యూఎక్స్ డిజైనింగ్‌లో నాస్కామ్ శిక్షణ
Sakshi Education
న్యూఢిల్లీ: యూజర్ ఎక్స్‌పీరియన్స్ (యూఎక్స్) డిజైన్‌లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణనిచ్చే దిశగా ఎడోబ్ ఇండియా, ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ చేతులు కలిపాయి.
శుక్రవారం యూఎక్స్ ఫౌండేషన్ ప్రోగ్రాంను ఆవిష్కరించాయి. నాస్కామ్‌కు చెందిన ఫ్యూచర్‌స్కిల్స్ ప్లాట్‌ఫాంపై నమోదు చేసుకున్న మొత్తం మూడు లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌కు ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది. యూఎక్స్‌కు సంబంధించి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు, నిపుణులు శిక్షణ పొందేందుకు ఇది ఉపయోగపడగలదని నాస్కామ్ ఫ్యూచర్‌స్కిల్స్ కో-ఆర్కిటెక్ట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. నిపుణుల కొరత కారణంగా పూర్తి స్థాయి నైపుణ్యం లేని వారిని యూఎక్స్ వ్యాపార సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల ఉత్పాదకత దెబ్బతింటోందన్నారు. ఈ నేపథ్యంలో 2021 నాటికి విద్యార్థులు, వృత్తి నిపుణుల యూఎక్స్ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చేందుకు ఈ ప్రోగ్రాంను ప్రయోగాత్మకంగా ఆవిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. శిక్షణ విషయంలో పరిశ్రమ భాగస్వామిగా కాగ్ని జెంట్ వ్యవహరిస్తుందని అగర్వాల్ పేర్కొన్నారు.
Published date : 29 Aug 2020 03:52PM