Degree Exam Results: డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల డిగ్రీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ కోర్సుల ఫలితాలను వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్‌భాస్కర్ మంగళవారం విడుదల చేశారు. డిగ్రీ రెగ్యులర్‌గా నాలుగో సెమిస్టర్ 11,368 మంది రాయగా, 4199 మంది ఉత్తీర్ణత సాధించారు. 36.94 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీఏలో 1527కి 693, బీబీఏలో 165కి 122, బీసీఏలో 161కి 134, బీకాంలో 1832కి 563, బీఎస్సీల్లో 7683కి 2687 మంది ఉత్తీర్ణత సాధించారు. అనంతరం పీజీ ఫలితాలు విడుదల చేశారు. బీఎడ్ ఎంఆర్‌లో మొదటి సెమిస్టర్‌లో 33 మందికి 33 మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ రెండో సెమిస్టర్‌కు సంబంధించి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో 12 కి 12, ఎకనామిక్స్‌లో 12కి 12, ఇంగ్లిష్‌లో 8 కి 8, రూరల్ డెవలప్‌మెంట్‌లో 8కి 8, సోషల్ వర్క్‌లో 14 కి 14, తెలుగులో 9 కి 9, ఎంబీలో 60 కి 60, ఎంకాంలో 21కి 21, ఎంఈడీలో 35 కి 35, ఎంఎల్‌ఐఎస్సీలో 18 కి 18, ఎననాకల్ కెమిస్ట్రీలో 45కి 27, బయెటెక్నాలజీలో 24కి 24, ఫిజిక్స్‌లో 15కి 11, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 147కి 81, గణితంలో 9కి 9, జువాలజీలో 12 కి 11, మైక్రో బయోలజీలో 20కి 20, కంప్యూటర్ సైన్స్‌లో 27కి 21, అప్లయిడ్ మ్యాథ్స్‌లో 9 కి 9, సోషల్ వర్క్ నాలుగో సెమిస్టర్‌లో 6 కి 6 మంది ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 15 రోజుల్లోగా చేసుకోవాలని సూచించారు.
Tags
- Results
- degree exam results
- Degree 4th Sem Results
- Degree Exams
- Examination Results
- Dr. BR Ambedkar University
- Education News
- andhra pradesh news
- Results Announcement
- Academic news
- University updates
- higher education
- Affiliated Colleges Results
- Fourth Semester Examination
- Academic Achievements
- Educational Leadership
- Vice Chancellor Prof. Nimma Venkatarao
- Dean of Examinations Dr. S. Udaibhaskar
- Sakshi Education Latest News