Skip to main content

వీసీల నియామక ప్రక్రియ వేగవంతం

సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్ల (వీసీ) నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
ఇటీవల 7 యూనివర్సిటీలకు పాలక మండళ్ల (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్-ఈసీ) ను నియమించిన ప్రభుత్వం ఇప్పుడు వీసీల నియామకంపై దృష్టి సారించింది. వీలైనంత త్వరగా వీసీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా వీసీల నియా మకం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీల్లో యూనివర్సిటీ నామినీని ఖరారు చేసే ప్రక్రియను చేపట్టింది. యూనివర్సిటీ ఈసీ నామినీ పేరును (కొత్త పేరు లేదా గతంలో ఇచ్చిన పేరునే ఆమోదిస్తూ) ఈ నెల 10వ తేదీలోగా పంపించాలని ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలోనే ఇచ్చినా...
ప్రస్తుతం రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేకపోగా జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు ఇన్‌చార్జి వీసీ కూడా లేరు. గతే డాది జూన్ 23న వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే నాటికి జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, ఆర్‌జీయూకేటీకి వీసీలు ఉన్నందునా వాటిని అప్పట్లో నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. దీంతో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూ, తెలుగు వర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా పోస్టులకు 273 మంది ప్రొఫెసర్లు, 984 దరఖాస్తు ఫారాలను అందజేశారు. వాటిని పరిశీలించి ఒక్కో వర్సిటీ వీసీ పోస్టు కోసం ము గ్గురి పేర్లను ప్రతిపాదించేందుకు సెర్చ్ కమి టీలను ఏర్పాటు చేసింది. వాటిల్లో ప్రభుత్వ నామినీగా ప్రస్తుత ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉన్నారు. యూ జీసీ కూడా నామినీలను నియమించింది. ఇ టు యూనివర్సిటీల నామినీ పేర్లను కూ డా యూనివర్సిటీల ఈసీల నుంచి ప్రభు త్వం తెప్పించుకుంది. అయితే నిబంధనల ప్రకారం యూనివర్సిటీ పూర్తి స్థాయి ఈసీ మాత్రమే సెర్చ్ కమిటీకి తమ యూనివర్సిటీ నామినీ పేరును ఇవ్వాలి. అప్పట్లో పూర్తి స్థాయి ఈసీలు లేనందునా సెర్చ్ కమిటీల భేటీలను నిర్వహించలేదు. అయితే ఈసీలను వెంటనే నియమించి వీసీల ని యామకాన్ని వేగవంతం చేయాలని గత నెల 19న సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో తెలుగు వర్సిటీ, అం బేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మినహా మిగతా 7 యూనివర్సిటీలకు ప్రభుత్వం పూ ర్తి స్థాయి ఈసీలను నియమించింది. ఇ ప్పుడు వీసీల పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక్కో యూనివర్సిటీ సెర్చ్ కమిటీలో ఉండాల్సిన యూనివర్సిటీ నామినీ పేర్లను ఈ నెల 10లోగా తమకు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యూనివర్సిటీలు ఆ మేరకు చర్యలు చేపట్టాయి. ఎలాగో ఈనెల 10 లోగా యూనివర్సిటీలకు నామినీలు వసా ్తరు కనుక యూజీసీ నామినీలతో మా ట్లాడి సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆ సెర్చ్ కమిటీలు ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురి పేర్ల ను ఇస్తే ప్రభుత్వం వాటిని యూనివర్సిటీలకు చాన్సలర్ అయిన గవర్నర్‌కు పంపించనున్నాయి. ఆ ముగ్గురిలో ఒకరి పేరును గవర్నర్ ఆమోదించనున్నారు. మొత్తానికి ఈ నెలాఖరులోగా ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూల వీసీల నియామకాలను పూర్తి చేసే అవకాశం ఉంది. కాగా, తెలుగు వర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పూర్తి స్థాయి ఈసీలను ఇంకా ని యమించలేదు. దీంతో వాటి తరఫున సెర్చ్ కమిటీల్లో ఉండే నామినీల పేర్లను ఇప్పట్లో ఖరారు చేసే అవకాశం లేదు. దీంతో వీసీ పోస్టుల దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరిగే అవకాశం ఉంది.
Published date : 07 Mar 2020 03:39PM

Photo Stories