విద్యార్ధులకు లక్ష్యంపై స్పష్టత ఉండాలి...!
Sakshi Education
ధర్మాన్ని రక్షిస్తే మనలను ధర్మం రక్షిస్తుంది. ధర్మార్థ కామమోక్షాలలో ధర్మానిదే అగ్రస్థానం.
శ్రీమద్రామాయణంలో శ్రీరాముడు తల్లి కౌసల్యతో తన ధర్మనిర్ణయాన్ని గురించి చెప్పిన మాటలు చూడండి. ‘‘అమ్మా! భోగాలపై అనవసరంగా ఆశలు పెట్టుకొని నేను ధర్మాన్ని నాశనం చేయలేను ధర్మాన్ని ఆచరించడం వల్ల వచ్చే యశస్సును వదలుకోను. ఎప్పుడు గతించిపోతామో తెలియదు. ఆయువు తృటికాలంలోనే అంతం కావొచ్చు. ఈ క్షణికమైన బ్రతుకు కోసం హీనమైన సంపదలకు వెంపర్లాడి ధర్మాన్ని చేపట్టకుండా ఉండటం ఎలా కుదురుతుందమ్మా?’’ అన్నాడట. అందుకే శ్రీరా ముడిని ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ అన్నారు. చదువు సంస్కారం కోసమే. ఆ లక్ష్యం కోసమే చదువు కోవాలి. కనుక చదువు లక్ష్యం సంస్కారమే. ఎందుకంటే చదువుకుంటున్నామనుకుంటున్నప్పటికీ, మార్కులు బాగానే వస్తున్నాయను కుంటున్నప్పటికీ మంచి మంచి ఉద్యోగాలొస్తాయని ఆశపడుతున్నప్పటికీ, డబ్బు బాగా సంపాదిం చొచ్చు అనుకుంటున్నప్పటికీ లక్ష్యం పట్ల స్పష్టత లేకపోతే పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ముందు జీవితమంతా కన్నీరవు తుంది. దానికి ప్రస్తుత సమాజమే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. దేశంలో ఇప్పుడుజరుగుతున్న నేరాలు- ఘోరాల్లో ఎక్కువ శాతం చేస్తున్నది ఎవరు? ఎక్కువగా చదువుకున్నోళ్ళే. చదువు వల్ల సంస్కారం అంటే మంచి స్వభావం ఏర్పడాలిగానీ ఉన్నది పాడవకూడదు గదా. నేటి సమాజంలో ఎక్కువగా జరుగుతున్నదంతా అదే! మనమంతా ప్రతిరోజూ ప్రత్యక్షంగా చూస్తున్నవాటికి సాక్ష్యాలు కావాలా? ఇప్పటికై నా ఈ సమస్యల నుంచి సమాజం బయట పడాలంటే సంస్కారమే లక్ష్యంగా చదువుకోవాలి. పిల్లలకు అలాంటి చదువే కావాలి.
Published date : 08 Feb 2020 03:40PM