Skip to main content

PJTSAU: పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ జూలై 12 నుంచి 15 వరకు నిర్వహించనున్నామని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఎం.వెంకటరమణ తెలిపారు.
PJTSAU
పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

పాలిసెట్‌–23 ర్యాంకులు, రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుందని జూలై 7న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కౌన్సెలింగ్, షెడ్యూల్, అభ్యర్థులు తీసుకురావలసిన సర్టిఫికెట్లు, ఫీజు తదితర వివరాలను  www.pjtsau.edu.inలో చూడాలని సూచించారు.

చదవండి: State Skill Development and Training Department: పాలిటెక్నిక్‌ సిలబస్‌ను ఏటా అప్‌గ్రేడ్‌ చేయాలి

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుర్తింపు పొందిన ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో రెండేళ్ల పాటు వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కో­ర్సులు, మూడేళ్ల పాటు డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 2023–24 విద్యా సంవత్సరానికి ఈ ప్రవేశాలు ఉంటాయని వివరించారు.

చదవండి: career after polytechnic: పాలిటెక్నిక్‌తో.. అద్భుత అవకాశాలు

Published date : 08 Jul 2023 04:27PM

Photo Stories