NEET PG: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఆగస్టు 30, 31 తేదీల్లో యూనివర్సిటీ, కళాశాలల వారీగా సీట్ల వివరాలు వెల్లడిస్తామని Medical Counseling Committee(MCC) తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, 2వ తేదీ నుంచి 5 వరకు సీట్ల ఎంపికకు అవకాశం కల్పించారు. 5వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన.. 6, 7 తేదీల్లో సీట్ల కేటాయింపు, 8న ఫలితాలు ప్రకటిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 9 నుంచి 13 మధ్య కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
చదవండి: ఇదంత ‘నీట్’ కాదేమో!
మిగిలిన సీట్లకు అక్టోబర్‌లో మాప్–అప్ రౌండ్
రెండో విడతకు సంబంధించి సెప్టెంబర్ 17, 18 తేదీల్లో సీట్లను ప్రకటిస్తామని ఎంసీసీ తెలిపింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో విడత నిర్వహిస్తామని పేర్కొంది. సెప్టెంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, అలాగే 19వ తేదీ నుంచి 22 వరకు సీట్ల ఎంపికకు అవకాశం కల్పించారు. 22వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 23, 24 తేదీల్లో సీట్ల కేటాయింపు, 25న ఫలితాలను ప్రకటిస్తారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1లోగా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రెండు దశల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన పీజీ సీట్లకు అక్టోబర్ 6 నుంచి 18 వరకు మాప్–అప్ రౌండ్ నిర్వహించనున్నట్టు ఎంసీసీ తెలిపింది.