వీసీల నియామకానికి దరఖాస్తు గడువు జూన్ 12 వరకు పెంపు
Sakshi Education
కర్నూలు (ఓల్డ్ సిటీ): ఏపీలోని 3 యూనివర్సిటీల వైస్ చాన్సలర్ (వీసీ)ల పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తు గడువును ప్రభుత్వం జూన్ 12 వరకు పెంచింది.
జేఎన్‌టీయూ(కే), నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ, కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీశ్ చంద్ర గత నెల 2న జారీ చేసిన నోటిఫికేషన్ గడువు మే 21తో ముగియడంతో తాజాగా ఈ గడువును ప్రభుత్వం పెంచింది.
Published date : 04 Jun 2021 03:59PM