MDS: సీట్ల భర్తీకి నోటిఫికేషన్
విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ ఎండీఎస్–2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 25 ఉదయం 8 గంటల నుంచి 31 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్ణీత దరఖాస్తు పూరించి, సంబంధిత సర్టిఫికెట్లను https://tsmds.tsche.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం అర్హుల తుది జాబితాను యూనివర్సిటీ ప్రకటిస్తుంది. దరఖాస్తుకు సంబంధించి సాంకేతిక సమస్యలకు 9392685856, 7842542216, 9059672216, నిబంధనల కోసం 9490585796, 8500646769 నెంబర్లలో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించాలి. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ https://www.knruhs.telangana.gov.inను చూడొచ్చని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
చదవండి: