Skip to main content

వీసీల నియామకాలు జరిగేనా?

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పది యూనివర్సిటీలకు వీసీ నియామకాల కోసం చేపట్టిన సెర్చ్ కమిటీల సమావేశాలు చివరిదశకు చేరుకున్న తరుణంలో ఎన్నికల కోడ్ రావడంతో అధికారులు ఆలోచనల్లో పడ్డారు.
వీసీల నియామకాలను చేపట్టేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ, మహాత్మాగాంధీ, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీల సమావేశాలను పూర్తి చేసింది. పాలమూరు, తెలుగు వర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్, ఫైన్ ఆర్‌‌ట్స యూనివర్సిటీల సమావేశాలను పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే 4,5 రోజుల్లో వాటన్నింటినీ పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులు భావించారు. అయితే గురువారం ఎమ్మెల్సీ ఎన్ని కల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వీసీల నియామకాలు చేపట్టడం సాధ్యమవుతుందో కాదో నని అధికారులు ఆలోచనలో పడ్డారు. అయితే నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున, ఇబ్బందేమీ ఉండదని ఉన్నతాధికారులు పేర్కొం టున్నారు. ఎన్నికల కోడ్ వచ్చే నెల 23 వరకు ఉంటుంది కనుక ఆలోగా మిగితా యూనివర్సిటీల సమావేశాలను పూర్తి చేసి, గవర్నర్‌కు ఫైలును పంపించవచ్చని పేర్కొంటున్నారు. అయితే గవర్నర్ ఆమోదం తరువాత నియామకాలను ప్రకటించేందుకు కోడ్ అడ్డువస్తుందా లేదా అన్న విషయంపై స్పష్టత అవసరమని చెబుతున్నారు. అవసరమైతే ఎన్నికల కమిషన్ ఆమోదం తీసుకొని ప్రకటించే వీలు ఉంటుందని పేర్కొంటున్నారు.
Published date : 12 Feb 2021 04:10PM

Photo Stories