Skip to main content

యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓఈఓ/ఏఓ- 2021 పరీక్షా కేంద్రం మార్పుకు అవకాశం..

యూపీఎస్సీ.. ఈపీఎఫ్‌ఓ ఎన్‌ఫోర్స్ మెంట్ ఆఫీసర్ పరీక్ష రాసే అభ్యర్థు లకు పరీక్షా కేంద్రం మార్చుకోవడానికి అవకాశం కల్పించింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దేశవ్యాప్తంగా 2021 మే 9న (ఆదివారం) ఈపీఎఫ్‌ఓ (ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల నియామక పరీక్షను నిర్వహించాల్సి ఉంది. కోల్‌కతా, జైపూర్ రాష్ట్రాల అభ్యర్థుల నుంచి పరీక్షా కేంద్రం మార్పు కోసం అవకాశం కల్పించాలని అత్యధికంగా అభ్యర్థనలు రావడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ డిసెంబర్15 నుంచి పరీక్షా కేంద్రాన్ని మార్చుకోవచ్చు. అభ్య ర్థులు సవరించిన ఎంపిక కేంద్రాలను రెండు దశల్లో సమర్పించవచ్చు.

  • డిసెంబర్ 15 నుంచి 21 (సాయంత్రం 6 గంటల వరకు)
  • డిసెంబర్ 29 నుంచి 2021 జనవరి 4 (సాయంత్రం 6 గంటల వరకు)
భారతదేశం అంతటా 72 కేంద్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్/అకౌంట్స్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష జరుగుతుంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి: upsconline.nic.in
Published date : 14 Dec 2020 04:06PM

Photo Stories