Skip to main content

Polycet 2023: పరీక్ష తేదీ ఇదే.. ప్రిపరేషన్‌ టిప్స్‌ మీకోసం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లోమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్‌–2023ను మే 10వ తేదీన నిర్వహించనున్నారు.
Polycet 2023
పాలిసెట్–2023 పరీక్ష తేదీ ఇదే.. ప్రిపరేషన్‌ టిప్స్‌ మీకోసం

ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి చైర్‌పర్సన్‌ చదలవాడ నాగరాణి ఫిబ్రవరి 16న ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాలిసెట్‌–2023 వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించడంతోపాటు ఆన్‌లైన్‌లో నమూనా దరఖాస్తును పూర్తిచేయడం ద్వారా నూతన విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ డిప్లోమా కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియకు నాంది పలికారు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని నాగరాణి తెలిపా­రు.

చదవండి: ఏపీ పాలీసెట్‌ - స్టడీ మెటీరియల్ | ప్రివియస్‌ పేపర్స్‌ | 10TH క్లాస్ తర్వాత | ఏపీ టెన్త్ క్లాస్ | టిఎస్ టెన్త్ క్లాస్

పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని, వ్యవధి 2 గంటలు కాగా, ప్రశ్నపత్రం మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుందని వివరించారు. పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఆసక్తిగల విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్‌కు శిక్షణ అందిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు విద్యార్థులు https:// polycetap.nic.in ని వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. తమకు సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని సహాయ కేంద్రాలను కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకులు పద్మారావు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రిపరేషన్‌ టిప్స్‌

  • ఈ సమయాన్ని విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకుంటే మంచి ర్యాంక్‌ సాధించేందుకు అవకాశముంది.
  • అభ్యర్థులు సిలబస్‌ ప్రకారం–మూడు సబ్జెక్టులకు సంబంధించి పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని..ప్రిపరేషన్‌ సాగించాలి.
  • గత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేసి.. ఏఏ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒక అంచనాకు రావాలి.
  • పదో తరగతి పాఠ్యపుస్తకాల అధ్యయనం పూర్తయ్యాక.. మోడల్‌ పేపర్లు, ప్రీవియస్‌ పేపర్లు సాధన చేయాలి.
  • ప్రణాళిక ప్రకారం ప్రతి సబ్జెక్ట్, టాపిక్‌ను పరీక్షకు వారం రోజుల ముందే పూర్తిచేసుకోవాలి.
  • పరీక్షకు ముందు పూర్తిగా రివిజన్‌ కోసం కేటాయించాలి. ఇందుకోసం ఇప్పటికే సిద్ధం చేసుకున్న షార్ట్‌ నోట్‌ను ఉపయోగించుకోవచ్చు.
Published date : 17 Feb 2023 05:45PM

Photo Stories