నీట్–పీజీ వాయిదా పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Sakshi Education
న్యూఢిల్లీ: నీట్–పీజీ 2023ను వాయిదా వేయాలన్న పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ప్రిపైరయ్యేందుకు చాలినంత సమయం లేనందున వాయిదా వేయాలని ఇంటర్న్‌షిప్ గడువు ముగియనందున కౌన్సిలింగ్ ఆగస్ట్ 11వ తేదీ తర్వాత చేపట్టాలని పిటిషన్లు కోరారు. దీనిపై ఫిబ్రవరి 27న జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణ చేపట్టింది. పరీక్ష తేదీ మార్పుకు ఈ దశలో అవకాశం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి చెప్పారు.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
‘‘తప్పో, ఒప్పో. పరిణామక్రమంలో ఇదంతా ఒక భాగం. ఇది కొన్నిసార్లు కరెక్టు, కొన్నిసార్లు తప్పు కావొచ్చు. మీరెలా అనుకుంటే అలా! పరీక్షను మరోసారి రాయాలనుకునే విద్యార్థిని ఈ ప్రపంచంలో ఏశక్తీ అడ్డుకోజాలదు’ అని పేర్కొంటూ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.
చదవండి: అవగాహన పెంచుకొని.. ఇప్పటి నుంచే సీరియస్ ప్రిపరేషన్ ప్రారంభిస్తే విజయావకాశాలు ఎక్కువ..
Published date : 28 Feb 2023 12:44PM