NEET: ‘నీట్’ ఫలితాలు.. ప్రిలిమినరీ ‘కీ’ వివరాలు
సాధారణంగా పరీక్ష జరిగిన నెలరోజుల్లో ప్రిలిమినరీ ‘కీ’తో పాటు పరీ క్ష ఫలితాలు విడుదల చేస్తారు. కానీ ఈసారి మహారాష్ట్ర, రాజస్తాన్ వంటి ప్రాంతాల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందనీ, ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరుగుతోంది. కొందరు విద్యార్థులు కోర్టుకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఫలితాలకు సంబంధించిన కనీస సమాచారాన్ని అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరచకపోవడంౖపె విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఇటీవల విద్యార్థుల పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఫలితాల వెల్లడికి అవాంతరాలు తొలగినట్లు కొందరు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వారం రోజుల్లో ప్రిలిమినరీ ‘కీ’, మరో 2 వారాల్లో ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
చదవండి:
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్ డ్ కౌన్సెలింగ్ తేదీల సమాచరం