెండు పోస్టులకు వంద మార్కులుగా నిర్వహించే ఎంపిక ప్రక్రియలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు 30 మార్కుల వెయిటేజీ (మిగతా 70 మార్కుల వెయిటేజీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో పొందిన మార్కులకు ఉంటుంది) ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఎనిమిది మంది (1:8) చొప్పున మలిదశ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అభ్యర్థుల్లో నిర్ణయాత్మక సామర్థ్యం, సమయస్ఫూర్తి ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.
ఆప్టిట్యూడ్ పరీక్షల గురించి మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులు చివరగా రేల్వే అధికారులు జరిపే మెడికల్ పరీక్షల్లో ఫిట్‌నెస్ సాధించాలి.

పరీక్ష విధానం (Scheme of Examination)
ఆబ్జెక్టివ్ ఆన్‌లైన్ రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు 100. సమయం 90 నిమిషాలు. జనరల్ అవేర్‌నెస్, అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెల్లిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌తో పాటు అన్ని భారతీయ భాషల్లో (రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలోని భాషలు) ఉంటుంది. ప్రశ్నల కఠిన స్థాయి డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మైనస్ మార్కులు విధిస్తారు.

పరీక్షా విధానం (మోడల్)

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

సమయం

జనరల్ అవేర్‌నెస్

50

50

 

అరిథ్‌మెటిక్

25

25

90 నిమిషాలు

జనరల్ ఇంటెల్లిజెన్స్ అండ్ రీజనింగ్

25

25

 

మొత్తం

100

100


పరీక్షా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్

అమలాపురం

అనంతపురం

భీమవరం

చల్లపల్లి

చీరాల

చిత్తూరు

ఏలూరు

గుత్తి

గుడివాడ

గూడూరు

గుంటూరు

కడప

కాకినాడ

కంచికచెర్ల

కావలి

కర్నూలు

నంద్యాల

నర్సాపురం

నర్సరావుపేట

నెల్లూరు

ఒంగోలు

ప్రొద్దుటూరు

పుత్తూరు

రాజ మండ్రి

రాజాం

రాజంపేట

శ్రీ‌కాకుళం

సూరంపాళెం

తాడేపల్లిగూడెం

టెక్కలి

తిరుపతి

విజయవాడ

విశాఖపట్నం

విజయనగరం

తెలంగాణ

హైదరాబాద్

కరీంనగర్

ఖమ్మం

కోదాడ

మహబూబ్‌నరగ్

నల్గొండ

నిజమాబాద్

రంగారె డ్డి

సికింద్రాబాద్

సిద్ధిపేట

వరంగల్


జీతభత్యాలు
కమర్షియల్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటిస్ పోస్టులకు రూ.9300 - 34800 పేబాండ్ ఉంటుంది. గ్రేడ్ పే రూ.4200. అలవెన్సులు కలపుకొని ప్రారంభంలో 35 వేల కంటే ఎక్కువగానే వస్తుంది. మిగిలిన పోస్టులకు రూ.5200 - 20200 పేబాండ్ ఉంటుంది. గ్రేడ్ పే రూ.2800. అన్ని అలవెన్సులు కలపుకొని 25 వేలకు పైనే వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి చాలా సౌకర్యాలుంటాయి. వాటితో పాటు కుటుంబం మొత్తానికి సెకండ్ క్లాస్ రైల్వే పాస్ సౌకర్యం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం: 26.12.2015
దరఖాస్తుకు చివరి తేది: 25.01.2016
పరీక్ష తేది: మార్చి - మే

Detailed Application Process: Click Here
 
నోటిఫికేషన్ - క్లిక్ చేయండి.
పాత ప్రశ్నా పత్రాలు - క్లిక్ చేయండి.
మాక్ టెస్టులు - క్లిక్ చేయండి.
గ్రూప్-డి ఆన్‌లైన్ పరీక్షలు - క్లిక్ చేయండి
గ్రూప్-డి మోడల్ పేపర్లు - క్లిక్ చేయండి
Published date : 25 Dec 2015 05:13PM

Photo Stories