Telangana: మెడికల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న సీట్లు..?
ఇప్పటి వరకు ఉన్న 700 ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను.. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సంఖ్య 2,850కి పెంచుకోవడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా యూజీ సీట్లు 1640కి, పీజీ సీట్లు 934కు పెంచడం జరిగిందన్నారు.
After Inter BiPC: అవకాశాలు భేష్!
కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు..?
నిమ్స్‌లో ప్రస్తుతం 1400 పడకలు ఉన్నాయని, మరో 2 వేల పడకలు అదనంగా ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలలో డెడ్ బాడీల కొరత ఉందని, చట్ట సవరణ చేసి డెడ్ బాడీలను మెడికల్ కాలేజీలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్ కాలేజీలలో ఈ సంవత్సరమే క్లాసులు ప్రారంబిస్తామని వెల్లడించారు.
MBBS: ఇకపై విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..!