Skip to main content

KNRUHS: ఎంబీబీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం.. చివరి తేదీ ఇదే..

తేలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు నేటి నుంచి ఏప్రిల్ 2వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
MBBS
ఎంబీబీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం.. చివరి తేదీ ఇదే..

రెండో విడత కౌన్సిలింగ్‌ తరవాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని మార్చి 31న ఒక ప్రకటనలో పేర్కొంది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారని, ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు అర్హులని వివరించింది. గత కౌన్సెలింగ్‌లో సీట్‌ అలాట్‌ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్‌కంటిన్యూ చేసినా అదే విధంగా అల్‌ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని సూచించింది. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.inను చూడాలని తెలిపింది.

చదవండి: 

​​​​​​​Ukraine : మన వారు ఉక్రెయిన్‌ బాట పట్టడానికి కారణం ఇదే..!

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2022 06:04PM

Photo Stories