Skip to main content

EAMCET 2022: టీఎస్‌ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ...

TS EAMCET 2022 notification

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(టీఎస్‌సీహెచ్‌ఈ) తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ ఎంసెట్‌)–2022 నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీనిద్వారా ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌(జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహిస్తోంది.

అర్హత: టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల పొందే అభ్యర్థులు మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/ఆప్షనల్,ఒకేషనల్‌ కోర్సులు ఉత్తీర్ణత/డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

టీఎస్ ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 06.04.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.05.2022(ఆలస్య రుసుము లేకుండా)

పరీక్ష తేదీలు
అగ్రికల్చర్‌ అండ్‌ మెడిసిన్‌: 14, 15.07.2022
ఇంజనీరింగ్‌: 18, 19, 20.07.2022

వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in


​​​​​​​చదవండి: మోడల్ పేపర్లు | ప్రివియస్‌ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు
 

Last Date

Photo Stories